Jump to content

వంశానికొక్కడు


ERK2NBK

Recommended Posts

ఏన్నొ మదురమైన మరపురాని సన్నివేశాలు మన నందమూరి 'వంశానికొక్కడు లో కొకొల్లలు... అందులో నాకు బాగా నచ్చిన సన్నివేశాలు మూడు ఉన్నాయి.... వాటిలో ఇధి ఒకటి... ఇది విరామానికి ముందు జరిగే దత్తత స్వికారం..

 

రాజా (బాలక్రిష్ణ):

నేను పుట్టిన ఈ నేల సాక్షిగా.. నాకు నీడనిస్తున్న ఆ నింగి సాక్షిగా ... హిందు సంప్రదాయానికి బద్దుడనై మీకు తలకొరివి పెట్టే కొడుకునవుతాను,

ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరచిపోయి, మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడుగా సఖల థర్మాలు నిర్వర్తిస్థాను......

నిష్కల్మష హ్రుదయంతో నిష్కలంఖంగా బ్రతుకుతానని ... ప్రేగుతెంచుకు పుట్టక పొయినా, మీ రక్తాన్ని పంచుకుపుట్టిన పుట్టిన కొడుకునవుతానని ప్రమాణం చేస్తున్నాను.

 

చక్రపాణి(సత్యణ్ణారాయన): ఎమిటి ఈ తతంగం      

 

రాజా (బాలక్రిష్ణ):

 

తతంగంకాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం...

క్షణం క్రితమే నేను దార్మిఖంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను,  

ఇది బారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు,బారత న్యాయ శాస్త్రంలో ఎక్కడా అచ్చై ఉండకపొవచ్చు, బారత శిక్షా స్మ్రుతిలో ఏ పేజీలోను కనిపించకపోవచ్చు.... కాని కర్మను నమ్మే ఈ కర్మ భూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెపుతున్నాను ఈ క్షణం నుంచి నేను మీ వంశానికి కాదు ఈ వంశానికొక్కడిని.                    

Link to comment
Share on other sites

లీలావతి(జయంతి):

నువ్వు చేసిన పనికి అర్దం ఎమిటిరా?  

 

రాజా(బాలక్రిష్ణ):

ధర్మం, శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ దర్మం...

శ్రావణకుమారుడనే ముని కుమారుడిని దశరధుడు తెలియకుండానే చంపాడు, కొడుకుని పోగొట్టుకున్న ఆ దంపతులు నువ్వు మాలానే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు, ఆ శాపం మూలంగానే దశరదుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు....

 

లీలావతి(జయంతి):

తప్పుచేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు కాని ఏ తప్పు చెయ్యని నాకెందుకీ శిక్షా? ఇదెక్కడి న్యాయం రా?

 

రాజా(బాలక్రిష్ణ):

ఇది న్యాయమా అని ఆనాడు కౌసల్య రాముణ్ణి అడగలేదమ్మా.... నేను ఈ త్యాగాన్ని చేసింది గొప్పవాడిని కావాలని కాదు.. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపంగా మారకుడదని...

నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిడండ్రులకు తలకొరివిపెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు అందుకే ముగవేదననుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని అశీర్వదించమ్మా.

 

లీలావతి(జయంతి):

ముందరికాళ్ళకు భంధం వేయడమంటే ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు చూస్తున్నాను..

 

బ్రహ్మణుడు:  

అమ్మగారు మీ వెండి కుంకుమ భరెన మరచిపొయారు

 

లీలావతి(జయంతి):

బంగారంలాంటి కొడుకే దూరమైపోయాడు.. దాన్ని ఆ దేవుడికే కానుకగా ఇచ్చెయ్యండి.

 

నువ్వు నన్ను అమ్మా అని పిలవక పొయినా పర్వాలేదు, కాని నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని మాత్రం అనకు బాబు..

 

బాలయ్యకు మత్రమే సాద్యమయ్యే అద్బుతమైన వాచకం,  అభినయం, బావొద్వేగానికి ఈ సన్నివేశం ఓ నిదర్శనం... పరుచూరి సొదరుల అద్బుతమైన సంబాషణలకి బాలయ్య తన అనితరసాద్యమైన నటనతో జీవం పోశాడు.                

 

(fireworks)(fireworks1)(fireworks1)(ringelrein)

Link to comment
Share on other sites

Naaku nachhina balayya movies lo Top 5 loo vuntunddi ee movie. balayya chala andamga vuntaadu ee movie loo and songs all r excellent. "Priya Maha shaya" song ayithee one of the best songs loo okati. manchi romantic and class song. Aaa movie release time loo anna gaaru chani poyaru kabatti movie ni mana vaallu peddaga pattinchu kooledu. aa sankranthi hits loo manadee hit .

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...