Jump to content

Oka Yuvakudu...


KilaDi No.1

Recommended Posts

సరిగ్గా 35 సంవత్సరాల క్రితం స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.

 

రచ్చబండ్లమీద, ఇంటి తిన్నెల మీద సేద తీరాడు.చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేర వద్దే అడ్డుకున్నా మడమ తిప్పలేదు.ఓ జత గుడ్డలు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు.. ఇంతకు మించి మరే హంగామా లేకుండా కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగాడు.

 

చేతిగుర్తుకే ఓటు వేసి తనను గెలిపించమని అభ్యర్థించాడు. తలపండిన ఉద్ధండులను ఢీ కొని ఎన్నికల్లో గెలిచాడు. సరిగ్గా 35 ఏళ్ళ తరువాత ఆనాటి యువకుడే మళ్ళీ అదే మార్గం గుండా పాదయాత్ర ప్రారంభిం చనున్నాడు. ఆయనే తెలుగుదేశాధీశుడు నారా చంద్రబాబు నాయుడు.ఆ రోజు తన రాజకీయ జీవితానికి పునాదుల కోసం కాలినడకన ప్రచారం సాగించిన చంద్రబాబు ఇప్పుడు పార్టీ మనుగడ కోసం సొంత జిల్లాలోనూ పాదయాత్రకు ఉపక్రమించారు. ఆనాడు ఇంటింటికీ కాలినడకన తిరిగి ప్రత్యక్షంగా ఓటు అభ్యర్థించడం ద్వారా ఎన్నికల ప్రచారంలో కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు అన్నదాతల మద్దతు కోసం రైతు పోరుబాట పేరుతో మొదలు పెట్టిన పాదయాత్ర ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సివుంది.

 

404203_304569126256111_100001090793520_868047_1060643561_n.jpg

 

Got this from CBNlivenews.com

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...