Jump to content

Lucky NTR


Cyclist

Recommended Posts

15న నందీశ్వరుడు

 

 

ntr.jpgనందమూరి తారకరత్న టైటిల్‌రోల్‌ పోషించగా, జగపతిబాబు పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటించిన ‘నందీశ్వరుడు’ చిత్రం 11న సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌ సభ్యుల అభినందనలు, ప్రశంసలను పొందింది. ఈ చిత్రాన్ని 15న సంక్రాంతి పర్వదినాన విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలలో ఒకరైన డా.గంగాధరరెడ్డి.కె తెలియజేశారు. శీను యరజాల దర్శకత్వంలో కె.ఎఫ్‌.సి మరియు ఎస్‌.ఆర్‌.బి. ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అత్యంత భారీస్థాయిలో అత్యధిక కేంద్రాలలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గంగాధరరెడ్డి మాట్లాడుతూ ‘ మా ‘నందీశ్వరుడు’లో యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీ, రొమాన్స్‌ వంటి అన్ని అంశాలు సమపాళ్లలో ఉన్నాయి.

 

అందుకే సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు మా చిత్ర యూనిట్‌ని అభినందనలతో ముంచెత్తారు. తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతి రోజున ‘నందీశ్వరుడు’ అనే అచ్చ తెలుగు టైటిల్‌తో తెలుగు నేటివిటీకి అద్దం పట్టేలా రూపొందించాం. మా చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ భారీస్థాయిలో లభిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. నందమూరి కుటుంబం నుంచి ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమా విడుదలై విజయవంతం అవుతోంది. ఈ సారి ఆ ఫ్యామిలీకి హిట్‌ ఇచ్చే అవకాశం, అదృష్టం తారకరత్నకి ‘నందీశ్వరుడు’ రూపంలో వచ్చింది అన్నారు నిర్మాత సేగు రమేష్‌బాబు. భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, కెమెరా: సుధాకర్‌రెడ్డి, సంగీతం: పార్ధు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యువరాజ్‌, నిర్మాతలు: డా. కోట గంగాధర్‌రెడ్డి, కె.సేగు రమేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీను యరజాణ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...