Jump to content

10 / 10


Cyclist

Recommended Posts

'నందీశ్వరుడు'గా పదికి పది మార్కులూ ఇచ్చుకుంటా

 

 

సూర్య వార్త)

nandeeswarudu_hq_wallpapers_posters_007.jpg

"నా నటన విషయానికొస్తే పదికి పది మార్కులూ ఇచ్చుకుంటా. డబుల్ పాజిటివ్ చూశాక నన్ను నేనే నమ్మలేకపోయా, నాలో ఇంతటి నటుడున్నాడా అని'' అని చెప్పారు నందమూరి తారకరత్న (ఎన్టీఆర్). యస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోట గంగాధరరెడ్డి, శేగు రమేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించిన 'నందీశ్వరుడు'లో ఆయన టైటిల్ రోల్ పోషించారు. శ్రీను యరజాల దర్శకుడు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా తారకరత్న చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే... ఈ సినిమా చేయడానికి నన్ను మొదటగా ప్రేరేపించింది 'నందీశ్వరుడు' కేరక్టర్. ఇందులో నా పాత్ర పేరు అదే. అంతా నందూ అని పిలుస్తారు. ఆరేళ్ల నుంచి ఈ కథ మీద దర్శకుడు శ్రీను, నేను ప్రయాణిస్తూ వచ్చాం. శ్రీను సిన్సియారిటీ, కమిట్‌మెంట్ బాగా నచ్చాయి. నాకు చెప్పిన దానికంటే 90 శాతం బాగా చేశాడు.

 

అతడి దే క్రెడిట్ ఈ తరహా పరిణతి చెందిన మాస్ రోల్ చెయ్యడం నాకిదే తొలిసారి. అభినయానికి ఎక్కువ అవకాశమున్న పాత్ర. విద్యార్థిగా ప్రారంభమై, చివరికి సమాజానికి సేవచేసే పాత్ర. పేరుకి ఇది కన్నడ హిట్ ఫిల్మ్ 'డెడ్లీ సోమా'కు రీమేక్ అయినా, 80 శాతం దానికి భిన్నంగా సొంత స్క్రిప్టు తయారుచేశాడు శ్రీను. హీరో గెటప్ నుంచి అన్నీ భిన్నమే. నా నటన విషయానికొస్తే, అతిశయంగా చెప్పడం లేదుకానీ, పదికి పది మార్కులూ ఇచ్చుకుంటా. డబుల్ పాజిటివ్ చూశాక నన్ను నేనే నమ్మలేకపోయా, నాలో ఇంతటి నటుడున్నాడా అని. వెంటనే డైరెక్టర్ని కౌగలించుకున్నా. క్రెడిట్ అంతా అతడిదే. ఈ సినిమా తర్వాత శ్రీను నాకే దొరకడు. అంత బిజీ అవుతాడు. ఎంతో నేర్చుకున్నా జగపతిబాబు సినిమాలు చూసి పెరిగిన నేను ఇందులో ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని ఎంతగానో ఆస్వాదించా. కొన్ని సన్నివేశాల్లో తనని తాను డీగ్రేడ్ చేసుకొని నటించారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా. నా తల్లిదండ్రులుగా సీత, సుమన్ నటించారు. వాళ్ల పాత్రలూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.

 

ప్లస్ పాయింట్స్ పాటలూ, యాక్షనూ ప్లస్ పాయింట్స్. సంగీత దర్శకుడిగా తొలి చిత్రమే అయినా పార్థసారథి అద్భుతమైన బాణీలిచ్చాడు. ఇక స్టంట్ డైరెక్టర్‌గా థ్రిల్లర్ మంజుకు ఇది కమ్‌బ్యాక్ మూవీ. చాలా గొప్పగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందించారు. పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగ్స్‌కి పెట్టింది పేరు. అలాగని ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సందర్భానుసారం చక్కని సంభాషణలు రాశారు బద్రర్స్. సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అసాధారణం. గతం గతమే కెరీర్‌లో ఎత్తుపల్లాలున్నాయి. గతం ఎప్పటికైనా గతమే. ఇప్పటిదాకా నేను నేర్చుకుంటూ వచ్చా. బాలయ్య బాబాయ్ 'సక్సెస్ వస్తే కళ్లు నెత్తికెక్కించుకోకు' అని చెప్పారు. ఆ మాటల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.

 

పోటీ సినిమా కాదు మహేశ్, వెంకటేశ్ బాబాయ్ డిఫరెంట్ లెవల్ యాక్టర్లు. అందువల్ల వాళ్ల సినిమాలు 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్'కు నా 'నందీశ్వరుడు' పోటీయే కాదు. కానీ నా సినిమా మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఇది నా తొలి సంక్రాంతి సినిమా. మళ్లీ శ్రీనుతోటే నా తదుపరి సినిమానూ శ్రీను డైరెక్షన్‌లోనే చేయబోతున్నా. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తాం. 'అమరావతి'లో చేసినటువంటి నెగటివ్ రోల్ మళ్లీ చేయడానికి నేను రెడీ. అయితే ఆ కేరక్టర్ పేరు తెచ్చేదిలా ఉండాలి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...