Jump to content

వేలాది జనం మధ్య బాలయ్య కేక


upendra9999

Recommended Posts

రాజకీయ నేపథ్యంలో (కర్నూల్‌) వేలాది జనాల మధ్య బాలయ్యతో చేసిన ఓ పాట హైలైట్‌ అంటున్నారు ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి.బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తికంబైన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 20న యూరప్‌ వెళుతున్న సందర్భంగా నిర్మాత ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం కర్నూలులో చిత్రీకరణ సాగుతోంది. ఈ షూటింగ్‌తో.. 2పాటలు, 4రోజుల టాకీ మినహా సినిమా పూర్తవుతుంది. బాలయ్య స్థాయికి తగ్గని రీతిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. హీరో 3 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. పాత్రలు మారేప్పుడు..ఆశ్చర్యకర రీతిలో నటనా వ్యత్యాసం చూపిస్తున్నారు. దర్శకుడు మురళి మా సంస్థకు 3హిట్‌లు ఇచ్చారు. తన ప్రతిభ సహా కళ్యాణి మాలిక్‌ సంగీతం అలరిస్తుంది. రాజకీయ నేపథ్యంలో (కర్నూల్‌) వేలాది జనాల మధ్య బాలయ్యతో చేసిన ఓ పాట హైలైట్‌. యాక్షన్‌, సెంటిమెంట్‌, కుటుంబ డ్రామా, కామెడీ..ఇలా అన్ని అంశాలతో తెరకెక్కుతోంది’’ అన్నారు.

 

మరో ప్రక్క దర్శకుడు పరుచూరి మురళి... “ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాని కీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ అధినాయకుడు శ్రీరామరాజ్యం విడుదల అయిన రెండు నెలల గ్యాప్ లోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. అంటే శ్రీరామరాజ్యం రిలీజ్ కాకముందే అధినాయకుడు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబు అవుతుంది. లక్ష్మీరాయ్‌, సలోని కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్‌, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, ఆదిత్యమీనన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: కళ్యాణిమాలిక్‌, కెమెరా: జయ్‌.సి.కుమార్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్‌.

Link to comment
Share on other sites

Nellore lo nijamaina fans ki tickets ravadam ledhu baners veyyenchi maaku tickets dorakaka 60 rs ticket ni black lo 600 rs konukkoni chusamamu ikkada chala mandi nalanti fans gora avamanam jaruguthundi

 

deenikanthatiki karanam rajakeya nayakulu ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, anni tickets thesukelli adho kontha main fans 3 or 4 memberski tickets echi migatha antha rajakeya nayakula relations ki frnds vallaki telisina vallaki echukuntunaru ekkada malanti fans bali avvuthunaru nellore lo chala goram jaruguthundi fans ki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...