Jump to content

SEPTEMBER - 5


Diehard

Recommended Posts

బళ్లారి, సెప్టెంబర్ 24 : 'గాలి' చుట్టూ ఉచ్చు బిగుసుకుని చివరికి అతను కటకటాల పాలవడానికి కారణం మరొకటుందట.. అతడి పాపం పండిందట.. శాపం తగిలిందట.. అమ్మ సుగ్గిలమ్మ 'గాలి'పై కన్నెర్ర జేసిందట.. అందుకే ఆయన ఓబుళాపురం గనుల్లో ఉన్న మహాశక్తి మాత (సుంకులమ్మ) ఆలయాన్ని కూల్చినప్పటి నుంచి ప్రతీ ఏడాది అదే నెలలో అంటే సెప్టెంబర్‌లో 'గాలి'కి ఆపద వాటిల్లుతోందట.. చివరికి అదే నెల్లోనే ఆ అమ్మ అతడిని ఊచలు లెక్కపెట్టేలా చేసిందని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు..

 

అప్పట్లో నాలుగుసార్లు పేల్చినా సుగ్గిలమ్మ దేవాలయం పేలలేదని, చివరికి కేరళ నుంచి ఒక క్షుద్ర మాంత్రికుడిని పౌర్ణమి రోజు పిలిపించి అమ్మను శక్తి హీనురాలిని చేసి గుడిని పేల్చారని ప్రత్యక్షసాక్షులు కొందరు చెబుతున్నారు. పూర్వం శ్రీ కృష్ణదేవరాయల రాజధాని హంపీ ఆస్థానంపై బీజాపూర్ నవాబులు దాడిచేసిన సమయంలో ఖజానాను ఇక్కడికి తరలించి దాచిపెట్టారని, గుడిని పేల్చినప్పుడు రెండు లారీల బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు గాలికి లభించాయనే వదంతులున్నాయి.

Link to comment
Share on other sites

మరి ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో జరిగిన సంఘటనలను ఓ సారి పరిశీలిద్దాం..

* ఓబుళాపురం గనుల్లోని మహాశక్తి మాత పురాతన దేవాలయాన్ని (సుంకులమ్మ గుడి) 2006, సెప్టెంబర్ 5న 'గాలి' పేల్చేశారు.

 

* అలకుంది వద్ద 2007 సెప్టెంబర్ 5న గాలి సన్నిహితుడు శ్రీరాములు, గాలి సోదరుడిపై అలకుంది గ్రామస్థులు పెద్ద గొడవ చేశారు.

 

* 2008 సెప్టెంబర్ 5న గాలి కరుణాకర్ రెడ్డి, జనార్దన్‌రెడ్డి ఇంటిలోకి ఒక పాప రూపంలో అమ్మవారు వచ్చి .. 'నన్ను శక్తి హీనురాలిని చేశారు. మీ అంతు చూస్తా' అని హెచ్చరించినట్లు చెబుతున్నారు.

 

*2009 సెప్టెంబర్ 2న 'గాలి' జనార్దన్‌రెడ్డి మిత్రుడు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సెప్టెంబర్ 5న ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.

 

* 2010 సెప్టెంబర్ 5న గాలి కరుణాకర్‌రెడ్డి ఇంట్లో ఆయన ఆరాధ్య దైవమైన కోటే మల్లేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం మూడు ముక్కలుగా విరిగిపోయింది. అనంతరం ఆ ఇంట్లో సర్పం చేరుకున్నట్లు చెబుతున్నారు.

 

*2011 సెప్టెంబర్ 5న ఓబుళాపురం గనుల్లో జరిగిన అక్రమాలపై గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను బళ్లారిలోఅరెస్టు చేశారు.

 

* ఈ సంఘటనలను బట్టి గాలికి అమ్మ వారి శాపం తగిలిందని, అందుకే అన్ని అశుభాలూ ప్రతిఏటా అదే నెలలో జరిగాయని స్థానికులు చెప్పుకొంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...