Jump to content

స్వామిగౌడ్‌-పార్టీల మాటలు విని ఉద్యోగులు మోసపోయార


navalluri

Recommended Posts

సకల జనులెక్కడ ?

 

 

(సూర్య ప్రధాన ప్రతినిధి)‘ఏ రాజకీయ నాయకుడి చైతన్యం ఉద్యోగులకు అవసరం లేదు. ఇక్కడ చైతన్యం వచ్చే ఉన్నరు. ఇదో కొత్త చైతన్యం మాకొద్దు. నీ చైతన్యం నీ నియోజకవర్గంలో అక్కడ చూపించుకో. నీ బండారం ఆడ బయటపడతది. అందుకే మనం రాజకీయ వ్యవస్థను నిలదీయాల్సిన అవసరం ఉంది. జేఏసీలో లేని ఏ నాయకుడిని శిబిరాల్లో మన దగ్గర కాలుబెట్టనీయవద్దు. ఆడిని రానిచ్చినమంటే ఆడి మాయమాటలకు ఎప్పుడు ఇనికి పోతమో మనకే తెలియదు. అంత బంగారు మాయమాటలుంటాయ్‌ వాళ్లవి. సకల సజనుల సమ్మె ఏదీ? ఎవనంతట వాడు పోతనే ఉన్నడు. వస్తనే ఉన్నడు. బస్సులు తిరుగుతూనే ఉన్నయ్‌. పబ్లిక్‌ తిరుగునే ఉంది.

 

ఏరీ సకల జనులు? ఏరీ రాజకీయ నాయకులు? ఎవరు సమ్మెలున్నరు? ఉద్యోగులు చేస్తేనే సమ్మె. ఇది సకలోద్యోగుల సమ్మె. ఉద్యోగులు పది, ఇరవై రోజులు సమ్మె చేసి, ఇగ మాకు చేతగాదని మానేస్తే.. ఇంకా ఐదురోజులు చేయకపోతిర్రా.. తెలంగాణ వస్తుండె.. అని అప్పుడే లేచొచ్చిన లుచ్చాలు నామీద రాళ్లేస్తరు. రేపెవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే లాగి చెంపదెబ్బ కొట్టకొట్టండి. లమ్డికొడకా నీవెన్నిరోజులు చేస్తివిరా సమ్మె? ఎప్పటిదాకా చేస్తివరా సమ్మె అని నిలదీయండి. పదిరోజులు మించి సమ్మె చేయలేం. అంతకుమించి బలవంతం చేస్తే సహించవద్దు. రాజకీయ నేతలు మనల్ని పట్టించుకోవడం లేదు’ - ఈ మాటలు ఎవరివో తెలుసా? తెలంగాణ సకల జనుల సమ్మెకు సార ధ్యం విహస్తోన్న ఉద్యోగుల జేఏసీ నేత కె. స్వామిగౌడ్‌వి. రాజకీయ నాయకుల కంటితుడుపు మద్దతు, పెదవులకే పరిమితమైన సంఘీభావంతో ఉద్యోగులు ఏ స్థాయిలో విసిగి వేసారిపోయారో స్వామిగౌడ్‌ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమయింది.

 

గత కొద్దిరోజుల నుంచి రాజకీయ నాయకులు, ప్రధానంగా సకల జనుల సమ్మెను తెరవెనుక ఉండి నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌.. సమ్మెకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఆగ్రహం కలిగిస్తోంది. తమను ముందుకు నెట్టిన రాజకీయ నాయకులు సీరియస్‌గా రంగంలోకి దిగడం లేదన్న ఆక్రోశంతో ఉన్నారు. స్వామిగౌడ్‌ మాటలు నిశితంగా పరిశీలిస్తే మరో పదిరోజుల వరకే ఉద్యోగులు సకల జనుల సమ్మె చేయగలరన్న విషయం స్పష్టమవుతోంది. ‘మీరు మాకు సమ్మెకు ముందు చెప్పినదేంది? ఇప్పుడు చేస్తున్నదేంది? రోడ్లపై బస్సులు తిరగనీయమన్నారు. సర్కారు కార్యాలయాలకు తాళాలు వేస్తామన్నారు. రోడ్లు తవ్వేస్తమన్నారు.

 

సరిహద్దులు మూసివేస్తామని అన్నారు. కానీ మీరు చెప్పిన మాటల్లో ఒక్కటీ జరగనప్పుడు మేం సమ్మె చేసి ఏం ప్రయోజనమ’ని గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు టీఆర్‌ఎస్‌, బీజేపీ, జాక్‌ నేతలపై విరుచుపడినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్వామిగౌడ్‌ ఆగ్రహం, ఆయన విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల మాటలు విని ఉద్యోగులు మోసపోయారని స్పష్టమవుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డుపెట్టుకుని, ఉద్యోగులను పావులుగా వాడుకుం టున్నారన్న విమర్శలను స్వామిగౌడ్‌ ఆవేదన నిజం చేసేలా ఉన్నాయి.

 

In 1969 all telangana public and private sectors followed bandh so then in assembly bill was passed and then it was send to centre but indira Gandhi didn't liked the proposal and toren the paper and kept in a dustbine by indira, "sakalajanula samme" had become now "govt officers samme" because people are busy with their own works and only TRS is doing nonsense and trying to get benefited now swami goud gave an ultimatum to KCR that he promised all will be closed in telangana if KCR didn't keep his words in 10 days GOVT officials will goto offices.

Link to comment
Share on other sites

correct gaa raasaru...idi govt employees samme...migatha janalantha valla valla panullo unnaru....ee samme pvt travel operators ki...private hospitals ki...auto vallaki labham chekurchataniki thappithe enduku panikiravatam ledu.

 

 

same opinion...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...