Jump to content

JAI SREERAMA


SPK

Recommended Posts

 

ఎవరు రాసారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది. చదవండి.

 

ఇంగ్లీషు వాడు, సెక్యులరిజం వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మన దిన వారీ చర్యల్లో మనవెంట నడిచిన దేవుడు .

 

🌺మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు

 

🌺మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .

 

🌺ధర్మం పోత పోస్తే రాముడు

🌺ఆదర్శాలు రూపుకడితే రాముడు 

🌺అందం పోగుపోస్తే రాముడు 

🌺ఆనందం నడిస్తే రాముడు

 

🌷వేదోపనిషత్తులకు అర్థం రాముడు

🌷మంత్రమూర్తి రాముడు .

🌷పరబ్రహ్మం రాముడు .

🌷లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

 

🌺ఎప్పటి త్రేతా యుగ రాముడు ?

🌺ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?

🌺అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

 

🌺చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

"శ్రీరామరక్ష సర్వజగద్రక్ష."

 

🌺బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - "రామాలాలీ - మేఘశ్యామా లాలీ"

 

🌺మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - 

శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.🌺

 

🌺మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - "అయ్యో రామా"!

 

🌺వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

"రామ రామ"😢

 

🌺భరించలేని కష్టానికి పర్యాయపదం -

"రాముడి కష్టం "

 

🌺తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే -" రాముడు"

 

🌺కష్టం గట్టెక్కే తారక మంత్రం - "శ్రీరామ"

 

🌺విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట -"శ్రీరామ రామ రామేతి"

 

🌺అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - 

"అన్నమో రామచంద్రా"

 

🌺వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

"కృష్ణా రామా !"

 

🌺తిరుగులేని మాటకు - " రామబాణం "

 

🌺సకల సుఖశాంతుల పాలనకు పర్యాయ పదం - "రామరాజ్యం"

 

🌺ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

 

🌺ఆజానుబాహుడి పోలికకు - రాముడు

 

🌺అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 

 

🌺రాముడు ఎప్పుడూ మంచి బాలుడే 🌺

 

🌺ఆదర్శ దాంపత్యానికి " సీతారాములు"

 

🌺గొప్ప కొడుకు - "రాముడు"

 

🌺అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక - "రామలక్ష్మణులు"

 

🌺గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

 

🌺మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).

 

🌺మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).

 

🌺కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - 

రాముడు 

🌺నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు 

🌺చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు 🌺చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు 

🌺జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .🌺

 

🌺రామాయణం పలుకుబళ్లు...🌺

 

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

 

తెలుగులో కూడా అంతే .

 

🌺ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...

 

🌺చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .

 

🌺జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

 

🌺ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం

 

🌺కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .

 

🌺వికారంగా ఉంటే -

శూర్పణఖ

 

🌺చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

 

🌺పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.

 

🌺మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర

 

🌺పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .

 

🌺ఎంగిలిచేసి పెడితే - శబరి

 

🌺ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

 

🌺అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ 

 

🌺విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .

 

🌺పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.

 

🌺సాయం చేసినపుడు- ఉడుతా భక్తి..

🌺కార్యాన్ని సాధించినపుడు - హనుమ యుక్తి..

🌺 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిణి

 

🌺యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

 

🌺ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)

 

😂కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

 

🌺సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . 

🌺బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. 

🌺ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.

🌺ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . 

🌺ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

 

🌺ఒంటిమిట్టది ఒక కథ ..

🌺భద్రాద్రిది ఒక కథ

🌺అసలు రామాయణమే మన కథ .

🌺అది రాస్తే రామాయణం

🌺చెబితే మహా భారతం

🌺రామాలయం లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు.

🌺ముందుగా శ్రీరామ నామం రాయని పద్దు, ఉత్తరం ఉండేది కాదు

🌺ఉత్తర భారతం లో హలో పలకరింపు రామ్..రామ్.

🌺 దోస్తు విడిపోయారు అనుకోవలన్నా నీకూ నాకూ రాం రాం

 

🌺అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు.

 

🌺రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజార్టీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

 

🌺|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే 

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||🌺

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...