Sravanlokesh Posted July 12, 2011 Share Posted July 12, 2011 * శరీరానికి అతుక్కుపోతున్న ఇనుప వస్తువులు * వింతను చూసేందుకు తరలివస్తున్న జనం * అతుక్కుపోతున్న ఇనుప చువ్వలు, నాణేలు * మాగ్నటిక్ ఎఫెక్టే కారణం శరీరానికి ఇనుప చువ్వలు, రూపాయి బిళ్లలు అతుక్కుపోతే ఎలా ఉంటుంది? ఇనుప వస్తువులేంటి శరీరానికి అతుక్కోవడమేంటని ఆలోచిస్తున్నారా! ఎందుకాలస్యం... ఈ వింతను చూడాలంటే అనంతపురం జిల్లాలోని సేవామందిర్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ బాలుడి గురించే. పేరు పవన్ కుమార్. ఊరు అనంతపురం జిల్లాలోని సేవామందిర్. కొద్ది రోజులుగా ఇనుప చువ్వలు, రూపాయి బిళ్లలు ఇతడి శరీరానికి అంటుకుపోతున్నాయి. అటూ ఇటూ కదిలినా అవి ఏమాత్రం పడిపోవు. రెండు నెలల క్రితం ఓ పేపర్లో బాలుడి శరీరానికి ఇనుప వస్తువులు అతుక్కుపోతున్న విషయాన్ని పవన్‌కుమార్ చదివాడు. తన శరీరానికి కూడా అతుక్కుంటాయేమోనని చూశాడు. ఆశ్చర్యం.. తన బాడీకి కూడా ఇనుప వస్తువులు, కాయిన్స్ అతుక్కుపోతున్నాయి. అంతే వెంటనే విషయాన్ని తండ్రికి వివరించాడు. ఈ వింతను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. మాగ్నటిక్ ఎఫెక్ట్ కారణంగానే ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మాగ్నటిక్ ఎఫెక్ట్ ఉన్న చిన్నారులు ఇక్కడే కాదు బ్రెజిల్, క్రోయేషియా సహా మరికొన్ని దేశాల్లోనూ ఉన్నారు. Link to comment Share on other sites More sharing options...
skilaru Posted July 12, 2011 Share Posted July 12, 2011 yekkada dorukutayyi anna ..neeku ee news lu .... :-) Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.