Jump to content

ఆంధ్రలోనూ ఆపరేషన్‌ ‘కర్నాటక’ రోశయ్యకు ఎసరు !


Cyclist

Recommended Posts

 

cmk.jpg(సూర్య ప్రధాన ప్రతినిధి)మన రాష్ట్రంలోనూ కర్నాటక తరహా రాజకీయాలకు త్వరలో తెరలేవనుంది. సర్కారును కూల్చేందుకు ఇక్కడా చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలయ్యాయి. కాకపోతే ఒకటే తేడా! అక్కడ జేడీఎస్‌ ప్రోత్సాహంతో బిజేపీ అసమ్మతి వర్గం ఇక్కడ కాంగ్రెస్‌!! అక్కడ కథానాయకుడు కుమారస్వామి అయితే, ఇక్కడ కథానాయకుడు వైఎస్‌ జగన్‌. దాదాపు పక్షం రోజుల పాటు రక్తికట్టించిన ‘కర్నాటకం’ కథ కడకు సుఖాంతం కాగా, ఇక్కడ మాత్రం అలాంటి ముగింపు ఇవ్వకూడదన్నది జగన్‌ పట్టుదల. అందుకే ఆయన తాను మరో కుమారస్వామి కాకూడదన్న లక్ష్యంతో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి కథ, మాటలు, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే జగన్‌ అయితే, నిర్మాతలు మాత్రం ఆయన బంధుగణాలు. యడ్యూరప్ప సర్కారును కూల్చేందుకు జరిగిన ఘటనకు కేంద్రబిందువైన కర్ణాటక రాష్ట్రాన్నే జగన్‌ కూడా వేదిక చేసుకుని, కొణిజేటి సర్కారు కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం..

జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పీఠానికి ఎసరు తెచ్చేందుకు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఆ మేరకు ఆయన ప్రయత్నాలు ఊపందు కుంటున్నాయి. రోశయ్య సర్కారును కూలగొట్టేం దుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు, కడప పార్లమెంటుసభ్యుడు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు.. కర్ణాటక రాజధాని బెంగళూరును కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి పేరిట బెంగళూరులో ఉన్న జగన్‌.. రోశయ్య సారధ్యంలోని కాంగ్రెస్‌ సర్కారును కూల్చే ప్రణాళికకు ఊపిరిపోస్తున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన వనరులు, చీల్చవలసిన ఎమ్మెల్యేల పేర్లు, జిల్లాల వారీగా సమీకరణపై జగన్‌, ఆయన బంధువర్గం అక్కడి నుంచే కసరత్తు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

 

pavuralagutta.jpgదీనికయ్యే ఖర్చుపై ఆయన బంధువులు అంచనా వేస్తున్నారు దీనికి.. వైఎస్‌ కుటుంబానికి వీర విధేయులయిన పెట్టుబడిదారులు కూడా హాజరయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రోశయ్య పనితీరుపై ఎమ్మెల్యే లలో ఉన్న అసంతృప్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తన చిరకాల వాంఛితమైన ముఖ్యమంత్రి పదవిని సాధించేందుకు జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని చీల్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందు తనను అవమానిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని చీల్చాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ఆ మేరకు బెంగళూరును కార్యక్షేత్రంగా ఎంచుకుని, రాష్ట్ర రాజకీయాలపై కసరత్తు ప్రారంభించారు. కనీసం 70 మంది ఎమ్మెల్యేలను తన శిబిరంలో చేర్చుకునే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వారికి కావలసిన ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

అదే సమయంలో ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి తన వైపు వచ్చే ఎమ్మెల్యేలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాంట్రాక్టులు చేస్తున్న ఎమ్మెల్యేలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. కనీసం 70-80 మంది ఎమ్మెల్యేలను తన శిబిరంలోకి తెచ్చుకోవడం ద్వారా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించి, రోశయ్య సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పతనం చేయాలన్న లక్ష్యంతో ఆయన తన ముందున్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వారు కాకుండా కొత్తగా ఎన్నికయిన యువ ఎమ్మెల్యేలపైనా జగన్‌ కన్నేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

జగన్‌ తన లక్ష్యానికి చేరువ కావడానికి ఆయన బంధుగణాలు, వైఎస్‌ వల్ల ఆర్థికంగా లబ్థిపొందిన రెడ్డి సామాజికవర్గ పెట్టుబడిదారులు కూడా ప్రస్తుతం జగన్‌ వెంట బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలుకు కావలసిన ఆర్థిక అంచనాలు, కుల సమీకరణలపై వారంతా సీరియస్‌గానే కసరత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా.. జగన్‌ బంధుగణాలు ప్రభుత్వాన్ని కూల్చడం, సొంత పార్టీ స్థాపించడంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వైఎస్‌కు సమీప బంధువయిన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక బడా కాంట్రాక్టర్‌, ఒక మంత్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే జగన్‌ శిబిరంలోకి వచ్చే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చే బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు.

 

ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని, కాంగ్రెస్‌ నాయకత్వం అణచివేసి, అవమానించే వైఖరి అనుసరిస్తున్నందున ఇంకా పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం లేకపోగా, అభిమానిస్తున్న వారంతా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని జగన్‌పై బంధుగణాలు ఒత్తిడి చేస్తున్నారు. ఒక దశలో జగన్‌ కూడా నాయకత్వం తనపై అనుసరిస్తున్న నిర్లక్ష్య, కఠిన వైఖరిపై బంధువుల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేసి, ఏదో ఒకటి తేల్చండంటూ వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్న జగన్‌ మరో రెండువారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, చివరకు విమాన ప్రయాణం కూడా చేయవద్దని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. అందువల్ల బంధువులంతా బెంగళూరులోనే భేటీ అయ్యారని, శనివారం ఆయన అత్తా, మామలు కూడా బెంగుళూరుకు బయలుదేరినట్లు తెలిసింది. కాగా, డిసెంబర్‌లో జగన్‌ తన నిర్ణయాన్ని ముందుగా తన వర్గానికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యేలతో మంతనాలను ఆలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత జనవరి నుంచి ప్రభుత్వాన్ని కూల్చే కార్యాచరణకు తెరలేపనున్నట్లు జగన్‌ సన్నిహిత వర్గాల సమాచారం.

 

చిరంజీవికి చెక్‌... !

(సూర్య ప్రధాన ప్రతినిధి)ముఖ్యమంత్రి పీఠం సాధన కోసం పరితపిస్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ లక్ష్యసాధన కోసం అన్ని మార్గాల్లోనూ కార్యాచరణ ప్రారంభించారు. ఒకవైపు ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపేం దుకు ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న జగన్‌.. భవి ష్యత్తులో పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచే అవకాశం లేకుండా చేసేందుకు కాపు తంత్రం ప్రయోగిస్తున్నారు. అదే సమయంలో తాను స్థాపించబోయే పార్టీకి కాపులను మద్దతు దారులుగా మార్చే ఎత్తుగడతో అడుగులేస్తున్నారు.

 

chirru.jpgఅందులో భాగంగా.. ఆదివారం భీమవరంలో జరగనున్న కాపు వన భోజనాల కార్య క్రమానికి ఆయనే కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమయింది. కాంగ్రెస్‌ సర్కారును కూలగొట్టేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ప్రతిబంధకంగా మారతారన్న ముందుచూపుతో జగన్‌ ఇప్పటినుంచే ఆ పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న కాపులను, ఆ వర్గానికి చెందిన పీఆర్పీ ఎమ్మెల్యేలపై వల విసిరే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా.. తన వర్గానికి చెందిన మంత్రి వట్టి వసంతకుమార్‌ను పాత్ర ధారిగా ముందుంచి, కాపు వనభోజన కార్యక్రమాన్ని నడిపిస్తున్నట్లు కాపు వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 

జగన్‌ మద్దతు దారులయిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, భీమవరం ఎమ్మెల్యే అంజి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి వట్టి వసంత కుమార్‌, పొన్నాల, కన్నా, దానం, బొత్సా, జాతీయ నేత కేశవరావు ముఖ్య అతిథులుగా, వీరితో పాటు అన్ని పార్టీలకు చెందిన కాపు ఎమ్మె ల్యేలు, ఎంపీలు, కాపునాడు నేతలు, అన్ని రంగాల్లోని కాపు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్‌ను ఆహ్వానించినా వారు తిరస్కరించినట్లు తెలిసింది.

 

తాను పార్టీని వీడితే చిరంజీవి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉండటంతో.. అసలు ఆయనకే బలం లేదన్న సంకేతాలను ఢిల్లీకి పంపేం దుకు జగన్‌ కాపు కులం కార్డును సంధిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా.. చిరు పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలందరినీ తన వైపు తిప్పు కోవడం ద్వారా.. చిరంజీవికి చెక్‌ పెట్టడంతో పాటు, మానసికంగా దెబ్బకొట్టాలన్నది జగన్‌ లక్ష్యమంటున్నారు. కాంగ్రెస్‌కు చాలాకాలం పాటు సంప్రదాయ ఓటర్లుగా ఉన్న కాపులు చిరంజీవి రాకతో అటు మళ్లిన విషయం తెలిసిందే.

 

అయితే, చిరంజీవి పూర్తిగా కాపు ముద్ర వేసుకునేందుకు ముందుకురాకపోవడం, ఆయన వద్దకు వెళ్లిన కాపు ప్రముఖులను గౌరవించకపోవడం, చిరంజీవి రాక వల్ల కాంగ్రెస్‌లో తమకు సరైన ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న కాపు వర్గాల అసంతృప్తిని జగన్‌ సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే వనభోజనాల కార్యక్రమం పేరిట తన బలం పెంచుకునే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారంటున్నారు.

 

దీని వెనుక మంత్రి వట్టి వసంతకుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.ఆదివారం భీమవరంలో జరిగే వన భోజనాల్లో కాపులు ఎవరి వైపు ఉండాలన్న అంశంపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా పనిచేయాలా? జగన్‌కు మద్దతుపలకాలా? బీసీలలో చేర్చాలన్న డిమాండ్‌ను ఉద్యమంగా మార్చాలా? అన్న అంశాన్ని ఖరారు చేస్తారంటున్నారు. ఇప్పటికే జగన్‌.. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌-పీఆర్పీ లకు చెందిన కాపు ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారని, ఆయన పక్షాన పనిచేస్తున్న నేతలు కూడా నిరంతరం వారితో టచ్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు.ఈ విషయంలో జగన్‌ సరికొత్త విధానం పాటించినట్లు తెలుస్తోంది.

 

కాపు ఎమ్మెల్యేల అనుచరగణాల్లో అధికంగా ఉన్న అదే వర్గ యువకులను జగన్‌ మద్దతుదారులు ఇప్పటికే అర్ధబలంతో తన వైపునకు తిప్పుకున్నారు. వారి ద్వారానే వారి ఎమ్మెల్యేలతో ఒత్తిడి చేయిస్తున్నారు. జగన్‌ తూర్పు ఓదార్పులో ఆయన వెంట నిలిచిన వారిలో 90 శాతం మంది కాపు యువకులే కావడం గమనార్హం. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌-టీడీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలకు వారి పార్టీ నాయకత్వాలపై ఎలాంటి అసంతృప్తి లేకపోయినా.. కేవలం తన వర్గానికి చెందిన కాపు యువకుల ఒత్తిడికి తాళలేకనే పీఆర్పీలో చేరిన విషయాన్ని జగన్‌ పరిగణనలోకి తీసుకుని, ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కాపు కులపెద్దలను కొందరిని జగన్‌ వర్గం ఇప్పటికే అర్ధబలం ద్వారా ప్రభావితం చేశార ని కాపు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

 

అయితే.. కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కాపులకు న్యాయం చేశామని చెప్పుకోవడం, కులాన్ని చూపించి అన్ని రకాల ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను తాను అడ్డుకుంటామని కాపునాడు యువనేత శ్రీనివాసనాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వట్టివసంతకుమార్‌ కాపులకు చేసిందేమీ లేదన్నారు.కాపులను బీసీలలో చేర్పించాలన్న డిమాండ్‌ను వట్టి లాంటి ఒకరిద్దరు కాపులకు మంత్రిపదవులు ఇవ్వడం ద్వారా సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపు జనాభా సర్వే కోసం తగిన న్ని నిధులు కూడా ఇప్పించలేని వారికి పదవులెందుకని ప్రశ్నించారు. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలను అమలు చేయాలని, బీసీలలో చేర్పించేందుకు కృషి చేయాలని, బీసీ-కాపుల మధ్య సమన్వయం కుదిర్చి సమిష్ఠిగా పనిచేయాల్సి ఉండగా, వాటిని విడిచిపెట్టి, వనభోజనాల పేరిట కులభోజనాలు చేస్తే సామాన్య, మధ్య తరగతికి చెందిన కాపులకు వచ్చే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...