Jump to content

swarnandhra

Members
  • Posts

    6,498
  • Joined

  • Last visited

  • Days Won

    10

Posts posted by swarnandhra

  1. రాజధానిలో ‘పై డాటా’..సై

    21-07-2017 08:20:51
     
    636362220753975615.jpg
    • తొలిదశ ప్రాజెక్టుకు నేడే శ్రీకారం
    • మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • రాజధానిలో తొలి ఐటీ ప్రాజెక్టు
    మంగళగిరి: స్థానిక ఐటీ పార్కులో ప్రతిష్టాత్మకమైన ఐటీ ప్రాజెక్టు... పై డాటా సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ కంపెనీ పై డాటా సెంటర్‌ దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రూపుదిద్దుకున్న తొలి అంతర్జాతీయ ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కావడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో నాల్గవ టైర్‌ డాటా సెంటర్‌గా గుర్తింపు పొందనున్న తొలి ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కానుంది. ఈ డాటా సెంటర్‌ ఏర్పాటు వలన మూడొందల మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి కలుగనుండగా స్థానికంగా మరో రెండేవేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ప్రస్త్తుతానికి తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేసి శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. లోకేష్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
     
     
    మంగళగిరిలో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి చెందిన ఇక్కడి ఐటీ పార్కులో ప్లాటు నెం.12 కింద పదెకరాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ 2015 మేలో జీఓ నెం.11 పేరుతో ఉత్తర్వులను ఇచ్చింది. ప్రభుత్వం కూడ ఎన్నో షరతులను విధిస్తూ లీజు కేటాయింపులను చేసింది. 33 ఏళ్లకుగాను లీజుకింద రూ.పదికోట్లను చెల్లించాలని కోరగా పై డాటా యాజమాన్యం ఆ చెల్లింపులను చేసింది. సదరు భూమిని ఏపీఐఐసీ నుంచి పై డాటా కంపెనీ స్వాధీనం చేసుకున్న ఆరు మాసాల్లోగా నిర్మాణ పనులను ఆరంభించి తదుపరి 15 మాసాల్లోగా ప్రాజెక్టు తొలిదశను పూర్తిచే యాలని ఆతదుపరి మూడు మాసాల్లోగా ప్రాజెక్టులో అనుకున్న విధంగా పనులు ప్రారంభించి తీరాలని ప్రభుత్వం షరతులు విధించింది. ప్రాజెక్టు పనితీరు పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందినట్టయితేనే తదుపరి 33 ఏళ్లకు లీజు కొనసాగుతుందని కూడ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టులో విధిగా 300 మందికి తగ్గకుండా ఐటీ నిపుణులకు ఉపాఽధిని కల్పించాలని కూడ ప్రభుత్వం స్పష్టం చేసింది. పై డాటా సెంటర్‌ యాజమాన్యం కూడ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. భూమిని స్వాధీనం చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఇక్కడ భవన నిర్మాణ పనులను చేపట్టింది. చాలా శరవేగంగా తొలిదశ భవన సముదాయాన్ని పూర్తి చేసింది. మొత్తం ఐదు లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న పై డేటా సెంటర్‌ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.600 కోట్లను ఖర్చు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. తొలి దశ కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఐదు వేల సర్వర్‌ ర్యాక్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో ర్యాక్‌లో 47 సర్వర్‌లకు స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. ఈ ఐటీ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడ మంచి సహకారాన్ని అందించింది. ప్రాజెక్టు నిర్వాహణకు అవసరమయ్చే అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా విద్యుత్‌, నీటి సరఫరా విషయంలో రాజీలేని విధంగా ఏర్పాట్లను చేసింది.
     
    గుంటూరు ఛానల్‌ నుంచి ప్రత్యేక పైపులైనుతో కృష్ణా జలాలను అందించడంతో పాటు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కూడ ప్రభుత్వం ఏర్పాట్లను గావించింది. తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.ఆరు కోట్ల వ్యయంతో ప్రజారోగ్యశాఖ ఆఽధ్వర్యంలో పనులను చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత అవసరాలకు 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేసి దానికి తాడేపల్లిలోని నులకపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ ప్రత్యేక విద్యుత్‌ లైనును ఏర్పాటుచేశారు. ఇందుకోసం రమారమి రూ.ఏడు కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018 నాటికి ప్రాజెక్టులో ర్యాక్‌ల సంఖ్యను 15వేల వరకు పెంపు చేసే అవకాశం వుంది. ఆ సందర్భంలో సబ్‌స్టేషన్‌ సామర్ధ్యాన్ని 60 మెగావాట్స్‌కు పెంచాల్సివుంటుంది. మొత్తంమీద 2018 నాటికి భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌గా పై డేటా అవతరించబోతుంది. క్లౌడ్‌ కంఫ్యూటింగ్‌ సర్వీస్‌లో అత్యంత ఎక్కువ సామర్ధ్యం కల సర్వర్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పై డేటా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటుంది.
  2. copied from Facebook-- just last two lines.

    .......

    చివరగా -

    కృష్ణ నదిలో కృష్ణ నీరు ... బ్రహ్మ సృష్టి !

    కృష్ణ నదిలో గోదావరి నీరు ... చంద్రబాబు ప్రతి సృష్టి !!(భువన్ మాగంటి)

     

     

    Super Kick ante idhi.

  3. డెల్టాకు పట్టిసీమ నుంచి 10.4 టీఎంసీలు

    09-07-2017 01:26:28
     
     
    అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో కృష్ణా డెల్టాకు మాత్రం ఏ కొరతా లేకుండా నీటి ప్రవాహం కొనసాగుతోంది. గతనెల 29 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరుతున్నాయి. 24 మోటర్ల ద్వారా నేటి వరకూ 10.4 టీఎంసీలు గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఫలితంగా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
  4. 23 lakh acres not hectares anukunta

     

    Krishna (13 lacs) + godavari delta (around 10 lacs) rice.

     

    Nellore has another 6 lacs acres under penna basin, there is significant acreage in Kurnool (nandyala area), few places in Anantapur ...etc

    so 23 lac hectares is probably true.

  5.  

    పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు: చంద్రబాబు
    636340777245138287.jpg
    విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా డెల్డాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా సాగునీటిని విదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. రైవస్ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, బందరు, ఏలూరు కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు లేకపోవడంతో కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు వచ్చేవన్నారు.డెల్టా రైతుల తుపాన్ల కారణంగా నష్టపోయారని తెలిపారు. పట్టిసీమ ద్వారా జూన్‌లోనే కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామన్నారు. జూన్‌లో నీరు ఇవ్వడంతో సకాలంలో పంట వస్తుందని ఆయన అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన చెప్పుకొచ్చారు.

     

     

    which paper is this? 

  6. Due to legel/technical issues we were not able to highlight it For Ap people Bro..lekapothe pamba repevodu Leader..

     

    yeah, chivarlo ade cheppadu ga Sai kuda. alanti consequences vuntayanna vishayam telisi kuda Jagga insisted on it in assembly.

  7.  

    ఏపీ రాజధాని రోడ్లకు పేర్లు చెప్పండి!

     

     
    636337198248750750.jpg
    • ప్రజాభిప్రాయం కోరిన ఏపీ సీఆర్డీయే
     
    అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రతి కీలక పరిణామంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తున్న ఏపీ సీఆర్డీయే... నవ్యాంధ్ర రాజధానిలోని రహదారులు, కూడళ్లు తదితరాలకు పెట్టాల్సిన పేర్లను కూడా సూచించాల్సిందిగా ప్రజలను కోరింది. మన ఘన చరితను చాటే పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతోపాటు అమరావతిలో నిర్మితమవనున్న 9 థీమ్‌ సిటీల్లో... ఆయా రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఉపకరించే సమాచారాన్ని ఇవ్వాలని కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థిస్తోంది. రాజధానిలోని రహదారులు, వీధులు, కూడళ్లు, కార్యాలయ భవనాలు, ఉద్యానవనాలు, క్రీడా ప్రాంగణాలు, కళావేదికలు, అతిథి గృహాలు తదితరాల
     
    కు మన సంస్కృతి, వారసత్వం అద్దం పట్టే పేర్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నదులు, పర్వతాలు, నైసర్గిక విశేషాలు, ప్రాశస్త్య ప్రదేశాలు, చారిత్రక సంఘటనలు, రాజవంశాలు, రాజులు, వివిధ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన ప్రముఖులను గుర్తించి, ప్రజా రాజధానిగా రూపొందుతున్న అమరావతిలో సముచిత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నారు. మొత్తం ప్రక్రియలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తే అసలుసిసలైన పీపుల్స్‌ క్యాపిటల్‌గా రాజధాని రూపొందుతుందన్న అభిప్రాయంతో వారి నుంచి సలహాలు, సూచనలను సీఆర్డీయే ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రపంచంలో ఎక్కడ ఉండే తెలుగువారైనా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించలేదు.

     

     

    names pettakunda numbering vuntene navigation easy outsiders/tourists ki. for e.g you are on E1, need to go to E7, just cross 5 major intersections.

×
×
  • Create New...