Jump to content

Vulavacharu

Members
  • Posts

    1,298
  • Joined

  • Last visited

  • Days Won

    2

Posts posted by Vulavacharu

  1. http://nri.andhrajyothy.com/latestnews/ap-cm-administration-is-nice-says-shetty-16574

     

     

    ‘ఏపీ పాలన భేష్‌! మోదీ సూచనతోనే ఇక్కడికొచ్చా’

     

    అబుదాబి ప్రభుత్వానికీ ఆసక్తి

    అమరావతిలో తొలి ఎఫ్‌డీఐ నాదే

    13 వేల కోట్లతో ప్రాజెక్టులకు శ్రీకారం

    రెండేళ్లలోనే మెడిసిటీ ప్రారంభం

    ’ఆంధ్రజ్యోతి’తో బీఆర్‌ షెట్టి

    అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సుపరిపాలన చూసే ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చామని ప్రవాస భారతీయ సంపన్నుడు, అబుదాబి వ్యాపారవేత్త బీఆర్‌ షెట్టి తెలిపారు. చంద్రబాబు క్రియాశీల ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తమ సంస్థల ఏర్పాటుకు సహకరించే విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం చురుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం కర్ణాటక నుంచి అరబ్‌ నేలకు వలస వెళ్లిన బీఆర్‌ షెట్టి, అబుదాబి కేంద్రంగా సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. గత ఏడాది తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా రెండు బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 13 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమరావతిలో తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) బీఆర్‌ షెట్టిదే కావడం విశేషం.

     

    ఇక్కడ ఒక బిలియన్‌ డాలర్ల వ్యయంతో వైద్య విద్య, ఆసుపత్రి, పరిశోధనా సంస్థలతో కూడిన ‘అమరావతి మెడిసిటీ’ నిర్మాణాన్ని తలపెట్టారు. నవ్యాంధ్ర నూతన రాజధానిలో తన ప్రాజెక్టు శంకుస్థాపనకోసం అమరావతి వచ్చిన బీఆర్‌ షెట్టి ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతిలో మొదటి పెట్టుబడి నాదే అవుతుందని మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. ఆచరణలో కాస్త ఆలస్యం జరిగినట్టుంది!

     

    లేదు. విదేశీ పెట్టుబడిదారుల్లో నేనే మొదటివాడిని. ’బీఆర్‌ఎస్‌ అమరావతి మెడిసిటీ’ మొదటి ఎఫ్‌డీఐ ప్రాజెక్టు.

     

    మీ సొంత రాష్ట్రం కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. వాటిని ప్రక్కనపెట్టి ఆంధ్రపదేశ్‌ను ఎంచుకోవడానికి కారణం?

    సుపరిపాలనే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది. చంద్రబాబు క్రియాశీల ముఖ్యమంత్రి. ఇతరులు అధికారస్వాములు. నేను చంద్రబాబు అభిమానిని. ఇప్పుడు కొత్తగా కాదు... ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండగానే ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. నన్ను ఆయన స్వాగతించారు. మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా ప్రోత్సహి స్తామని చెప్పారు.

     

    మీ పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమిటి?

    అమరావతిలో పెట్టుబడి పెట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నాకు చెప్పారు. మోదీ ప్రపంచంలోనే ఉత్తమ ప్రధాని. చంద్రబాబు భారతదేశంలోనే నెంబర్‌ 1 సీఎం. ఇద్దరూ పనిమంతులే. భారతదేశ అభివృద్ధి రేటు ఏడు శాతం మాత్రమే ఉంటే.. ఆంరఽధప్రదేశ్‌ వృద్ధి రేటు ఏకంగా 11 శాతం దాటింది. అందుకే ఇక్కడికి వచ్చా.

     

    మెడిసిటీ ప్రాజెక్టులో భాగమయ్యే సంస్థలు, సేవలు ఏమిటి?

    అమరావతి మెడిసిటీ నా ప్యాషన్‌. మంచి విద్య, వైద్య వ్యవస్థలను ఇక్కడికి తీసుకొస్తా. రాష్ట్రంలో మొత్తంగా రెండు బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 13వేల కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నా. తొలిగా రూ.6.5 వేల కోట్లతో మెడికల్‌ కాలేజీ, హెల్త్‌ కాంప్లెక్స్‌ తదితరాలతో మెడిసిటీ నిర్మిస్తా. ఇంజనీరింగ్‌, బయోమెడికల్‌ కాలేజీలూ వస్తాయి. క్వాంటమ్‌ కంప్యూటర్స్‌, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ మా ప్రాజెక్టులో భాగం. నాసా సహకారం కూడా తీసుకొని.. మూడేళ్లలో ఈ సంస్థలు ప్రారంభమవుతాయి. మెడిసిటీని రెండేళ్లలో ప్రారంభిస్తాం.

     

    ఏపీలో మీరు ఒప్పందాలు చేసుకున్న ఇతర ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది? సకాలంలో పూర్తవుతాయా?

    ఫార్మా యూనిట్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జపాన్‌ కంపెనీ భాగస్వామి కానుంది. నాసా సహకారంతో క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ ప్రాజెక్టు చేపడుతున్నాం. ఇది దేశంలోనే మొదటి అడుగు. ఇంకా ఇతర ప్రాజెక్టులు కూడా త్వరితగతిన చేపడతాం. నాదగ్గర మిగులు ధనం ఉంది. ఇలా ఎవరూ చెప్పరు. నాకు చెప్పే ధైర్యం ఉంది. నేనిక్కడికి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగం కావాలనే ఓ సానుకూల దృక్పథంతో వచ్చా. నా పెట్టుబడికి ఎల్లలు లేవు. కులం, దేశం, రాష్ట్రం సరిహద్దులు చూడను. ఆఫ్రికా, ఈజిప్టు, నేపాల్‌ వంటి దేశాల్లోనూ పెట్టుబడి పెట్టాను.నేను సంపన్నుడిని. నాకు నలుగురు బిడ్డలు. వారికి నేను డబ్బు ఇవ్వవలసిన అవసరంలేదు. నేను మదర్‌ థెరెస్సాలా ఉంటానని చెప్పనుగాని, ప్రజలకు సహాయం చేయాలనుకుంటాను.

     

    ఏపీలో మీరు పెట్టుబడి పెట్టడంతోపాటు అబుదాబి ప్రభుత్వంతో, అక్కడి ఇన్వెస్టర్లతో చర్చిస్తానని చెప్పారు. ఈ విషయంలో ఏమైనా పురోగతి ఉందా?

    మాట్లాడుతున్నాం. నేను చంద్రబాబు అబుదాబి రాకకోసం ఎదురు చూస్తున్నాను. ఇండియా నుంచి నేనేమీ తీసుకెళ్లలేదు. అబుదాబిలో సంపదను కూడబెట్టుకున్నాను. అందుకు అక్కడి రాజకుటుంబానికి కృతజ్ఞుడిని. వాళ్ళు నాకే కాదు, భారత్‌కు, మోదీకి కూడా ఆప్తులు. అబుదాబి క్రౌన్‌ప్రిన్స్‌ భారత్‌కు 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రకటించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడికి వారు ఆసక్తితో ఉన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, తాగునీరు.... ఇలా ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి వారు సిద్ధం. స్థిరత్వం, క్రియాశీలత ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు వచ్చాక అబుదాబి క్రౌన్‌ప్రిన్స్‌ స్వయంగా చర్చిస్తారు

  2. ED attaches Rs 148 crore land given by Jagan Reddy

     

    The Enforcement Directorate (ED) on Friday attached 11,805 acres of land worth Rs 148 crore allotted to industrialist Nimmagadda Prasad by YSR Congress chief Y.S. Jaganmohan Reddy when his father was the Andhra Pradesh Chief Minister.

    This formed part of the ED probe against the YSR Congress leader in an illegal assets case, an official statement said.

    The agency said the attached land was illegally allotted to the companies of Prasad in Prakasam and Guntur districts.

     

    "This is a quid pro quo investment case where Prasad, various companies and individuals made huge investments in companies floated by Reddy for the favours received from erstwhile Andhra Pradesh government by way of allotment of land for development of port and industrial corridor, exemption under Urban Land (Ceiling and Regulation) Act," the statement said.

     

    Jagan, as he is popularly known, was arrested by the Central Bureau of Investigation (CBI) in May 2012 in the case. He spent 16 months in jail before getting bail in September 2013.

    He is currently the Leader of Opposition in Andhra Pradesh.

    The CBI has filed 11 chargesheets in the case against Jagan, his aides, former state ministers, IAS officers, corporate entities and businessmen.

     

    The case relates to alleged investments made by private firms and individual investors in Jagan Reddy's companies in return for favours they received when his father Y.S. Rajasekhara Reddy was Chief Minister between 2004 and 2009.

    Based on a CBI chargesheet, the ED launched a probe under the Prevention of Money Laundering Act and found that Prasad allegedly paid bribes to Jagan Reddy in the form of investments totalling about Rs 779.50 crore in the latter's companies, Jagati Publications Ltd, Carmel Asia Holdings Pvt Ltd, Bharathi Cement Corp Pvt Ltd and Silicon Builders Pvt Ltd.

     

    Investigators in the ED said Prasad also paid Rs 57 crore to Jagan Reddy on the pretext of secondary purchase of shares and donation of Rs 7 crore to the YSR Foundation.

    In lieu of the alleged bribes, Prasad was "illegally" awarded the project for the development of the Vadarevu-Nizampatnam Port and Industrial Corridor by allegedly deviating from standard norms and without even examining the technical or financial capabilities, the ED revealed.

    Prasad got orders for allotment of land to the extent of more than 18,700 acres in the name of his goup company, Vanpic Projects Pvt Ltd, which allegedly had no responsibility for project development, another ED official said.

     

    Prasad's companies started payments to farmers and the departments even before the issuance of government orders for land allotments. "Considerations were paid for 13,220 acres."

    In the same case, the ED had earlier attached Rs 538 crore assets of Jagan Reddy and his companies and Rs 325 crore worth assets of Prasad and his companies, including 1,416 acres of land from Vanpic Projects Pvt Ltd and Vanpic Ports Pvt Ltd.

    --IANS

     

    Link.

     

     

    Jagan Reddy PMLA case: ED attaches Rs 148 crore assets 

     

    HYDERABAD: The ED has attached assets worth over Rs 148 crore in connection with its money laundering probe in cases related to YSR Congress leader Jagan Mohan Reddy and others, the agency said. 

     

    "ED attaches land worth Rs 148.89 crore in Andhra Pradesh under PMLA of companies of Nimmagadda Prasad in YS Jagan Mohan Reddy case," the agency said. 

     

    A provisional attachment order under the PMLA law has been issued, a senior official said. 

     

    The ED began its probe against the politician and his associates on the basis of a CBI FIR that stated that since "May 2004, Jagan floated number of companies wherein quid pro quo investments have been made by beneficiaries from decisions of the state government in various forms like SEZs (special economic zones), irrigation contracts, relaxation/permission for real estate ventures, mines among others." 

     

     

    Link.

     

    Punishment for money-laundering

    The act prescribes that any person found guilty of money-laundering shall be punishable with rigorous imprisonment from three years to seven years and where the proceeds of crime involved relate to any offence under paragraph 2 of Part A of the Schedule (Offences under the Narcotic Drugs and Psychotropic Substance Act, 1985), the maximum punishment may extend to 10 years instead of 7 years.

  3. పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం సహకారం: డాక్టర్‌ జోయెల్‌ విగ్గిన్స్‌ 

    ctr-gen1a.jpg

    మంగళం(తిరుపతి), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం విశేషమైన ప్రోత్సాహాన్ని అందిస్తోందని అమెరికాకు చెందిన క్రౌన్‌ కాలేజ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జోయెల్‌విగ్గిన్స్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8లో ‘రిస్క్‌ మిటిగేషన్‌ అండ్‌ వ్యాల్యుఏషన్‌ ఇన్‌ ఎ స్టార్టప్‌ వెంచర్‌’ అనే అంశంపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్‌ పర్సన్‌గా హాజరై ఆయన మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవడానికి, ఆర్థిక వనరులను సముపార్జించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. దేశవిదేశాల్లో ఉన్న పేరుమోసిన వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను వెతికి, గుర్తించి రాష్ట్రానికి తీసుకువచ్చి మరీ వారి సేవలను పొందేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆస్ట్రియా దేశంలోని ఐసీ స్కైర్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎక్స్‌ఎల్‌ఆర్‌8ను స్థాపించి, దేశంలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, గొప్పగొప్ప ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా వందలాది మంది పారిశ్రామికవేత్తలు మేలు పొందడం అభినందనీయమన్నారు.త్వరలోనే రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రాంభించేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌8 ద్వారా ఎంపికైన 33 మంది ఔత్సాహికులకు సరైన దిశానిర్దేశం చేయడానికి తనను అమెరికా నుంచి ఇక్కడకు పిలిపించారన్నారు. వరల్డ్‌క్లాస్‌ పారిశ్రామికీకరణకు సీఎం ఎంతో నిబద్ధతతో చేపడుతున్న కార్యక్రమానికి తనవంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఎక్కడైనా స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించేవారు ప్రధానంగా వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, విస్తృతమైన మార్కెటింగ్‌ ను ఏర్పాటు చేసుకోవడం, మ్యాన్‌పవర్‌ను కలిగి ఉండటం లాంటి అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. ఆయా అంశాలపై స్వయం నియంత్రణ కలిగి ఉండాలని అన్నారు. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అంశాల్లో స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటదారులకు సహకారం అందిస్తోందన్నారు. ఆయా అలోచనలకు తుదిరూపం ఇవ్వాల్సింది మాత్రం స్టార్టప్‌ కంపెనీల స్థాపకులేనని అన్నారు. ఒకసారి పరిశ్రమల స్థాపనలో ముందుకు అడుగువేశాక వెనక్కు తగ్గరాదన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అనుభవంతో నెట్టుకు రావాలని అన్నారు. ముందుగా తమవద్ద ఉన్న వస్తువుకు సొంతంగా మార్కెటింగ్‌ చేసుకునే వీలును కల్పించుకోవాలన్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలో నిలదొక్కుకుంటారని సూచించారు. కార్యక్రమంలో ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ తిరుపతి మేనేజర్‌ గీతాశ్రీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌8 మేనేజింగ్‌ డైరెక్టర్‌ గ్లెన్‌రాబిన్‌సన్‌, 33 మంది స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

  4. ప్రకృతి సాగుకు విశ్వవిద్యాలయం
    15-06-2017 02:47:05
     
     
    636330917478052961.jpg
    • వంద ఎకరాలు, వంద కోట్లు నిధులు
    • అమరావతిలో ఏర్పాటు చేయండి
    • పాలేకర్‌కు చంద్రబాబు ఆహ్వానం
    • ప్రకృతి సాగుపై సలహాదారుగా పాలేకర్‌
     
    అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో వంద ఎకరాల్లో, వంద కోట్ల నిధితో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ వర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ను ఆహ్వానించారు. పెట్టుబడి భారం లేకుండా ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన వ్యవసాయ దిగుబడులు అధికంగా సాధించేందుకు సహకరించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పాలేకర్‌ను నియమించారు. బుధవారం ఉదయం ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. దేశీయ విత్తనాలు, దేశీయ పశు సంతతి వృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే మేలు జాతి పశువులుగా పేరొందిన ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవుల పరిరక్షణపై దృష్టి పెడతామని అన్నారు. రోజురోజుకూ పల్లెలను వదిలి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని... సాగు ప్రమాదంలో పడుతోందని పాలేకర్‌ ముఖ్యమంత్రి దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి లేకుండా రైతులు అధిక ఉత్పత్తులు సాధించి, ఎక్కువ ఆదాయం సమకూర్చుకునేలా చేయగలిగినప్పుడు వ్యవసాయ రంగానికి తిరుగుండదని చెప్పారు.
     
     
    ప్రకృతి సాగుకు ‘బ్రాండింగ్‌’
    ‘‘అవసరం లేకున్నా ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడటంతో అటు సాగు భూమి, ఇటు వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతున్నాయి. దీనిని అరికట్టాల్సిన అవసరముంది. ప్రతి రైతుకు భూ ఆరోగ్య కార్డులు ఇవ్వడంలో, సూక్ష్మ పోషకాలను ఉచితంగా పంపిణీ చేయడంలో ఏపీ దేశంలోనే ముందుంది. ప్రకృతి వ్యవసాయంలోనూ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపడమే మా లక్ష్యం. ప్రకృతి వ్యవసాయంతో వచ్చే ఉత్పత్తులకు బ్రాండింగ్‌ తీసుకువచ్చి, రైతు బజార్లలోనూ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్న పాలేకర్‌ సూచనపై సానుకూలంగా స్పందించారు. పగటి వేళ సౌర విద్యుత్‌ను, రాత్రి సమయంలో బయోగ్యా్‌సతో ఉత్పత్తి అయ్యే కరెంటును వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. పాలేకర్‌ అవలంబిస్తున్న నీటి పరిరక్షణ విధానాలను ‘నీరు - ప్రగతి’ కార్యక్రమంలో చేర్చాలని సీఎం అదేశించారు. ఫైబర్‌ గ్రిడ్‌ సౌకర్యం అందుబాటులోకి రాగానే... రాష్ట్రంలోని రైతులందరితో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వారి సందేహాలు నివృత్తి చేయవచ్చని చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై సీఎంకు మంచి అవగాహన ఉందని పాలేకర్‌ ప్రశంసించారు.
  5. స్టార్టప్‌ ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌ కన్సార్టియం

    ఈనాడు, అమరావతి: అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 6.84 చ.కి.మీల స్టార్టప్‌ ప్రాంతానికి ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో వచ్చే మొత్తం ఆదాయంలో 5శాతం, రెండోదశలో ఆదాయంలో 7.5 శాతం, మూడో దశలో ఆదాయంలో 12శాతం వాటా సీఆర్‌డీఏకి ఇస్తామంటూ సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనకు ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలియజేసినట్టు తెలిపింది.

    Crda ki 42% annaru. Entadi?

  6. Last time punarvibhajana jariginappudu Gade Venkata Reddy chaala ground work chesi mana strong constituency lu chala vidadeesadu. Ex Nandigama, penugonda....more. Kudarani chota vere cast voters ni kaliparu. Ex: Gannavaram...etc.

     

    Ippudu ala work chese vaallu mana party lo vunnara? Enthina politics lo R's kasi veru. Kshiminchandi oka cast prastavana techhinanduku.

     

    Access vunna vaallu evariana mana tdp leaders ki cheppandi-eevishayam light ga teesukovaddani. Antha officers ki vadalakandi ani.

  7. ఎంత చెత్తకి అంత డబ్బు!

     

    భారత్‌లోని ప్రధాన సమస్యల్లో ‘చెత్త’ స్థానం ఎప్పుడూ ముందే. ఏదైనా రోడ్డు తళతళలాడుతుంటే, ‘విదేశీ నగరంలా ఉందే’ అనుకుంటాం తప్ప, తలచుకుంటే మన వీధుల్ని కూడా అద్దాల్లా ఉంచుకోవచ్చనే ఆలోచనే రాదు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పర మున్సిపాలిటీ అలాంటి ఉద్దేశంతోనే వీధుల్ని చెత్త రహితంగా ఉంచాలని కంకణం కట్టుకుంది. ఆ ప్రయత్నమే అంతర్జాతీయ మేయర్ల సమావేశంలో ఆక్లాండ్‌, మిలాన్‌ లాంటి నగరాలను దాటి ‘వ్యర్థాల నిర్వహణ’లో ఉత్తర్‌పరను తొలిస్థానంలో నిలబెట్టింది.

    కోల్‌కతా పరిసరాల్లోని ఓ చిన్న పట్టణం ఉత్తర్‌పర. ఆసియాలోనే అత్యంత పురాతన గ్రంథాలయం అక్కడే ఉంది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ మరో అరుదైన ఘనతనూ అది సాధించింది. ఇటీవల మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ‘సీ40 మేయర్స్‌ సమ్మిట్‌’లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నగరాలతో పోటీ పడి చెత్తను పూర్తిగా పునర్వినియోగంలోకి తెస్తున్న అత్యుత్తమ పట్టణంగా ఎంపికైంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాలను వాటి స్వరూపాన్ని బట్టి వేర్వేరు కుండీల్లో వేయడం, అందరూ స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనడం... ఈ పనులన్నీ అక్కడి వాళ్ల జీవన విధానంలో భాగమైపోయాయి. ఉత్తర్‌పర మున్సిపాలిటీ మొదలుపెట్టిన ‘వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు’ ప్రజల ఆలోచనలూ, జీవన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టి, ఆకర్షణీయ పట్టణంగా దాన్ని తీర్చిదిద్దింది.

     

    50వేల ఇళ్లకు తిరిగి...

    ఏటా దేశంలోని దాదాపు ఎనిమిదివేల నగరాలూ, పట్టణాల నుంచి 62 మిలియన్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే, 43 మిలియన్‌ టన్నుల్ని మాత్రమే మున్సిపాలిటీలు సేకరిస్తున్నాయి. అందులో 75శాతం చెత్త డంపింగ్‌ యార్డుల్లో నిరుపయోగంగా పోగవుతుంది. కానీ ఉత్తర్‌పరలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. అక్కడ వంద శాతం వ్యర్థాలు ఇంటి బయట ఏర్పాటు చేసిన వేర్వేరు చెత్త డబ్బాల్లోకి చేరతాయి. అక్కడి నుంచి చెత్తంతా మున్సిపాలిటీ నిర్వహించే ప్రత్యేక కేంద్రానికి వెళ్తుంది. ఆపైన దాదాపు తొంబై ఐదు శాతం వ్యర్థాల్ని మున్సిపాలిటీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఉత్తర్‌పరలో వ్యర్థాల్ని శుద్ధి చేసే భారీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రతి ఇంటికీ మూడు చెత్త డబ్బాల్ని పంపిణీ చేసి తడి, పొడి, ప్లాస్టిక్‌ చెత్తను వేరు చేసి ఒక్కో డబ్బాలో వేయిస్తున్నారు. జనాల్లో చెత్త నిర్వహణపైన అవగాహన పెంచడానికీ, పరిశుభ్రత ప్రాధాన్యం తెలియజేయడానికీ స్వయంగా ఆ మున్సిపాలిటీ ఛైర్మన్‌ దిలీప్‌ యాదవ్‌ యాభై వేల ఇళ్లకు తిరిగి, వాళ్లతో మాట్లాడారు. వంద శాతం ఇళ్లకు చెత్త బుట్టలందేలా చూసి, ప్రతి రోజూ తూచ తప్పకుండా వాటిని సేకరించే ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ వాహనాల్లో కూడా మూడు వేర్వేరు కుండీలను పెట్టి వ్యర్థాల స్వరూపాన్ని బట్టి వేరు చేస్తున్నారు. అలా సేకరించిన వ్యర్థాల్ని శుద్ధి కేంద్రాలకు తరలించి పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు.

    చెత్త నుంచి ఎరువులు

    చెత్త నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీ చూసుకుంటుండటంతో చెత్త ఏరుకునే వాళ్ల ఉపాధిపైన దెబ్బ పడింది. ఆ సమస్యకూ అధికారులే పరిష్కారం చూపారు. పట్టణంలో చెత్త ఏరుకునే వాళ్లందరికీ తమ శుద్ధి కేంద్రాల్లో ఉపాధి కల్పించారు. వాళ్లకు బూట్లూ, గ్లవ్‌జులూ, యూనిఫామ్‌లూ, మాస్క్‌ల లాంటి వాటిని అందించి చెత్తను వేరు చేసే పనిని అప్పగించారు. తడి చెత్తను వినియోగంలోకి తేవడానికి భారీ కంపోస్ట్‌ ప్లాంట్‌ని నిర్మించారు. రోజుకి పన్నెండు టన్నుల చెత్తని సేకరిస్తే, అందులోంచి నాలుగు టన్నుల జీవ ఎరువుల్ని తయారు చేస్తున్నారు. పది టన్నుల ఎరువుల్ని తయారు చేసే సామర్థ్యం ఉండటంతో పరిసర పట్టణాల నుంచి కూడా చెత్తను ఈ కేంద్రాలకు తరలిస్తూ, వాళ్ల సమస్యనూ కొంత తగ్గిస్తున్నారు. ఆఖరికి కాలువలూ, మ్యాన్‌హోళ్ల నుంచి కూడా పంపులను ఏర్పాటు చేసి, సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువులుగా మారుస్తుండటం విశేషం. శుద్ధి కేంద్రాల్లో తడి చెత్త పోగా, మిగతా వాటిలో ప్లాస్టిక్‌, ఇనుము, ఇతర వస్తువుల్ని వేరు చేసి తుక్కుగా మార్చి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ముందు పట్టణ డంపింగ్‌ యార్డులో దాదాపు యాభై అడుగుల ఎత్తులో పేరుకున్న చెత్త ప్రస్తుతం పది అడుగుల మట్టానికి చేరింది. ఇళ్ల నుంచే నేరుగా చెత్తను సేకరిస్తుండటంతో వీధుల్లో కుండీలనూ తొలగించారు. దాని వల్ల దోమలూ, పందుల లాంటి వాటి బెడదా తగ్గింది. మున్సిపాలిటీ ఖజానాకు ఒకప్పుడు గండిగా ఉన్న చెత్త, ఇప్పుడు సిరులు కురిపించే ప్రధాన వనరుగా మారింది.

     

    ఉత్తర్‌పర శివార్లలోని భాగీరథి నదీ తీరం గతంలో మినీ డంపింగ్‌ యార్డులా ఉండేది. దాని వల్ల అక్కడి జలచరాలతో పాటు కొన్ని జాతుల కీటకాలూ కనుమరుగయ్యాయి. కానీ ఏడాది క్రితం చెత్తని తొలగించి, కచ్చితమైన ఆంక్షల్ని అమలు చేయడంతో ప్రస్తుతం గంగ నీళ్లూ తేటగా మారి జీవవైవిధ్యం మెరుగైంది. ప్రాజెక్టుని అమలు చేసిన రెండు నెలల నుంచే పట్టణంలో భూగర్భ జలాల కాలుష్యం, చెత్తను తగలబెట్టడం వల్ల వ్యాపించే వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ఇప్పుడు అదే విధానాన్ని చుట్టుపక్కల మరో ఆరు పట్టణాలూ అనుసరిస్తున్నాయి. అన్ని ఇళ్లలో ఉత్పత్తయిన చెత్తని పూర్తిగా వినియోగంలోకి తెస్తూ, వీధుల్ని వ్యర్థాల రహితంగా పరిశుభ్రంగా మారుస్తూ, దేశంలో ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతంగా ఉత్తర్‌పర గుర్తింపు సాధించింది. అదే విదేశీ నగరాల్ని సైతం వెనక్కినెట్టి ఆ పట్ణణాన్ని వ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిలబెట్టింది. అధికారుల చిత్తశుద్దీ, ప్రజల భాగస్వామ్యం కలగలిసి సాధించిన విజయమిది. అలాంటి నాయకత్వం లభిస్తే మన వీధుల్నీ అందంగా చూడటం పెద్ద కష్టం కాకపోవచ్చు..!

     

    http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break67

×
×
  • Create New...