Jump to content

sonykongara

Members
  • Posts

    66,809
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ చర్చలు కొలిక్కి విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. చదరపు అడుగు రూ.3,305చొప్పున నిర్మాణం చేపట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు ముందుకొచ్చాయి. ఎల్‌ అండ్‌ టీ రెండు ప్యాకేజీల కింద నాలుగు భవనాలు, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఒక ప్యాకేజీ కింద రెండు భవనాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. జూన్‌ 15 నాటికి తాత్కాలిక సచివాలయం నిర్మించి ఇచ్చేందుకు రెండు సంస్థలు అంగీకరించాయి మేలోగా గ్రౌండ్‌ ఫ్లోర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. .
  2. India's aircraft carrier INS Viraat, which will soon be developed into an adventure tourism centre with rooms to stay in, has set sail on its farewell journey as it prepares to get decommissioned. The world's oldest operational aircraft carrier today reached Paradip port, Odisha for the very first time. It hosted NCC cadets on board. The ship will now move to Kakinada Port and from there to Chennai and finally Mumbai. "The operational cycle of the ship ends in Mumbai," Navy sources said. Andhra Pradesh chief minister N Chandrababu Naidu had recently said there is a proposal by the Defence ministry to develop the aircraft carrier as a tourist centre. Naidu said a joint venture will be set up by Andhra Pradesh government, Indian Navy and a private organisation to take up the tourism-related activities on the warship, which has been in service for almost six decades. These activities would include yachting, sea sports, sailing, gliding and cruising, he said, adding the aircraft carrier's 1,500 rooms can be used to house tourists. The ship had first served the British Navy for over 30 years before being bought by India. It was inducted into the Indian Navy in 1987 after undergoing extensive refits. Viraat, which also saw action in the Falklands War and was India's sole carrier for over a decade, attended the International Fleet Review at Visakhapatnam last week. The Navy has learnt its lesson well after India's first carrier Vikrant, which was turned into a maritime museum post-retirement in 1997, was broken up after its upkeep became very expensive. The move had led to widespread condemnation and many veterans and military historians had expressed their concern. It can carry up to 26 fighter aircraft and helicopters, including 16 Sea Harriers and helicopters such as Sea Kings, and Chetaks.
  3. ‘‘విరాట్’’ అన్న మాట విన్న వెంటనే ప్రఖ్యాత క్రికెటర్ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తారు. అదే.. ఐఎన్ ఎస్ విరాట్ అన్న వెంటనే.. భారీ యుద్దనౌక మదిలో మెదులుతుంది. ఇప్పుడా నౌక ఏపీ సొంతం కానుంది. కొన్నేళ్లుగా తన సేవలు అందించిన ఈ యుద్ధ నౌకను ఈ జూన్ నుంచి సేవల నుంచి తప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న చంద్రబాబు తెలివిగా కేంద్రం దగ్గర ఒక ప్రతిపాదన చేసిన ఈ భారీ విరాట్ ను సొంతం చేసుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. సేవల నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తున్న విరాట్ ను తమకు ఇస్తే.. దాన్నో హోటల్ గా మారుస్తామని ఆయన కోరటం.. అందుకు కేంద్రం ఓకే చెప్పేయటం జరిగిపోయాయి. ఈ భారీ నౌక భారీతనం చెప్పాలంటే గణాంకాల్లోకి వెళితే దాని గొప్పతనం తెలియటంతోపాటు.. బాబు వేసిన ఐడియా ఏపీకి ఎంతగా లాభిస్తుందో ఇట్టే అర్థమవుతుంది. విరాట్ ఎంత భారీ అంటే.. విరాట్ బరువు 27 వేల టన్నులు.. పొడువు 741 అడుగులు ఉండే విరాట్ 1987 నుంచి సేవల్ని అందిస్తోంది. ఇందులో మొత్తం వెయ్యి కంపార్ట్ మెంట్లు ఉన్నాయి. వీటిని 1500 గదులుగా మార్చే వీలుంది. ఇందులో దాదాపు 2 వేల మంది బస చేసే అవకాశం ఉంది. ఇందులోని గదుల్ని శుభ్రం చేయించి.. చక్కగా డెకరేట్ చేయగలిగితే ఇదో చక్కటి ప్లేస్ గా మారే ఛాన్స్ ఉంటుంది. 500 మంది కూర్చునే కాన్ఫరెన్స్ హాలుతో పాటు ఒకేసారి 20 విమానాలు.. 8 హెలికాఫ్టర్లు దిగే అవకాశం ఉంది. ఇంతపెద్ద నౌకను ఫ్లోటింగ్ నౌకగా మారిస్తే.. ఇదో కేసినోలా మారటమే కాదు.. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే వీలుంది. అయితే.. దీని నిర్వహణను వుడా.. నేవీ.. ప్రైవేటు సంస్థలు కలిసి కానీ ప్రాజెక్టు చేపడితే మంచి వాణిజ్యకార్యక్రమంగా మారే వీలుంది. ఫుట్ బాల్ స్టేడియం అంత సైజు ఉండే డెక్ ను.. సరిగ్గా వినయోగించుకోవాలే కానీ.. ఇదో అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా మారే వీలుంది. చిత్రమైన అనుభూతిని ఇచ్చే విరాట్ ను ఫ్లోటింగ్ హోటల్ గా మార్చి.. హెలికాఫ్టర్లో దీని దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటమా.. మరో విధంగా అన్న విషయంపై ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు కారణంగా ఏపీకి పేరు ప్రఖ్యాతులతో పాటు.. వాణిజ్యపరంగా ఇదో చక్కటి ప్రాజెక్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. 10వేల ఇళ్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసే సామర్థ్యం ఉన్న జనరేటర్లు చూస్తే.. ఇదెంత పెద్దదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. బాబు అనుకున్నట్లే విరాట్ కానీ సరిగా వినియోగించుకోగలిగితే.. చంద్రబాబు హయాంలో ఒక సూపర్ టూరిజం స్పాట్ ను తయారు చేసిన ఘనత ఆయన సొంతం అవుతుంది. మరి.. ఆ దిశగా బాబు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.
  4. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖలో పదిహేను వందల గదుల హోటల్‌లా మార్చాలని భావిస్తున్నామన్నారు. దీనికి హెలీప్యాడ్‌ కూడా ఉందన్నారు.super.
  5. https://en.wikipedia.org/wiki/INS_Viraat_%28R22%29
  6. విశాఖకే ఐఎన్‌ఎస్‌ విరాట్‌: చంద్రబాబు విజయవాడ: ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్‌ఆర్‌)పై ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖలో పదిహేను వందల గదుల హోటల్‌లా మార్చాలని భావిస్తున్నామన్నారు. దీనికి హెలీప్యాడ్‌ కూడా ఉందన్నారు. ఐఎఫ్‌ఆర్‌కు 50దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు. ‘ఐఎఫ్‌ఆర్‌’కు అద్భుత స్పందన వచ్చిందన్నారు. 50 దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ యుద్ధనౌకలను రాష్ట్రపతి సమీక్షించారని చెప్పారు. అన్ని దేశాల యుద్ధనౌకలు రాష్ట్రపతి, ప్రధానికి గౌరవ వందనం సమర్పించాయన్నారు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భారత నౌకాదళాన్ని ఆయన అభినందించారు. నావికదళ కేంద్రంగా విశాఖను రక్షణమంత్రి ప్రకటించడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను చూస్తుంటే అసలు భారత్‌లోనే ఉన్నామా అనిపించిందన్నారు. అరకు కాఫీ అదుర్స్‌ ఐఎఫ్‌ఆర్‌ వీక్షించేందుకు వచ్చిన ప్రధాని మోదీ అరకు కాఫీ రుచి చూసి చాలా బాగుందని కితాబిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఐఎఫ్‌ఆర్‌ వేడుకకు లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారన్నారు. దీనికి 15వేల మంది పోలీసులు భద్రత కల్పించారన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.130 కోట్లను ఖర్చు చేసిందన్నారు. విశాఖలో నిర్వహించిన ఇన్వెస్టర్స్‌ మీట్‌లో 44 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు చెప్పారు. దీనిలో మొత్తం రూ.4.75లక్షల ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు. సముద్ర తీర నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి తీర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు. మనకు డీప్‌ వాటర్‌ పోర్టులు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే ఏపీ అత్యుత్తమ ప్రాంతంగా మారుతుంది. పలు రేవు పట్టణాలు ఉన్న ప్రాంతం ఇదేనని అని అన్నారు. డాల్ఫిన్‌లు, ఆక్వాకల్చర్‌, అత్యధిక తీరపట్టణాలు కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నాయి. టూరిజంపై దృష్టి.. సముద్ర క్రీడలను ప్రోత్సహించి టూరిజంను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీని కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు.
  7. పుట్లగూడెం - పులిచింతల మధ్య అటవీ ప్రాంతం ఎంపిక రాజధానికి 50 కిలోమీటర్ల పరిధిలో 2700 ఎకరాలు గుర్తింపు అప్పాకు దీటుగా అన్ని శిక్షణా కేంద్రాలు ఒకేచోట.. పోలీస్‌ శిక్షణ విభాగాలకు గుంటూరు జిల్లా కేంద్రం కానుంది. హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీని తలదన్నేలా అచ్చంపేట మండలంలో నూతన అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు పుట్లగూడెం నుంచి పులిచింతల మధ్య 2700 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అన్ని విభాగాల శిక్షణ కేంద్రాలను ఇక్కడే నిర్మించనున్నారు. గుంటూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ పోలీసు అకాడమీతో పాటు మిగిలిన అన్ని విభాగాల శిక్షణా కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఏడాదిన్నరగా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో డీజీపీ రాముడు, ఇతర ఉన్నతాధికారులు అచ్చంపేట అటవీప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. అచ్చంపేట పరిధిలోని అటవీ ప్రాంతమే అనువుగా ఉంటుందని నిర్ధారించారు. ఆక్టోప్‌స, గ్రేహౌండ్స్‌కు శిక్షణ ఇవ్వాలంటే అటవీప్రాంతంలో కొండలు, గుట్టలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అచ్చంపేట అటవీప్రాంతం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణకు సరిగ్గా సరిపోతుందని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు ఆహ్లాదకర వాతావరణం, పక్కనే కృష్ణానది ఉండడంతో నీటి సదుపాయం పుష్కలంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. డీనోటిఫైకు కేంద్రానికి ప్రతిపాదనలు.. ఈ నేపథ్యంలో అచ్చంపేటకు సమీపంలోని పుట్లగూడెం నుంచి పులిచింతల మధ్య 2700 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అటవీప్రాంతం కావడంతో ఆ భూమిని డీనోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి కూడా సాధ్యమైనంత త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కావచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఏపీ పోలీసు అకాడమీ, ఏపీఎస్పీ బెటాలియన్లు, పోలీసు ట్రాన్స్‌పోర్టు అకాడమీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర విభాగాల శిక్షణ కేంద్రాలకు అవసరమైన భవనాలు, క్వార్టర్స్‌, పరిపాలనా కేంద్రాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.7500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఆ మొత్తం కూడా కేటాయించినట్లుగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం గుర్తించిన అటవీప్రాంతం ఏపీ రాజధానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వైపు పులిచింతల ప్రాజెక్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ మార్గం దగ్గరగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అచ్చంపేట అటవీప్రాంతంలో పోలీసు అకాడమీకి అనుమతి లభించినట్లయితే పులిచింతల వద్ద ఏపీ, తెలంగాణ రాషా్ట్రలను కలిపేలా మరో బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు.
  8. అచ్చంపేటలో.. అన్నీ ఒకే చోట! అకాడమీ, శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీ అక్కడే పోలీసు నిలయం ఏడీజీపీ సురేంద్రబాబు ఈనాడు, అమరావతి: శాఖాపరంగా మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఏపీ పోలీసు అకాడమీ, పోలీసు రవాణా శిక్షణ సంస్థ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీని ఒకే చోట నెలకొల్పనున్నామని ‘ఆక్టోపస్‌’ విభాగం చీఫ్‌, అదనపు డీజీపీ ఎన్‌వీ సురేంద్రబాబు అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌ 12 రోజుల పాటు సెలవు వెళ్లిన నేపథ్యంలో ఇన్‌ఛార్జి సీపీగా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయన విలేకరుల మాట్లాడారు. ప్రధాన విభాగాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట వద్దే ఇవన్నీ ఏర్పాటవుతాయని వివరించారు. కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలను ఇందులోనే నెలకొల్పుతారు. దీనికోసం 2700 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనికి అవసరమైన అటవీభూమిని డీనోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందన్నారు. భూమిని కేటాయించగానే కేంద్ర, రాష్ట్ర నిధులతో పకడ్బందీ ప్రణాళికతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఒకేచోట వివిధ సంస్థల ఏర్పాటు వల్ల సమర్థంగా వనరుల పంపకం, సద్వినియోగం సాధ్యపడుతుందన్నారు. గ్రేహౌండ్స్‌- ఆక్టోపస్‌ల ప్రధాన కార్యాలయం రాజధాని పరిసరాల్లోనే వస్తుందన్నారు. ఏపీలో శిక్షణ కేంద్రాలు నిర్మించేదాకా హైదరాబాద్‌లో ఉన్న శిక్షణ వసతులనే వినియోగించుకుంటామని చెప్పారు.
  9. Sky Choppers Logistics Private Limited, a Chennai based company is going to start the seaplane services between Visakhapatnam-Amaravati and Kakinada-Amaravati with an investment around Rs.25crores. The seaplane would land on the Prakasam Barrage in Vijayawada, in Vizag near Bheemli and a creek near Harita Beach resorts in Kakinada. The first phase of the project would start in three months with one seaplane and another seaplane is in planning in six months. The price of ride will be around Rs. 3,000-Rs.3,500. This will be huge advantage to the businessman who can wrap the work in one day and come home. Apart from the above, the firm also looking to introduce helicopter rides from Vuda Park on the Vizag beach to Kailasgiri and further be extend it to Vuda Park and Araku in the next phase.
×
×
  • Create New...