Jump to content

sonykongara

Members
  • Posts

    75,618
  • Joined

  • Last visited

  • Days Won

    113

Everything posted by sonykongara

  1. జాబ్స్‌.. జోష్‌ మన చెంతకే ప్రపంచ స్థాయి సంస్థలు అందుబాటులోకి ఎన్నెన్నో కొలువులు మెడికల్‌ హబ్‌గా రాజధాని యువత ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు ఎన్నెన్నో సంస్థలు ఇక్కడికే తరలొస్తాయి తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరంలో గేమింగ్‌, వర్చువల్‌ స్టూడియోలు అమరావతిలో రైతులే ప్రథమ పౌరులు రాజధానిలో 27 టౌన్‌ షిప్పులు: సీఎం బీఆర్‌ఎస్‌ మెడిసిటీకి శంకుస్థాపన రాజధానిలో 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బీఆర్‌ శెట్టి సంస్థలు గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కొలువులు కదలి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రానికి చెందిన యువత ఉపాధి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచస్థాయి సంస్థలే మన వద్దకు తరలి వస్తాయని స్పష్టం చేశారు. తుళ్లూరు మండలం దొండపాడులో ఏర్పాటు చేయనున్న బీఆర్‌ఎస్‌ మెడిసిటీకి గురువారం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇవ్వాలని పిలుపునిస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, వారి దూరదృష్టి వల్ల అమరావతి అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన ప్రాంతమవుతోందని అన్నారు. అమరావతిలో రైతులే ప్రథమ పౌరులని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. బెంగళూరుకు చెందిన బీఆర్‌ శెట్టి సంస్థ ద్వారా రాజధానికి రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. దీంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బీఆర్‌ శెట్టితోపాటు గల్ఫ్‌ దేశాల నుంచి ఎంతో మంది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని సీఎం వివరించారు. త్వరలో అమరావతి నుంచి ఎమిరేట్స్‌కు విమానం తిరుగుతోందని అభిలషించారు. త్వరలోనే మరో ప్రఖ్యాత సంస్థ ఇండో- యూకే ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రాజధాని ప్రాంతానికి 13 వైద్య కళాశాలలు వస్తున్నాయిని తెలిపారు. అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. అమరావతిలో 27 టౌన్‌షి్‌పలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే అమరావతిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 15 నిమిషాల్లోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరంలో గేమింగ్‌, వర్చువల్‌ స్టూడియోలను ఏర్పాటు చేయటంతోపాటు అమరావతిని నాలెడ్జ్‌, మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివసించేందుకు సుమారు 4 వేల గృహాల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పేదవారి ఆదాయాన్ని పెంచడానికి ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. మెడిసిటీలో ఏముంటాయంటే! మెడిసిటీ నిర్మాణాన్ని లాభాల కోసం చేపట్టడం లేదని, సామాజిక సేవాదృక్పథంతోనే చేపడుతున్నామని డాక్టర్‌ బీఆర్‌ శెట్టి వెల్లడించారు. మెడిసిటీలో రూ.3 వేల కోట్లతో వైద్య వర్సిటీ, వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.600 కోట్లతో వైద్య ఉపకరణాల తయారీ యూనిట్‌, రూ.250 కోట్లతో క్వాంటం డేటా సెంటర్‌, రూ.400 కోట్లతో అమరావతి ఐబీ స్కూల్‌, రూ.250 కోట్లతో నాలెడ్జ్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌ సోర్సింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
  2. కాగా, హీరోమోటార్‌ కార్ప్‌కు అనుబంధ సంస్థ అయిన రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో రూ.540 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంని కలిశారు. ఈ గ్రూప్‌ చిత్తూరు జిల్లాలో తన ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హీరో మోటర్‌ కార్ప్‌, ఫోర్డ్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ అవసరాలను తమ సంస్థ తీరుస్తోందని, ఏపీలో ఏర్పాటు చేసే ప్లాంటు ద్వారా 4000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏపీలో తమ ఉత్యాదక యూనిట్‌ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు కావాల్సిన అల్యూమినియం డైకాస్ట్‌ భాగాలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. తమ ప్రాజెక్టును మూడు దశల్లో నెలకొల్పుతామని అన్నారు. మొదటిదశలో 2019 నాటికి రూ.300 కోట్ల పెట్టుబడులతో 600 నుంచి 700 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భూ కేటాయింపులు జరిగిన నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాను భారతదేశానికే లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
  3. చంద్రబాబుతో జపాన్ బృందం భేటీ.. అమరావతి: రాష్ట్రంలో జపాన్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబుతో జపాన్ బృందం సమావేశమైంది. శ్రీ సిటీలో టోరే కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుంది. శ్రీ సిటీలో టోరే కంపెనీ టెక్నికల్ టెక్స్‌టైల్స్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. చిత్తూరులో రాక్‌మెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.540 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఒకే రోజు రెండు కంపెనీలు.. రూ. 1540 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
  4. రాజధానికి ‘గృహ’ కళ! 10-08-2017 07:40:00 2018కి 2 లక్షల మందికి సరిపడా ఇళ్లు ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు 4016 ఫ్లాట్లు బహుళ అంతస్థుల్లో 3820 ఫ్లాట్ల నిర్మాణం వాటి నిర్మాణానికి రూ.1991 కోట్ల వ్యయం ఈ ఏడే కోటి చ.అ. నిర్మాణాలకు శ్రీకారం అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 2018 చివరి నాటికి రెండు లక్షల మంది జనాభా అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కలిపి వచ్చే ఏడాది చివరికి 4,016 ఫ్లాట్లు నిర్మించనున్నారు. వీటిలో 3,820 ఫ్లాట్లను బహుళ అంతస్థులుగా నిర్మిస్తారు. ఈ బహుళ అంతస్థుల ఫ్లాట్ల నిర్మాణ ప్రాజెక్టుకు రూ.1991 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాదిలోనే కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో సుమారు 70 లక్షల వరకు ప్రభుత్వ గృహ సముదాయానికి కాగా, మిగతా 30 లక్షల చదరపు అడుగులను కార్యాలయాల కోసం నిర్మిస్తారు. సీఎం చంద్రబాబు బుధవారం సీఆర్డీయే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో నిర్మించే ప్రతి నివాస భవనం ఐకానిక్‌గా ఉండాలని సూచించారు. అత్యుత్తమ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల స్థాపనతోనే అమరావతికి అంతర్జాతీయ నగర స్థాయి వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఒక రహదారిని ఫార్ములా వన్‌ రోడ్డుగా నిర్మించాలని సీఆర్డీయేకి సూచించారు. ఇప్పటివరకు రైతులకు స్థలాలు ఇచ్చిన కొన్ని జోన్లలోనే రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన జోన్లలోనూ మౌలికవసతుల కల్పన పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపారు. దీనికి రూ.13,500 కోట్లు కేటాయించారు. పీపీపీ, హైబ్రిడ్‌ యాన్యుటీ పద్ధతిలో రహదారులను నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాజధాని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న శక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని, దానికి ఇటీవల తుళ్లూరులో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. అమరావతిలో జరిగే నిర్మాణాలన్నింటినీ పర్యవేక్షించేందుకు సీఆర్డీయే కార్యాలయాన్ని 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు సీఎం ఆమోదముద్ర వేశారు. పాత్రికేయులకు ఫ్లాట్లు ఎక్కడ? పాత్రికేయులకు ఇచ్చే ఫ్లాట్లు ఎక్కడ ఉండాలన్న దానిపైనా సీఆర్డీయ బహుళ అంతస్థుల ఫ్లాట్లు ఇలా అమరావతిలో బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్ల రూపంలో నిర్మించనున్న ఫ్లాట్లలో ఎవరికి ఎన్ని అనే అంశాన్ని సమావేశంలో ఖరారు చేశారు. ఈ బహుళ అంతస్థుల భవనాల్లో ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,185 నుంచి రూ.2,722 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఫ్లాట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటిష్‌ జియోలాజికల్‌ సర్వేతో ఒప్పందం బ్రిటిష్‌ జియోలాజికల్‌ సర్వే(బీజీఎస్)తో సీఆర్డీయే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియన్‌ రీసెర్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఫర్‌ అర్బన్‌ జియోసైన్స్‌ ప్రాజెక్టులో భాగంగా కౌలాలంపూర్‌, హనోయ్‌ నగరాలతోపాటు అమరావతిలో కూడా ఆ సంస్థ సర్వే చేస్తుంది. ఆసియాలో ఆ సంస్థ ఎంపిక చేసుకున్న మూడో నగరం అమరావతి కావడం గమనార్హం.
  5. చంద్రబాబు పెద్ద మనసు 10-08-2017 20:04:05 అమరావతి: ఏపీ సిఎం చంద్రబాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. గుండె మార్పిడి రోగికి రూ 15 లక్షల సాయం అందించారు. నాలుగేళ్లుగా గుండెజబ్బుతో బాధపడుతున్న అంచుల కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. రోజు రోజుకూ క్షీణిస్తుండటంతో వైద్య పరీక్షలు చేయించాడు. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీస్‌లో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించగా గుండె మార్పిడితోనే మనుగడ సాగించగలడని తేల్చారు. ఇందుకు రూ. 20 నుంచి 25 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అసలే పేదరికం. ఉన్న కొద్దిపాటి ఆస్తి గుండె వైద్యానికే కరిగిపోయింది. ఈ పరిస్థితిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. తన బిడ్డను ఆదుకోవాలని కిరణ్ కుమార్ తల్లి అంచుల రాజమ్మ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. కిరణ్ భార్య, ముగ్గును చిన్నారులను చూసి ముఖ్యమంత్రి చలించారు. కిరణ్ గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
×
×
  • Create New...