Jump to content

sonykongara

Members
  • Posts

    66,785
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. 591 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 : వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి అత్యాధునిక హంగులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే హెచఓడీల కోసం జీ+1 భవనాన్ని జీ+3కి విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీఆర్‌డీఏ అధికారులు రూ.591 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఖర్చు రూ.180 కోట్ల నుంచి రూ.220 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు సచివాలయ విస్తరణ, విద్యుత, నీటి సరఫరా,పైపులైన్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, ఫర్నీచర్‌, ఇతర అంతర్గత హంగుల కోసం వెచ్చించాలని నిర్ణయించిన రూ.591 కోట్లతో, తాత్కాలిక సచివాలయ నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లకు పైగా చేరనుంది. తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడిలో ఇప్పుడు ఉన్న విద్యుత లైన్లు సచివాలయానికి సరఫరా చేయలేవు. దీంతో సచివాలయ ప్రాంతంలో ప్రత్యేకంగా రూ.11 కోట్ల ఖర్చుతో విద్యుత ప్లాంట్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్లాంట్‌ ద్వారా తాత్కాలిక సచివాలయానికి విద్యుత సరఫరా చేయనున్నారు. మొదట జీ+1 స్థాయిలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, తాజాగా దాన్ని జీ+3 గా మార్చాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదనంగా నిర్మించాలనుకుంటున్న భవన అంతస్తు ఖర్చును ఆ రూ.591 కోట్ల నుంచి సమాకూర్చాలని నిర్ణయించారు. హెచఓడీలకు ప్రత్యేకించి భవనం నిర్మించే అవసరం లేకుండా జీ+1ను జీ+3గా మార్చాలని భావిస్తున్నారు. మొదట హెచఓడీల కోసం తాత్కాలిక సచివాలయం ఎదుటే అదేస్థాయిలో మరో జీ+1 భవనం నిర్మించాలని ప్రతిపాదించారు.
  2. chala mandi unnaru manaki akkada . ippudu Nakirikallu madal sattenpalli lo undi. ela plan chestharo chudali.
  3. http://epaper.andhrajyothy.com/765136/Kurnool/01.04.2016#page/1/1 http://epaper.andhrajyothy.com/765136/Kurnool/01.04.2016#page/7/1
  4. AbbaiG bro e project gurinchi konchem clarity ivvandi
  5. గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఎస్సీలకు అదనంగా మరో స్థానం ఎస్టీలకు కూడా ఒక స్థానం దక్కే పరిస్థితి కార్పొరేషన్ పరిధిలో అదనంగా ఇంకోటి ప్రత్తిపాడు ఓసీ అయితే పొన్నూరు ఎస్సీ ఔత్సాహికుల్లో ఆనందోత్సాహం గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో నిర్వహించే పార్లమెంటు సమావేశంలోనే సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చనున్నాయి. జనాభా దామాషా ప్రకారం ప్రతి రెండు లక్షల 19 వేల జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. దీని ప్రకారం జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 22కు చేరనుంది. 2009 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మూలంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలు స్థానే 17 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. దుగ్గిరాల, కూచినపూడి నియోజకవర్గాలు రద్దయ్యాయి. అప్పటివరకు ఓసీ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఓసీ కేటగిరీలో ఉన్న బాపట్ల లోక్‌సభ స్థానం ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఇది అప్పట్లో కొందరు రాజకీయనేతల తలరాతలు మార్చేసింది. తాజాగా రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాషా్ట్రల్లో చేపట్టిన పునర్విభజన ప్రక్రియ ఎవరికి వరంగా మారనుందో ఎవరెవరికి శాపంగా మారుతుందో వేచి చూడాలి. నాలుగుకు చేరనున్న ఎస్సీ నియోజకవర్గాలు జిల్లాలో కొత్తగా ఏర్పడే ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎస్సీలను వరించే అవకాశం ఉంది. ఇప్పటికే తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. తాజాగా ఏర్పడే నియోజకవర్గాల్లో చెరుకుపల్లి కేంద్రంగా ఏర్పడే నియోజకవర్గం ఎస్సీలకు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం ఓసీ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పొన్నూరు నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. కొత్తగా వచ్చే ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎస్టీలకు కూడా దక్కే అవకాశం ఉంది. మాచర్ల లేదా వినుకొండ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఆ సామాజిక వర్గానికి దక్కుతుందని భావిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ స్థానానికి తొమ్మిది.. ఒక్కో లోక్‌సభ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే విధంగా నియోజకవర్గాల పునఃర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఏడు నియోజకవర్గాలు ఉండగా అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు కలుస్తాయి. కొత్తగా ఏర్పడే వాటిలో ఒకటి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా పునఃర్విభజన అనంతరం వాటి సంఖ్య మూడుకు చేరనుంది. ప్రస్తుతం ఉన్న రెండు నియోజకవర్గాలు తూర్పు, పశ్చిమలు కాగా కొత్తగా ఏర్పడే నియోజకవర్గాన్ని గుంటూరు సెంట్రల్‌గా ఏర్పరిచే అవకాశం ఉంది. మిగతా నాలుగు నియోజకవర్గాలు పిడుగురాళ్ళ, చెరుకుపల్లి, పెదకాకాని, నకరికల్లు కేంద్రాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఔత్సాహికుల్లో ఆనందం వచ్చే ఎన్నికల నాటికే జిల్లాలో అదనంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయనే వార్త ఎప్పటి నుంచో ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగాలనే ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహికుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. సామాజిక స మీకరణలలో భాగంగా గత ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు చేజార్చుకున్నవారు, గతం లో ఓడి ఈ పర్యాయం గెలిచే అవకాశం ఉన్నప్పటికీ సీనియర్ల కోసం సీటు త్యాగం చేసిన వారు వచ్చే ఎన్నికల్లోనైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ఆశల్లో విహరిస్తున్నారు. బాపట్లకు చెక్కుచెదరని పరిస్థితి .. నియోజకవర్గాల విభజన ప్రక్రియలో జిల్లా లో ఒక్క బాపట్ల నియోజకవర్గం మొత్తం చె క్కుచెదరకుండా ఉండే పరిస్థితి ఉంది. ఒక ని యోజకవర్గంలో రెండు లక్షల 19వేల మంది ఉండాల్సి ఉంది. జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఈ
  6. గోదావరి వృథా జలాలు సాగర్‌ ఆయకట్టుకు చింతలపూడి ఎత్తిపోతల ద్వారా మళ్లించే వీలు ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అధికారుల ప్రతిపాదన ఈనాడు, రాజమహేంద్రవరం: గోదావరికి వరదలు వచ్చినప్పుడు అందులో నుంచి మరో 38 టీఎంసీల నీటిని చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు మళ్లించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగిన కారణంగా నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రుణంలో సుమారు రూ.480 కోట్లు ఆదా అయింది. దీంతో ఆ మిగులు నిధులను మరిన్ని పనులకు కేటాయించాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ ప్రాజెక్టు పీడీ వెంకటరామయ్య కోరారు. రాజమహేంద్రవరానికి బుధవారం వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో నాగార్జునసాగర్‌ ఆధునికీకరణ పనుల ఇంజినీర్లు, నీటి పంపిణీ సంఘ ప్రతినిధులు ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు నిధులతో చేపట్టనున్న పనుల వివరాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు స్థిరీకరణతో పాటు కృష్ణా జిల్లాలో అదనంగా మరో 2.80 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు తమ వద్ద ఉన్న ప్రతిపాదనలు చూపారు. ఇందుకు రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న సగటు నీటిలో 1.5 శాతం మాత్రమే తాము సేకరిస్తామని, ఆ సమయంలో నాగర్జునసాగర్‌ పరిధిలో వరదలుంటే తీసుకోబోమని తెలిపారు. దీనిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలను అందజేయాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులు చెన్‌జుయూన్‌, బీకేడీ రాజు, ఎస్‌కే జైన్‌, పి.శ్రీనివాసరావు సూచించారు.
×
×
  • Create New...