Jump to content

sonykongara

Members
  • Posts

    75,504
  • Joined

  • Last visited

  • Days Won

    113

Everything posted by sonykongara

  1. అమరావతికి మహర్దశ - ఓఆర్ఆర్ వెడల్పు 140 మీటర్లకు కేంద్రం గ్రీన్సిగ్నల్ - AMARAVATHI ORR PROJECT 70 మీటర్లకు బదులు 140 మీటర్ల మార్పునకు కేంద్రం పచ్చజెండా - మార్చిలో గడ్కరీ, చంద్రబాబు భేటీ నిర్ణయాలు అధికారికంగా వెల్లడి Amaravathi ORR Project (EENADU) By ETV Bharat Andhra Pradesh Team Published : July 4, 2025 at 8:26 AM IST 4 Min Read Amaravathi ORR Project : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 140 మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో 70 మీటర్ల వెడల్పుతో 189 కి.మీ. ఓఆర్ఆర్ నిర్మాణానికి అంగీకారం తెలపగా, ఇది సరిపోదంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దేశంలోనే మోడల్ నగరంగా అమరావతిని నిర్మిస్తుండటం, 50 ఏళ్లలో ఓఆర్ఆర్పై పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఆర్ను 150 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని చంద్రబాబు పట్టుబట్టారు. దీనితో కేంద్రం 140 మీటర్ల వెడల్పుకు అంగీకరించింది. విజయవాడ తూర్పు బైపాస్ సాధ్యం కాదని గతంలో కేంద్రం పేర్కొన్నందున, దాని స్థానంలో ఓఆర్ఆర్కు అనుసంధానించడానికి రెండు చోట్ల లింక్ రోడ్ల నిర్మాణానికి అంగీకరించింది. మార్చి 5న దిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఓఆర్ఆర్తో పాటు రాష్ట్రంలోని అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని మినిట్స్ రూపంలో పేర్కొంటూ అధికారికంగా వివరాలను గురువారం ఇక్కడి అధికారులకు వచ్చాయి. భూసేకరణకు రాష్ట్రం రూ.1000 కోట్లు : ఓఆర్ఆర్కు 70 మీటర్ల వెడల్పు చాలంటూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ గత డిసెంబరులో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదనంగా 70 మీటర్ల వెడల్పునకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో రూ.1,000 కోట్లు రాష్ట్రం వెచ్చించేందుకు చంద్రబాబు అంగీకరించారు. చంద్రబాబు, గడ్కరీ సమావేశం మార్చిలో జరిగినప్పుటికీ, అందులో తీసుకున్న నిర్ణయాల వివరాలు అధికారికంగా విడుదల కాకపోవడంతో కొంత అస్పష్టత నెలకొంది. దీంతో ఇక్కడి ఎన్హెచ్ఏఐ అధికారులు, 70 మీటర్ల వెడల్పుతోనే ఓఆర్ఆర్కు 5 జిల్లాల్లో భూసేకరణను ఇటీవల ప్రారంభించారు. తాజాగా 140 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు ఖరారు చేస్తూ నిర్ణయం రావడంతో దానికి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. రెండు అనుసంధాన రోడ్లు : విజయవాడ పశ్చిమ వైపున బైపాస్ నిర్మాణం తుది దశలో ఉండగా, ఇప్పుడు తూర్పు వైపు నాలుగు వరుసలతో బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ తూర్పు బైపాస్ అమరావతి ఓఆర్ఆర్కు సమాంతరంగా ఉన్నందున, తూర్పు బైపాస్ను వద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రత్యామ్నాయంగా చెన్నై - కోల్కతా ఎన్హెచ్-16పై కాజ వద్ద ముగిసే విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి సమీపంలో ఓఆర్ఆర్ వరకు 17.5 కి.మీ. మేర లింక్రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గుంటూరు శివారులోని బుడంపాడు వద్ద ఎన్హెచ్-16 నుంచి నారాకోడూరు సమీపంలో ఓఆర్ఆర్ వరకు 5.2 కి.మీ. మేర మరో లింక్ రోడ్డు నిర్మాణానికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైపాస్‌లో నాలుగు చోట్ల వంతెనలు : గొల్లపూడి నుంచి రాజధాని ప్రాంతం మీదుగా కాజ వరకు వెళ్లే విజయవాడ వెస్ట్ బైపాస్లో నాలుగు రహదారుల వద్ద అండర్పాస్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. తొలుత వెస్ట్ బైపాస్ పూర్తిచేసిన తర్వాత దశలవారీగా వీటిని నిర్మిస్తారు. గుంటూరుకు హైవే విస్తరణ : అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న హైవే-544డి లో వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు వరుసలుగా విస్తరించడానికి గత సంవత్సరం డిసెంబరులో మోర్త్ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. వినుకొండ నుంచి గుంటూరులోని చెన్నై-కోల్కతా హైవే వరకు 109.65 కి.మీ. మేర విస్తరించకుండా, ఔటర్ రింగ్ క్రాస్ వరకు విస్తరణకు 84.80 కి.మీ. మేరకే ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గడ్కరీ వద్ద ప్రస్తావించారు. గుంటూరు వరకు ఎన్హెచ్-544డి ని విస్తరించాలని కోరారు. దీంతో గుంటూరు వరకు మిగిలిన 24.85 కి.మీ. దూరాన్నీ నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం అంగీకరించింది. విశాఖలో 12జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్లు : శ్రీకాకుళం జిల్లా మూలపేట నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఇది తీరానికి దగ్గరగా ఉండేలా దీనిపై అధ్యయనం చేయనున్నారు. విశాఖ మీదుగా వెళ్లే పాత చెన్నై-కోల్కతా హైవేలో లంకెలపాలెం నుంచి మధురవాడ కార్షెడ్ జంక్షన్ వరకు మొత్తం 12 జంక్షన్లు ఉన్నాయి. వీటివద్ద వంతెనల నిర్మాణానికి తొలుత ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఒకటి నుంచి ఎనిమిదో జంక్షన్ వరకు 15 కిలో మీటర్ల ఎలివేటెడ్ బ్రిడ్జిని , ఆ తర్వాత 3 జంక్షన్లకు 8 కిలో మీటర్ల మరో ఎలివేటెడ్ బ్రిడ్జిని నిర్మించారు. 12వ జంక్షన్ వద్ద ప్రత్యేక బ్రిడ్జిని నిర్మాణానికి అంగీకరించారు. వీటిలో 10 జంక్షన్ల మీదుగా మెట్రో రైలు ప్రాజెక్టు వెళ్తుండటంతో, ఎన్హెచ్ఐ వంతెన, దానిపైన మెట్రోరైలు వంతెనను కలిపి నాగ్పుర్ తరహాలో ఒకే ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడలోని గొల్లపూడి వరకు 226 కి.మీ. హైవేను ఆరు/ఎనిమిది వరుసలుగా, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేను ఆరు వరుసలుగా విస్తరించడానికి సంబంధించిన డీపీఆర్లను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు. కుప్పం నుంచి తమిళనాడులోని హోసూర్ మధ్య 56 కి.మీ. నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం 9 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తారు. కాకినాడ పోర్టుకు దక్షిణ వైపు నుంచి కత్తిపూడి-ఒంగోలు హైవేకు అనుసంధానం చేసేందుకు డీపీఆర్ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. చెన్నై-కోల్‌కతా హైవే నెల్లూరు వద్ద 17.16 కి.మీ బైపాస్ నిర్మాణం పూర్తయినప్పటికీ, దానిపై టోల్ ప్లాజా ఏర్పాటు చేసేందకు 2015 నుంచి ఎన్హెచ్ఐ ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనితో నగర పరిధి దాటిన తర్వాత మరెక్కడైనా హైవేపై టోల్ప్లాజా ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గడ్కరీ సూచించారు.
  2. Amaravati Govt Complex Buildings: అమరావతి ప్రభుత్వ సముదాయం (AGC)లోని భవనాలకు కొత్త టెక్నాలజీతో ‘డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌’ ద్వారా శీతలీకరణ అందించనున్నారు. ఈ సముదాయంలోని ఐకానిక్‌ టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు ఏసీ యంత్రాలు బిగించకుండా, వీటి స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కూలింగ్ అందిస్తారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తబ్రీద్‌ సంస్థతో ఒప్పందంపై 2018లో సీఆర్డీఏతో సంతకాలు అయ్యాయి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఒప్పందం అమలుకు నోచుకోలేదు. రూ.350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల సెంట్రల్ కూలింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. పాత ఒప్పందం ప్రకారం అదే ధరకు అందించేందుకు సదరు సంస్థ ముందుకొచ్చింది. దీనికి ప్రపంచ బ్యాంకు సైతం ఆమోదం తెలిపింది. భూగర్భంలో ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కూలింగ్: అమరావతిలో ఎక్కువగా భవనాలు ఉండే ప్రాంతాల్లో వ్యక్తిగత ఏసీలు ఏర్పాటు చేయకుండా, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సీఆర్డీఏ భావిస్తోంది. సెంట్రల్ ప్లాంట్‌ ద్వారా బహుళ భవనాలకు భూగర్భంలో ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కూలింగ్ అందిస్తారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు. గడువు ముగిసిన తరువాత ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగిస్తారు. విద్యుత్తు బిల్లు ఆదా అవుతుంది: అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్‌ బ్లాక్‌ ‘E’లో అసెంబ్లీ భవనాన్ని 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 3 అంతస్తుల్లో డిజైన్లు రూపొందించారు. హైకోర్టు సూపర్‌ బ్లాక్‌ ‘F’లో 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానుంది. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులతో బిల్డింగ్ని నిర్మిస్తున్నారు. ఐకానిక్‌ టవర్లలో సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు రానున్నాయి. విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. గుత్తేదారు సంస్థలకు ఇటీవలే సీఆర్డీఏ ఎల్‌వోఏలు అందజేసింది. వీటికి కొత్త వ్యవస్థ ద్వారా అందించే కూలింగ్ ద్వారా దాదాపు 50% మేర విద్యుత్తు ఆదా కావడంతో పాటు వ్యయంలో 20% వరకు తగ్గనుందని భావిస్తున్నారు.
  3. నిన్న అనౌన్స్ చేసిన క్వాంటం మిషన్ లో మైక్రోసాఫ్ట్ కూడా జాయిన్ అవబోతోంది అని న్యూస్ వచ్చింది !! నిజంగా ఇది నిజమైతే దేశానికే #ఆంధ్రప్రదేశ్ ఒక ఐకాన్ గా నిలబడుతుంది !! అయితే... 2014 -19 మధ్యలో నేను ఈ Microsoft Azure పేరు చాలాసార్లు విన్నాను ! ఇవాళ ఈ న్యూస్ విన్నాక... ఒకసారి దీని గురించి తెలుసుకోవాలని అనిపించింది ! దీని గురించిన వివరాలు మీ కోసం : Azure Quantum అనేది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఒక క్లౌడ్ ఆధారిత ఫ్లాట్‌ఫారమ్, ఇది క్వాంటం కంప్యూటింగ్ మరియు క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన సేవలను అందిస్తుంది. ఈ ఫ్లాట్‌ఫారమ్ డెవలపర్లు, పరిశోధకులు మరియు సంస్థలు క్వాంటం కంప్యూటింగ్ సామర్థ్యాలను అన్వేషించడానికి మరియు వాటిని ఉపయోగించడానికి సహాయపడుతుంది. Azure Quantum యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఇలా ఉన్నాయి:క్వాంటం హార్డ్‌వేర్ యాక్సెస్: Azure Quantum వివిధ భాగస్వాములైన క్వాంటం హార్డ్‌వేర్ ప్రొవైడర్ల (ఉదా., IonQ, Quantinuum, మరియు Photonic) ద్వారా క్వాంటం కంప్యూటర్లకు యాక్సెస్ అందిస్తుంది. ఇది వినియోగదారులు క్వాంటం సిమ్యులేటర్లు మరియు నిజమైన క్వాంటం హార్డ్‌వేర్‌పై ప్రోగ్రామ్‌లను అమలు చేయడానికి అనుమతిస్తుంది. క్వాంటం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్: ఇది Q# అనే క్వాంటం ప్రోగ్రామింగ్ భాషను అందిస్తుంది, దీనితో డెవలపర్లు క్వాంటం అల్గారిథమ్‌లను రూపొందించవచ్చు. ఈ ఫ్లాట్‌ఫారమ్ క్వాంటం డెవలప్‌మెంట్ కిట్ (QDK) మరియు ఇతర ఓపెన్-సోర్స్ సాధనాలను కూడా అందిస్తుంది. హైబ్రిడ్ కంప్యూటింగ్: Azure Quantum క్లాసికల్ మరియు క్వాంటం కంప్యూటింగ్‌ను ఏకీకృతం చేస్తుంది, దీనివల్ల వినియోగదారులు మైక్రోసాఫ్ట్ Azure యొక్క క్లౌడ్ సేవలతో క్వాంటం సొల్యూషన్‌లను అనుసంధానించవచ్చు. ఇది క్వాంటం మరియు సాంప్రదాయ కంప్యూటింగ్ మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. అప్లికేషన్ రంగాలు: Azure Quantum క్వాంటం కంప్యూటింగ్‌ను ఉపయోగించి కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్, మరియు మెషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మైక్రోసాఫ్ట్ యొక్క క్వాంటం పరిశోధన: మైక్రోసాఫ్ట్ టోపోలాజికల్ క్వాంటం కంప్యూటింగ్‌పై దృష్టి సారిస్తోంది, ఇది స్థిరమైన మరియు స్కేలబుల్ క్వాంటం కంప్యూటర్లను నిర్మించడానికి ఒక వినూత్న విధానం. ఈ పరిశోధనలో భాగంగా, Azure Quantum భవిష్యత్తులో అధునాతన క్వాంటం సామర్థ్యాలను అందించగలదు. ప్రస్తుతం, Azure Quantum ఇంకా అభివృద్ధి దశలో ఉంది, మరియు ఇది క్వాంటం టెక్నాలజీని వాణిజ్య రంగంలో మరియు పరిశోధనలో విస్తరించడానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని క్వాంటం వ్యాలీ మిషన్‌తో మైక్రోసాఫ్ట్ సంభాషణలలో ఉన్నట్లు కొన్ని వార్తలు సూచిస్తున్నాయి !!
  4. Cruise ship: పర్యాటక, ఆర్థికాభివృద్ధిలో విశాఖది కీలకపాత్ర By Andhra Pradesh News DeskPublished : 03 Jul 2025 05:23 IST Ee Font size 2 min read కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ నగరానికి చేరుకున్న క్రూజ్‌ నౌక జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
  5. : విశాఖలో ప్రారంభమైన సముద్ర విహారనౌక By Andhra Pradesh News TeamPublished : 03 Jul 2025 00:08 IST Ee Font size 1 min read విశాఖ: నగరంలో సముద్ర విహార నౌకను ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి కేంద్రమంత్రి సోనోవాల్‌ ప్రారంభించారు. కేంద్రమంత్రి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్‌ టర్మినల్‌ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో క్రూయిజ్‌ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. క్రూయిజ్‌ వల్ల పర్యటక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. క్రూయిజ్‌ టర్మినల్‌ ఏర్పాటు చేసిన విశాఖ పోర్టు అథారిటీని మంత్రి దుర్గేష్‌ ప్రశంసించారు.
  6. రాజధాని రెండో విడత భూ సమీకరణ కోసం అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండలం పరిధిలోని పాములపాడు, భేజాత్ పురం, రావెలగ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాస్ గ్రామ సభల్లో పాల్గొన్నారు. రాజధాని భూ సమీకరణకు రైతులు అంగీకారం తెలుపుతూనే...... తమ డిమాండ్లను అధికారుల ముందుంచారు. భూ సమీకరణ ద్వారా తాము కూడా రాజధాని ప్రాంతంలోకి చేరతామని రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు కూలీల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు.
×
×
  • Create New...