Jump to content

sonykongara

Members
  • Posts

    66,923
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. కొండపల్లి కోట అభివృద్దికి మాస్టర్ ప్లాన్ విజయవాడ: కొండపల్లి కోట అభివృద్దికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. 4 కోట్ల తో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. ఆసియాలోనే మొదటి ఓపెన్ ఎయిర్ మ్యూజియం, జాతీయ,అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. పర్యాటక శాఖ అధికారులతో కార్యదర్శి మీనా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19న మాస్టర్ ప్లాన్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపనున్నారు.
  2. అమరావతి పిలుస్తోంది జపాన్‌ను! దీన్ని మీ మరో ఇల్లులా భావించండి కలసి నడుద్దాం... కలసి అభివృద్ధి చేద్దాం టోక్యోకంటే అందంగా నిర్మించాలి: చంద్రబాబు అభివృద్ధిలో మమేకమవుతాం: జపాన్‌ మంత్రి ఈనాడు - అమరావతి ‘‘ఈ రాష్ట్రం, అమరావతిని మీరు మరో సొంతిల్లులా భావించండి. ఎప్పుడైనా మీరు ఇక్కడికి స్వేచ్ఛగా రావొచ్చు. ఈ నగరాన్ని టోక్యో కంటే గొప్పగా అభివృద్ధి చేయాలి. అక్కడి కంటే ఇక్కడే నివసించడానికి మీరు (జపాన్‌వాసులు) ఎక్కువగా ఇష్టపడేలా వాతావరణం కల్పిస్తాం. రాబోయే రోజుల్లో అమరావతి నుంచి టోక్యోకు నేరుగా విమానం నడుపుతాం. జపాన్‌ కంపెనీలు పెద్దఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి’’ -నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘‘మీ ఆదరాభిమానాలు మమ్మల్ని ఎప్పుడూ పులకింపజేస్తుంటాయి. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో వేలాది మంది జనం మధ్యలో మాట్లాడటం నాకు ఎంతో సంతోషమేసింది. అమరావతి అభివృద్ధిలో మమేకమవుతాం. మన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందాం. ఇప్పటికే పలు జపాన్‌ సంస్థలు ఇక్కడ అడుగుపెట్టాయి. ఈ బంధం, ఈ సహకారాన్ని ఇక ముందు కొనసాగిస్తాం.’’ -యోసుకె టకాగి, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, జపాన్‌ నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి సహాయ సహకారాలు అందించేందుకు జపాన్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు జపాన్‌ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ (మేటీ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహనకు వచ్చి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి, జపాన్‌ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో)లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బుధవారం విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, అమరావతి ఇందుకు అనువైందన్నారు. రాబోయే 30ఏళ్లలోపు అమరావతి తరహాలో నిర్మాణం జరిగే మరో నగరం ఇక్కడ ఉండబోదని, జపాన్‌ కంపెనీలకు ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఈ నగరంలో చేపట్టే పలు రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో సహకారం అందించడానికి జపాన్‌ ప్రభుత్వం ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. జపాన్‌, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందాలు త్వరితగతిన కార్యరూపందాల్చడానికి వీలుగా అవకాశముంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇక్కడి అధికారుల బృందం జపాన్‌కు వెళ్లి, అక్కడి ప్రతినిధులు బృందం ఇక్కడికి వచ్చి చర్చలు జరిపి, పనులు వేగవంతం చేద్దామన్నారు. జపాన్‌ దేశ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యోసుకె టకాగి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తాము, జపాన్‌కు చెందిన సంస్థలు పూర్తి సహకారం అందిస్తాయని చెప్పారు. ఇక్కడ అవకాశం ఉన్న అన్ని చోట్లా భాగస్వాములవుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓ జాస్తి కృష్ణకిశోర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కు చెందిన సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, సహకారం అందించడానికి ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సమావేశంలో జపాన్‌ ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. పక్షం రోజుల్లో శ్రీసిటీకి అగ్నినిరోధక వ్యవస్థ చిత్తూరు జిల్లాల్లోని శ్రీసిటీకి పక్షం రోజుల్లోగా అగ్నినిరోధక వ్యవస్థలో భాగంగా దళాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు జపాన్‌ ప్రతినిధులు బృందానికి హామీ ఇచ్చారు. శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన ఇసుజు సంస్థ డిప్యూటీ ఎండీ హితోషికొనో మాట్లాడుతూ తాము 50వేల వాహనాల తయారీ సామర్థ్యమున్న ప్లాంటు నెలకొల్పామని, అగ్నినిరోధక వ్యవస్థ లేదని, అంతర్గత రహదారి వ్యవస్థ, తదితర సమస్యలు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ దస్త్రం ఆర్థిక శాఖ వద్ద ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధా సీఎం దృష్టికి తీసుకెళ్లగా... ‘అవన్నీ నాకు తెలీదు. నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. అక్కడ ఈ అగ్నినిరోధక వ్యవస్థ ఏర్పాటవాలి. ఇక్కడే ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు కదా..’ అని స్పష్టం చేశారు. జపాన్‌-ఏపీ సంయుక్త సహకార ప్రకటనవిద్యుత్తు: భారీ పెట్టుబడులకు సుముఖత. రియల్‌టైమ్‌ స్మార్ట్‌ రీడింగ్‌ మీటర్లు అమర్చడానికి ఫుజి ఎలక్ట్రానిక్స్‌ ముందుకొచ్చింది. ప్రతి నిమిషానికి ఒక సారి మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసేలా ఇవి పనిచేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి, రెండు వేల మీటర్లు అమర్చి పైలట్‌ పథకం కింద ఈ పనులు ప్రారంభించడానికి ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. చెత్త నుంచి విద్యుత్తు: చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంటును కాకినాడలో ఏర్పాటు చేయడానికి అక్కడ ఒక సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇలాంటివి మొత్తం 12 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి: డాటా సెంటర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాం, విపత్తుల నిరోధం, ట్రాఫిక్‌ వ్యవస్థ, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి విధానం రంగాల్లో జపాన్‌ తన స్మార్ట్‌ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇక్కడ క్రీడానగరం, ఎలక్ట్రానిక్‌ నగరాల అభివృద్ధికి తగ్గ మాస్టర్‌ ప్రణాళికలు రూపొందిస్తుంది. నవ నగరాలకు ఐటీ ఏర్పాట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. పరిశ్రమలు: ఫుడ్‌ వాల్యూ చైన్‌ అభివృద్ధి చేయడానికి జపాన్‌, ఏపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. జేఈసీ కోర్సులు: మానవ వనరుల అభివృధ్ధి, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి అమరావతిలోని ఎన్‌బీకేఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో జపాన్‌కు చెందిన మీడెన్‌షా సంస్థ ‘జపాన్‌ ఎండౌడ్‌ కోర్సు’ ప్రారంభిస్తుంది.
  3. కోహినూర్‌లా అసెంబ్లీ హైకోర్టుకి బౌద్ధ స్థూపాకృతి ఖరారు చేసిన ముఖ్యమంత్రి ఈనాడు - అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనాన్ని కోహినూర్‌ వజ్రం ఆకృతిలో నిర్మించాలని నిర్ణయించారు. హైకోర్టు భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మిస్తారు. రాజధానిలో 1365 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల తుది బృహత్‌ ప్రణాళిక, శాససనభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు విజయవాడలో బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. శాసనసభ కోసం ఈ సంస్థ ఇది వరకే స్థూపాకార ఆకృతిని సిద్ధం చేసింది. ఇప్పుడు హైకోర్టు భవనం కోసం వజ్రాన్ని పోలిన ఆకృతిని రూపొందించింది. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... స్థూపాకృతిని హైకోర్టుకి, వజ్రం ఆకృతిని శాసనసభకు మార్చాలని సూచించారు. ఆ సంస్థ రూపొందించిన వజ్రం ఆకృతిని మార్చి కోహినూర్‌ వజ్రాన్ని పోలిన విధంగా రూపొందించాలని చెప్పారు. ‘‘కోహినూర్‌ వజ్రం ఈ గడ్డపైనే దొరికింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని అసెంబ్లీ భవనం రూపంలో చూసుకుని సంతోషపడతారు...’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘స్థూపం సంతోషానికి చిహ్నం. న్యాయం జరిగినప్పుడే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కోర్టు గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తి స్థూపాకారంలో ఉన్న ఈ భవనాన్ని చూసి తనకు ఇక్కడ నిజమైన న్యాయం దక్కుతుందని భావించాలి...’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ భావనతో ఆలోచిస్తే స్థూపాకృతి హైకోర్టుకి సరిగ్గా అమరుతుందని దాన్ని ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. మన అసెంబ్లీ ‘కోహినూర్‌ వజ్రం’..! ఈనాడు - అమరావతి శాసనసభ భవనం ఆరు అంతస్తులుగా నిర్మిస్తారు. మొత్తం 4.50 లక్షల చ. అడుగులు నిర్మిత ప్రాంతం ఉంటుంది. * గ్రౌండ్‌ఫ్లోర్‌లో నాలుగు బ్లాక్‌లు ఉంటాయి. సెంట్రల్‌ హాల్‌ ఉంటుంది. దానికి కుడిపక్కన శాసన మండలి, ఎడమ పక్క శాసనసభ సమావేశ మందిరాలు ఉంటాయి. సెంట్రల్‌ హాల్‌కి ఎదురుగా పరిపాలనా విభాగం ఉంటుంది. * వీటి మధ్యలో పీపుల్స్‌ ప్లేస్‌ ఉంటుంది. ఇక్కడికి ప్రజల్ని అనుమతిస్తారు. వర్తులాకారపు మెట్ల ద్వారా భవనంపైకి వెళ్లే వీలుంటుంది. భవనం పైభాగం నుంచి నగరాన్ని వీక్షించేలా ‘వ్యూయింగ్‌ గ్యాలరీ’ ఉంటుంది. కింది భాగంలో మ్యూజియం ఉంటుంది. * మొదటి, రెండు అంతస్తుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్ల ఛాంబర్లు ఉంటాయి. వాటి పైఅంతస్తుల్లో లైబ్రరీ, సమావేశమందిరాలు వంటి ఇతర వసతులు ఉంటాయి. * శాసనసభకు సమీపంలోనే సచివాలయం వస్తుంది. ఇవి రెండూ కలిపి మొత్తం 250 ఎకరాల ప్రాంగణంలో ఉంటాయి. నాలుగంతస్తులుగా హైకోర్టు..! * హైకోర్టు భవనాన్ని నాలుగు అంతస్తులుగా డిజైన్‌ చేశారు. * గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిజిస్ట్రార్‌ల కార్యాలయాలు, పరిపాలన విభాగాలు ఉంటాయి. * మొదటి అంతస్తులో లైబ్రరీ, సమావేశ మందిరాలు, కక్షిదారులకు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. * రెండు, మూడు అంతస్తుల్లో జడ్జిల ఛాంబర్లు, కోర్టులు ఉంటాయి. రెండో అంతస్తులో 16 మంది జడ్జిలకు ఛాంబర్లు, కోర్టులు, మూడో అంతస్తులో 20 మందికి ఛాంబర్లు, కోర్టులు ఉంటాయి. * నాలుగో అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్‌, కోర్టు, జడ్జిల సమావేశమందిరాలు ఉంటాయి. * హైకోర్టు, సిబ్బంది నివాస గృహాలు, ఇతర కోర్టులు కలిపి 250 ఎకరాల్లో వస్తాయి. * హైకోర్టు భవన నిర్మిత ప్రాంతం సుమారు 6 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు, సీఆర్‌డీఏ అధికారులు గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో సమావేశమవుతారు. హైకోర్టు భవన ఆకృతుల గురించి వారికి వివరించి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. దాని ఆధారంగా హైకోర్టు భవన తుది వివరణాత్మక ఆకృతులు సిద్ధం చేస్తారు. అమరావతికి ప్రధాన ఆకర్షణగా సిటీ స్క్వేర్‌..! మొత్తం 1365 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక కూడా దాదాపు ఖరారైంది. బుధవారం దానిపై కొంత చర్చ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన తర్వాత శుక్రవారం మరోసారి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. శాసనసభ, హైకోర్టు ఆకృతులు, పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళికపై అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. అవి...! * పరిపాలన నగరానికి కొన భాగాన, కృష్ణా నదికి అభిముఖంగా నిర్మించనున్న ‘సిటీ స్క్వేర్‌’ అమరావతి నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉండేలా ఆకృతులు రూపొందించాలి. * ముఖ్యమంత్రి, గవర్నర్‌ అధికార నివాస భవనాలను సిటీస్క్వేర్‌లో భాగంగా చెరో పక్క ఉండేలా డిజైన్‌ చేసింది. వాటిని అక్కడి నుంచి మార్చాలి. * సిటీ స్క్వేర్‌ విశాలంగా ఉండాలి. ముఖ్యమంత్రి, గవర్నర్‌ నివాస భవనాలను నదీ తీరానికి మార్చాలి. * సిటీ స్క్వేర్‌ ఆర్థిక కార్యకలాపాలకు ఆలంబనగా, అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా నిలవాలి. దానిలో రెస్టారెంట్లు, హోటళ్లు, కెఫెటేరియాలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు, క్రీడా, వినోద కేంద్రాలు, కన్వెన్షన్‌ సెంటర్లు కొలువుతీరాలి. * రాబోయే రోజుల్లో పెరగనున్న శాసనసభ స్థానాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శాసనసభ భవన ఆకృతులు రూపొందించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. సెప్టెంబరు 1కి పూర్తి స్థాయి డిజైన్లు..! ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఆకృతులపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత శాసనసభ, హైకోర్టు భవనాల వివరణాత్మక ఆకృతులు, స్ట్రక్చరల్‌ డిజైన్లు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అందజేస్తుంది. సెప్టెంబరు 15 నాటికి పూర్తి స్థాయి డిజైన్లు ఇస్తామని చెప్పిందని, సెప్టెంబరు 1కే ఇవ్వాల్సిందిగా కోరామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. * సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతుల్ని కూడా ఈ సంస్థే రూపొందిస్తోంది. ఆ భవనాలు ఎలా ఉండాలి? ప్రభుత్వ అవసరాలేంటి? వంటి వివరాలన్నీ తెలుసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులు గురువారం, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అధికారులతో సమావేశమవుతున్నారు.
  4. అసెంబ్లీకి వజ్ర కాంతి శాసనసభకు కోహినూర్‌ రూపం 6 అంతస్థుల్లో అసెంబ్లీ సముదాయం బౌద్ధ స్థూపంలా హైకోర్టు భవంతి 4 అంతస్థుల భవనంగా నిర్మాణం లండన్‌, హాంకాంగ్‌లా ‘జస్టిస్‌ సిటీ’ ఐకానిక్‌ భవనాల డిజైన్లు ఖరారు నమూనాలు చూపిన నార్మన్‌ ఫోస్టర్‌ మార్పు చేర్పులు సూచించిన సీఎం నేడు చీఫ్‌ జస్టిస్ కు హైకోర్టు డిజైన్లు సెప్టెంబరు 1కి పూర్తిస్థాయి ప్లాన్‌ ఆ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘కోహినూర్‌’ వజ్రంలాంటి శాసనసభ, మండలి! నీతికి, న్యాయానికి ఘనమైన చిహ్నంలా నిలిచే హైకోర్టు భవంతి! అమరావతిలో కొలువు తీరనున్న రెండు ఐకానిక్‌ భవనాల డిజైన్లు ఖరారయ్యాయి. శాసన సభ, శాసన మండలి కొలువు తీరనున్న శాసన పరిషత్‌ సముదాయాన్ని కోహినూర్‌ వజ్రం ఆకారంలో నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని బౌద్ధ స్థూపాన్ని గుర్తు చేసే ఆకారంలో నిర్మిస్తారు. వాస్తవానికి అసెంబ్లీని స్థూపాకారంలో నిర్మించాలని తొలుత భావించారు. కానీ... పలు తర్జనభర్జనల అనంతరం, ముఖ్యమంత్రి సూచనల మేరకు దీనికి వజ్రం ఆకారం డిజైన్‌ను ఖరారు చేశారు. మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన ఈ డిజైన్లను బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ‘‘కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో లభించి, నిజాం ప్రభువుల ద్వారా బ్రిటన్‌కు చేరిన కోహినూర్‌ ఆకారంలో శాసనసభ ఉంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలు అమూల్యమైన కోహినూర్‌ వజ్రాన్ని కోల్పోయారు. ఇప్పుడు దానిని అసెంబ్లీ భవన రూపంలో చూసుకుని సంతోషిస్తారు. ఇక... స్థూపం సంతోషానికి చిహ్నం. న్యాయం జరిగినప్పుడే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. హైకోర్టు గడప తొక్కిన ప్రతి వ్యక్తి ఆ భవనాన్ని చూసి, తమకు తప్పక న్యాయం జరుగుతుందని భావించాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. తదనుగుణంగానే అసెంబ్లీని కోహినూర్‌ డైమండ్‌లా, హైకోర్టును స్థూపాకృతిలో నిర్మించాలని నిర్ణయించారు. ‘‘ప్రజల్లో అమరావతిపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వాటిని అందుకునేలా నిర్మాణాలు ఉండాలి. ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిలవాలి’’ అని స్పష్టం చేశారు. నవ నగరాల్లో భాగంగా నిర్మించనున్న న్యాయ నగరం (జస్టిస్‌ సిటీ) భవిష్యత్తులో లండన్‌, హాంకాంగ్‌ నగరాల్లా భాసిల్లాలన్నది తన అభిలాష అని సీఎం చెప్పారు. నల్సార్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లా ఏజెన్సీలను ఇక్కడికి ఆహ్వానిస్తామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన న్యాయవిద్య, న్యాయ సలహాలు అమరావతిలో లభ్యమవుతాయన్న భావన నెలకొనేలా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఇటీవల తాము నయా రాయపూర్‌, గాంధీనగర్‌, చండీగఢ్‌లలో పర్యటించి, తెలుసుకున్న విశేషాలను సీఎంకు వివరించారు. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు... భవిష్యత్తులో రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరగనున్నందున తదనుగుణంగా అసెంబ్లీ భవనాన్ని, అందులోని వసతులను రూపొందించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆ మేరకు అసెంబ్లీ భవనంలో వసతులకు సంబంధించి మార్పు చేర్పులు చేస్తారు. ఇక... హైకోర్టు భవనం డిజైన్‌ను గురువారం నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు, సీఆర్డీయే ఉన్నతాధికారులు గురువారం హైదరాబాద్‌లో ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు చూపిస్తారు. వారి సూచనల మేరకు అవసరమైన మార్పులు చేస్తారు. శుక్రవారం మరొకసారి సీఎం సమక్షంలో జరగనున్న సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. డిజైన్లు ఖరారైన నేపథ్యంలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఐకానిక్‌ భవనాల స్ట్రక్చరల్‌, అంతర్గత డిజైన్లను సెప్టెంబరు 1వ తేదీకల్లా సిద్ధం చేయాలని నార్మన్‌ ఫోస్టర్‌కు సూచించారు. అవి సిద్ధమైన వెంటనే తదుపరి చర్యలు తీసుకుని, నిర్మాణ పనులను ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, కమిషనర్‌ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. నిర్మాణాలు ఇలా శాసన సభ, మండలి, సంబంధిత కార్యాలయాలు 4.50 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇది ఆరు అంతస్థుల భవనం. ఇక... హైకోర్టు నాలుగు అంతస్థుల్లో, 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతుంది. అసెంబ్లీ, సచివాలయానికి కలిపి 250 ఎకరాలు కేటాయించారు. హైకోర్టు, దానికి అనుబంధ విభాగాలు, ఇతర కోర్టులన్నీ 250 ఎకరాల్లో ఉంటాయి. వాహనాల కోసం బహుళ అంతస్థుల బహుళ అంతస్థుల పార్కింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తారు. అసెంబ్లీ ఇలా... ‘బ్లూ - గ్రీన్‌’ కాన్సె్‌ప్టలో భాగంగా అసెంబ్లీ చుట్టూ చక్కటి నీటి వనరులను అభివృద్ధి చేయనున్నారు. అసెంబ్లీ భవనానికి అటూ ఇటూ సచివాలయం, ప్రముఖుల నివాసాలు ఉంటాయి. ఈ భవంతికి నలుదిక్కులా ప్రవేశద్వారాలు ఏర్పాటు చేస్తారు. 4 బ్లాక్‌లుగా ఉండే ఈ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కొక్క బ్లాక్‌లో శాసనసభ, శాసనమండలి, పరిపాలనా చాంబర్లు, పీపుల్స్‌ ప్లేస్‌ (ఇందులో భాగంగా యాంఫీ థియేటర్‌, మధ్యలో వలయాకారంలో పబ్లిక్‌ ఫోరంగా పేర్కొనే ర్యాంప్‌ మార్గాలు) ఉంటాయి. 1, 2 అంతస్థుల్లో స్పీకర్‌, మండలి ఛైర్మన్‌, సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రుల చాంబర్లు ఉంటాయి. 3వ ఫ్లోర్‌లో గ్రంథాలయం, సమావేశ మందిరం ఉంటాయి. 4, 5, 6 అంతస్థుల్లో పరిపాలనా కార్యాలయాలు ఉంటాయి. హైకోర్టు ఇలా నాలుగు అంతస్థుల హైకోర్టు భవంతిలో... గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు దరఖాస్తులను స్వీకరించే విభాగాలుంటాయి. 1వ అంతస్థులో గ్రంథాలయం, సమావేశ మందిరాలు, పబ్లిక్‌ ఫెసిలిటీస్‌ ఏర్పాటు చేస్తారు. 2వ అంతస్థులో 16 కోర్టులు, వాటి జడ్జిల చాంబర్లు ఉంటాయి. 3వ ఫ్లోర్‌లో 20 న్యాయస్థానాలు, వాటి న్యాయమూర్తులకు చాంబర్లు, వెయిటింగ్‌ హాలును ఏర్పాటు చేస్తారు. 4వ అంతస్థులో ప్రధాన న్యాయమూర్తి ఆసీనులయ్యే న్యాయస్థానం, ఆయన చాంబర్‌, న్యాయమూర్తుల సమావేశ మందిరాలు ఉంటాయి. సువిశాలంగా ‘సిటీ స్క్వేర్‌’ పరిపాలనా నగరానికి ఉత్తర దిక్కున, కృష్ణా నదికి అభిముఖంగా నిర్మించనున్న సిటీ స్క్వేర్‌ రాజధానికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలకు ఆలంబనగా, అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా ఈ స్క్వేర్‌ నిలవాలని... అది సాధ్యమైనంత విశాలంగా ఉండాలని చెప్పారు. రాజ్‌భవన్‌, సీఎం అధికార నివాసాలను స్క్వేర్‌ నుంచి నదీ తీరానికి మార్చాలన్నారు. ఇంద్రుడు కూడా అసూయపడేలా అమరావతి (ఫోటోలు.. క్లిక్ చేయండి)
×
×
  • Create New...