Jump to content

sonykongara

Members
  • Posts

    66,792
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. మంత్రి లోకేష్‌తో కార్బన్ మొబైల్స్ చైర్మన్‌ భేటీ అమరావతి: లోకేష్‌తో కార్బన్ మొబైల్స్ చైర్మన్‌ సుధీర్ భేటీ అయ్యారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో కార్బన్ మొబైల్స్ ఫ్యాక్టరీని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని తెలిపారు. విడిభాగాల దిగుమతుల కస్టమ్స్‌ అనుమతులకు చెన్నై వెళ్లాల్సివస్తోందన్నారు. తిరుపతిలో కస్టమ్స్‌ అనుమతులు ఇస్తే మరికొన్ని కంపెనీలు వస్తాయని లోకేష్‌కు సుధీర్ వివరించారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో కార్గో సర్వీస్, ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వంతో చర్చిస్తామని సుధీర్‌కు మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.
  2. ma nana annadu 60 lono 70 lo macherla ST anta, max macherla,vinukonda okati ST avuthundi, rendi lo atu itu ayina vinukonda lo ni bollapalli lekunda st cheyytam kastam.
  3. మరోసారి ఉదారత చాటుకున్న చంద్రబాబు 07-07-2017 19:10:13 అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి చంద్రబాబు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు రోగులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తేజస్వినికి రూ.3 లక్షలు ఇవ్వనున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు సుదీప్తికి వైద్యం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని తెలిపారు. కేర్సినోమా పెనిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఏలూరు వాసి గురిజాల నాగేశ్వరరావు చికిత్స కోసం రూ.2.5 లక్షలు అందజేస్తామన్నారు. విజయవాడ రాజేశ్వరీదేవిపేట అగ్నిప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన కె.దుర్గారావుకు క్రీడల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భర్తను కోల్పోయిన వత్సవాయి మండలం పోచవరం గ్రామస్తురాలు కె. జయ కుటుంబం దయనీయస్థితిని చూసి చంద్రబాబు చలించిపోయారు. ఆ కుటుంబానికి చంద్రబాబు రూ. 4 లక్షలు సహాయాన్ని ప్రకటించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శ్రీమతి సయ్యద్ నూర్జహాన్‌కు వైద్య చికిత్స కోసం సీఎం రూ. 3.5 లక్షల సహాయాన్ని ప్రకటించారు.నందిగామకు చెందిన బత్తుల విజయలక్ష్మికి కుడికాలి ఆపరేషన్ తర్వాత వచ్చిన సమస్యల చికిత్సకు రూ 58 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామానికి చెందిన వలేటి దీపిక ఇంజనీరింగ్ చదువు కోసం రూ లక్ష సహాయం అందజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
  4. రోడ్ల నాణ్యతలో రాజీ వద్దు నిర్దిష్ట గడువులోగా నిర్మించండి కాంట్రాక్ట్‌ సంస్థలు, అధికారులకు లక్ష్మీ పార్థసారథి ఆదేశం ఆంధ్రజ్యోతి, అమరావతి: అమరావతిలో చురుగ్గా నిర్మితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌, 7 ప్రాధాన్యతా రహదారులను ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వాటి పనులను చేపట్టిన కాంట్రాక్ట్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రోడ్లను నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి వెంబడి 15 మీటర్ల వెడల్పున అభివృద్ధి పరచనున్న పచ్చదనం (గ్రీన్‌ బెల్ట్‌)లో ఎక్కువ మొక్కలు నాటేందుకు అనువుగా మట్టికట్టను పటిష్టంగా నిర్మింపజేయాలని సూచించారు. వర్షపు నీరు మొక్కలన్నింటికీ సక్రమంగా అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారిలో భాగంగా నిర్మించాల్సిన కల్వర్టుల పనులను వేగవంతం చేయాలని నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. కృష్ణాయపాలెం- అనంతవరం మధ్య నిర్మిస్తున్న ఈ-8 రహదారిని పరిశీలించిన ఆమె అందులోని లోబ్రిడ్జిలను అను కున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. అబ్బరాజుపాలెం- శాఖమూరుల మధ్య నిర్మాణంలో ఉన్న ఎన్‌-14 రోడ్డును పరిశీలించి, దాని కోసం గుత్తేదారు బీఎస్‌సీపీఎల్‌ ఏర్పాటు చేసిన ప్రీకాస్ట్‌ నిర్మాణ యూనిట్‌ను సందర్శించారు.రాజధాని రోడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, కాంట్రాక్ట్‌ సంస్థలకు తగు సలహాలివ్వడం ద్వారా అవి గడువుల్లోగా పూర్తయ్యేలా చూడాలని అధికా రులను ఆదేశించారు. ఏడీసీ అటవీ- పర్యావరణ విభాగాధిపతి బి.మురళీకృష్ణ, ఈఈ నరసి ంహమూర్తి, డీఈఈలు సుధాకర్‌, వై.కృష్ణయ్య, పద్మాకర్‌ ప్రసాద్‌, అటవీ విభాగాధికారులు వై.రమేష్‌, ఎం.ఓబుల్‌రెడ్డి, జె.సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
  5. గోపీ అకాడమీకి 12.5 ఎకరాలు? వెంకటపాలెం వద్ద కేటాయింపునకు సూత్రప్రాయ నిర్ణయం? (ఆంధ్రజ్యోతి, అమరావతి): బ్యాడ్మింటన్‌లో పలువురు షట్లర్లను తీర్చిదిద్దిన గురు పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ అమరావతిలో కొద్ది నెలల్లోనే ప్రారంభమయ్యే దిశగా ముందడుగు పడింది. రాజధాని గ్రామాల్లో ఒకటైన వెంకటపాలెం పరిధిలో గోపీచంద్‌ అకాడమీకి 12.5 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు ఏపీసీఆర్డీయే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గోపీచంద్‌ గురువారం విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రభృత ఉన్నతాధికారులతో జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని గోపీచంద్‌ బుధవారం కలిసినప్పుడే ఈ అకాడమీకి స్థల కేటాయింపుపై స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ, గురువారం నాటి చర్చలతో స్థల విస్తీర్ణం, ఏ గ్రామంలో దీనిని నెలకొల్పాలనే అంశాలపై స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. వాస్తవానికి గోపీచంద్‌ అమరావతిలో తమ అకాడమీ స్థాపన కోసం ఇంతకంటే ఎక్కువ భూమినే కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే స్థల లభ్యత, పలు సంస్థలు భూమి కోసం చేసుకుంటున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని దానికి 12.50 ఎకరాలను మాత్రమే ఇస్తామని ప్రతిపాదించగా గోపీచంద్‌ అంగీకరించారని తెలిసింది. స్థల విస్తీర్ణంపై స్పష్టత వచ్చినందున అకాడమీ నిర్వాహకులు అందులో తాము నెలకొల్పబోయే శిక్షణ సంస్థకు సంబంధించిన వివరాలతో డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)ను సీఆర్డీయేకు సమర్పించాల్సి ఉంటుంది.
  6. తుళ్లూరులో న్యాక్‌ కేంద్రం ఏర్పాటు సీఆర్‌డీఏ వెల్లడి ఈనాడు అమరావతి: రాజధాని పరిధిలోని తుళ్లూరు గ్రామంలో ఎకరం విస్తీర్ణంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ (న్యాక్‌) అమరావతి విభాగం త్వరలో ఏర్పాటు కానుంది. రాజధానిలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జరిగే నిర్మాణాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా... వారికి నిర్మాణరంగంలో అవసరమైన శిక్షణనిచ్చేందుకు న్యాక్‌ విభాగాన్ని రాజధానిలో ఏర్పాటు చేయనున్నారు. ‘జీవనభారం’ శీర్షికతో రాజధాని రైతులు, యువత, వ్యవసాయ కూలీల ప్రస్తుత స్థితిగతులకు సంబంధించి గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. ఇంత వరకు రాజధాని గ్రామాలకు చెందిన 736 మంది యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చామని, తాము నిర్వహించిన జాబ్‌ మేళాలో,్ల ఇతరత్రా 1440 మందికి ఉద్యోగాలొచ్చాయని తెలిపింది. ఎన్టీఆర్‌ క్యాంటిన్‌ ప్రాజెక్టులో 89 మందికి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రాజెక్టులో 40 మందికి, సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 140 మందికి సీఆర్‌డీఏ ద్వారా ఉద్యోగాలు లభించినట్టు తెలిపింది. 1500 మంది మహిళలకు కుట్టు, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఉద్యానవనాల నిర్వహణలో శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. రైతులు రాజధానిలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకుని పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ‘రైతులే ముందు’ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. వారి కోసం ఇప్పటికే ‘మన అమరావతి’ పేరుతో ప్రత్యేక యాప్‌ రూపొందించినట్టు తెలిపింది.
  7. రూ.600 కోట్లతో సింధువీర్‌ పునర్‌నిర్మాణం హిందుస్థాన్‌ షిప్‌ యార్డుకు పనులు విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సింధువీర్‌ జలాంతర్గామి పునర్‌నిర్మాణ (రీఫిట్‌) పనులు విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌ యార్డుకు దక్కాయి. రూ.600 కోట్ల విలువైన ఈ పనులను 27 నెలల్లో పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నాళ్లుగా భారీ ఆర్డర్లకు దూరమైన ఈ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టు దక్కడంపై యాజమాన్యం, కార్మికవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ‘సింధుకీర్తి’ రీఫిట్‌ పనులను కూడా ఇక్కడే నిర్వహించారు. ప్రస్తుతం షిప్‌యార్డులో నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ మగర్‌, ఐఎన్‌ఎస్‌ కేసరి యుద్ధ నౌకల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ రెండింటి విలువ దాదాపుగా రూ.200 కోట్లు. ప్రధానమంత్రి కార్యాలయం కనుసన్నల్లో 11184 వెసల్‌ నిర్మాణం తుది దశకు చేరుకుంది. 1988 నుంచి సింధువీర్‌ సేవలు..: ఐఎన్‌ఎస్‌ సింధుఘోష్‌ శ్రేణికి చెందిన సింధువీర్‌ జలాంతర్గామిని రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. 1988 ఆగస్టు 26న భారత నౌకాదళంలోకి చేరిన ఈ జలాంతర్గామి పొడవు 72.6 మీటర్లు, ఉపరితలంలో బరువు 2,325 టన్నులు. గంటకు 10 నాటికల్‌ మైళ్ల (18.52 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది.
×
×
  • Create New...