Jump to content

sonykongara

Members
  • Posts

    66,788
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. విజయవాడ: 2019లో రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. విజయవాడలో ఏడు ఐటీ కంపెనీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సంస్థల ద్వారా 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. తాను మంత్రి పదవి చేపట్టిన 90 రోజుల్లోనే 3వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.కంపెనీలు ప్రారంభించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. చిన్న సంస్థలను ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలుగా మారతాయన్నారు. ప్రపంచంలో ఏ కంపెనీలో చూసినా అధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతే ఉంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐటీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ తరహాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ ఒకేచోట ఉండేలా విధంగా విజయవాడ, విశాఖలో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా పాలసీలు రూపొందించామని... డెవలపర్స్‌కు 50శాతం అద్దె ప్రభుత్వమే చెల్లిస్తోందని వెల్లడించారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి పెద్ద ఐటీ కంపెనీలు రానున్నాయని లోకేశ్‌ తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరుకల్లా అమరావతి నుంచి హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని లోకేశ్‌ తెలిపారు.
  2. టీడీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసిన రైతులు 09-07-2017 12:29:02 భీమడోలు/ప.గో.: మెట్టప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. రెండురోజుల క్రితం పోలవరం కుడికాలువ నీటిని పోలసానిపల్లికి విడుదలచేసిన ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇదేకాలువ నుంచి 820 కిలోమీటర్ల ప్రాంతం నుంచి భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లోని 1000 ఎకరాల సాగుకు నీటి సరఫరాకు తెరతీశారు. కుడికాలువలో ఏర్పాటు చేసిన పైపుల ప్రాంతంలో గోదావరికి పసుపు, కుంకుమలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్‌లో గోపాలపురం, ఉంగుటూరు నియోజకవర్గాల ప్రాంతాలను తాకుతూ వెళ్ళిన పోలవరం కుడికాలువ నుంచి పంగిడిగూడెం, ఉంగుటూరు మండలాల్లోని గ్రామాలకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత రైతులు ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ ఆయనకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
  3. naku anthe le pakkana krishna chukka niru radu
  4. డెల్టాకు పట్టిసీమ నుంచి 10.4 టీఎంసీలు 09-07-2017 01:26:28 అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో కృష్ణా డెల్టాకు మాత్రం ఏ కొరతా లేకుండా నీటి ప్రవాహం కొనసాగుతోంది. గతనెల 29 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరుతున్నాయి. 24 మోటర్ల ద్వారా నేటి వరకూ 10.4 టీఎంసీలు గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఫలితంగా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
  5. విశాఖ విప్రో క్యాంపస్‌ విస్తరణ! మంత్రి లోకేశ్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ లోకేశ్‌ను కలిసిన గోవా ఐటీ మంత్రి అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని విప్రో క్యాంప్‌సను విస్తరిస్తామని, త్వరలోనే రెండో దశ పనులు ప్రారంభిస్తామని విప్రో ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఐటీ మంత్రి లోకేశ్‌తో వారు భేటీ అయ్యారు. విశాఖ క్యాంప్‌సలో ప్రస్తుతం 1500 మందికి ఉపాధి కల్పించామని, త్వరలో రెండో దశ పనులు ప్రారంభించి మరో 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా ఉంచే బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని అన్ని శాఖల్లోనూ వినియోగించుకొనేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కోర్‌ డ్యాష్‌ బోర్డుతోనే ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేసే విధంగా సహకరిస్తామని తెలిపారు. ఐటీ సంస్థలకు తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని అయితే, స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పించాలని లోకేశ్‌ విప్రో ప్రతినిధులను కోరారు. లోకేశ్‌తో కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ భేటీ కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ సుధీర్‌ హసీజా కూడా లోకేశ్‌తో భేటీ అయ్యారు. తిరుపతిలోని ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌లో తమ ఫ్యాక్టరీ నిర్మాణం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో జరుగుతోందని సుధీర్‌ వివరించారు. విడిభాగాల దిగుమతుల కోసం చెన్నైలో కస్టమ్స్‌ అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని, తిరుపతిలోనే కస్టమ్స్‌ అనుమతులు ఇస్తే మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. కాగా, గోవా ఐటీ మంత్రి రోహన్‌ కూడా లోకేశ్‌ను కలిశారు ఐటీ రంగంలో సహకరించాలని కోరారు. ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఏజెన్సీ అధికారులతోనూ లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ- ప్రగతి ప్రాజెక్టు అభివృద్ధిపైనా సమీక్షించారు.
×
×
  • Create New...