Jump to content

sonykongara

Members
  • Posts

    66,787
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. ఈఏపీ కింద సాధిస్తే రూ.13 వేల కోట్లు లాభం విదేశీ రుణ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద ఎక్కువ సాయం కేంద్రం నుంచి సాధించగలిగితే ఐదేళ్లలో రూ. 13 వేల కోట్ల మేర లాభం కలుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా ఎంపీలకు చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ఈ సమావేశంలో కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పఽథకాలను మనం తీసుకొంటే నలభై శాతం రాష్ట్రం భరించాలి. విదేశీ ప్రాజెక్టుల కింద అయితే కేవలం పది శాతం భరిస్తే సరిపోతుంది. మొత్తం అవే తెచ్చుకోగలిగితే ఏడాదికి రూ.2600 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లలో ఈ తేడా రూ.13 వేల కోట్లు ఉంటుంది’ అని తెలిపారు. ప్రతి శాఖకు ఎంపీలు వ్యక్తిగతంగా వెళ్లి విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆమోదింపచేయాలని, వాటంతటవే అవుతాయని ఊరుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరంలో భూ సేకరణ, పునరావాస కల్పనకు రూ.32 వేల కోట్లు అవసరమని, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 16 వేల కోట్లు కావాలని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రాజధాని పేరిట విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ ఇతరాలకు ఈ మూడేళ్లలో ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ. వెయ్యి కోట్లు రావలసి ఉందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కూడా ఇంకా రూ. వెయ్యి కోట్లు రావాలని చెప్పారు. కేంద్రం నుంచి రావల్సినంతగా సాయం రావడం లేదని, ఈ దిశగా ఎంపీలు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. విశాఖ రైల్వే జోన్‌ ప్రజల్లో భావోద్వేగ అంశంగా ఉందని, దాని సాధనకు గట్టి ప్రయత్నం చేయాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కోరారు. తమ ప్రాంతానికి సాగునీటి వసతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీరు పోకుండా జాగ్రత్తగా పోలింగ్‌ చేయించాలని, ఎంపీలందరూ ఒక రోజు ముందే ఢిల్లీ చేరాలని చంద్రబాబు ఆదేశించారు
  2. వచ్చే రెండు నెలల్లో మరో 10-15వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తాను ప్రకటించానని, దాన్ని సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఉద్యోగాల గురించి తాను వూరకే మాటలు చెప్పడం లేదని.. రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలు, అవి కల్పించిన ఉద్యోగాల వివరాలను కంపెనీలు అంగీకరిస్తే ఉద్యోగుల పేర్లు సహా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. తిరుపతిలోనే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు. సెప్టెంబరుకల్లా తిరుపతి వద్ద కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ ప్రారంభం కానుందని వివరించారు. సెటాప్‌ బాక్సుల తయారీలో డిక్సన్‌ సంస్థ కూడా అక్టోబరులో తిరుపతి కేంద్రంగా తయారీ ప్రారంభించనుందని తెలిపారు. విశాఖలో డ్రోన్ల తయారీ కేంద్రం రానుందని తెలిపారు. విపక్షాలకు ఐటీ గురించి తెలియదని, తెలిసిందల్లా పెళ్లి చెడగొట్టడమేనని లోకేష్‌ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌ వేమూరి, సీఈఓ కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన ఐటీ కంపెనీల్లో కొలువులు సాధించిన 20 మందికి మంత్రి లోకేష్‌ నియామక పత్రాలు అందజేశారు. అమరావతిలో హెచ్‌సీఎల్‌ భవనం నవంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
  3. లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం అధికారులకు చంద్రబాబు ఆదేశం అమరావతి: తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువుల్ని కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20లక్షల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఆమెకు అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు వెలగపూడిలోని సచివాలయానికి లక్ష్మీప్రసన్నను జేసీ సోదరులు మంగళవారం తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో మాట్లాడిన చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదివానని చెప్పిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రూప్‌-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు. చలించిన చంద్రబాబు
  4. ఏపీకి ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరులో మరో ముందడుగు న్యూఢిల్లీ: అమరావతిలో 7 రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరులో మరో ముందడుగు పడింది. రూ. 962 కోట్ల పనులకు ప్రపంచ బ్యాంక్ ప్రణాళిక విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 12 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ఉద్దండరాయపాలెం, నిడమానూరు, కృష్ణాయపాలెం, నెక్కళ్లు, వెంకటాయపాలెం, నవులూరు, బోరుపాలెం, శాఖమూరు, పెనుమాక, ఐనవోలు, మంగళగిరి, నీరుకొండ, అప్పరాజుపాలెం రహదారుల పనులకు ప్రణాళిక విడుదల చేసింది. రైతుల అభ్యంతరాల పరిశీలనకు తనిఖీ బృందం ఏర్పాటుపై ప్రపంచబ్యాంక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
  5. నేడు విజయవాడకు నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు విజయవాడ: నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు మంగళవారం విజయవాడకు రానున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో వారు భేటీ కానున్నారు. అనంతరం అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై చర్చలు జరపనున్నారు. అలాగే బుధవారం ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. సీఎంతో భేటీ అనంతరం అసెంబ్లీ భవనం డిజైన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే.. ఉమ్మడి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ఇతర న్యాయమూర్తులకు ఈనెల 13న హైకోర్టు భవనాల డిజైన్లను నార్మన్‌ పోస్టర్‌ ప్రతినిధులు వివరించనున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ డిజైన్ల ఖరారు అనంతరం టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  6. 6 నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి: చంద్రబాబు 10-07-2017 18:23:12 అమరావతి: వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తోందని ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ఆరు నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పునర్విభజన బిల్లుపై హోంశాఖలో కదలిక ఉందని కేంద్రమంత్రులు ధృవీకరించారు.
  7. రేపు అమరావతిలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధుల పర్యటన అమరావతి: రేపు విజయవాడకు నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు వస్తారని మంత్రి నారాయణ అన్నారు. మూడు రోజులపాటు రాజధానిలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు పర్యటిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. చైనా, మలేషియా పర్యటనలో ఎలక్ట్రికల్‌ బస్సుల పనితీరును పరిశీలించామని నారాయణ వెల్లడించారు. సీఎం నిర్ణయం తర్వాత విజయవాడ మెట్రోపై ముందుకువెళ్తామని నారాయణ స్పష్టం చేశారు.
  8. bro, mi dt ki vacchayi anta evari chetha ayiana gattiga cheppichandi
  9. విశ్వవిఖ్యాత నగరంగా అమరావతి ఎన్ని సవాళ్లయినా ఎదుర్కొంటాం... రాజధానిని ప్రజలకు అంకితం చేస్తాం: సీఎం చంద్రబాబు ప్రణాళిక సంస్థకు బ్లూ ప్రింట్‌ సిద్ధం అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అద్భుతమైన అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ఓ ప్రణాళిక సంస్థను ఏర్పాటు చేసేందుకు సీఆర్‌డీఏ బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసింది. ప్రతిపాదిత అమరావతి ప్లానింగ్‌, డిజైన్‌ పరిశోధన సంస్థ (ఏపీడీఆర్‌ఐ)... ఓపెన్‌ డేటా విధానం ద్వారా అనునిత్యం ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ ప్రజా జీవనానికి అనుగుణమైన అద్భుత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక. ప్రపంచంలో వివిధ నగరాల వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషిస్తూ, వాటిని అధిగమించేలా ప్రణాళికలను తయారుచేసి అమరావతిని ప్రపంచంలోనే అత్యంత ప్రజామోద నగరంగా తీర్చిదిద్దాలనేది సీఎం ఆలోచన. ఆయన సూచనల ప్రతిరూపమే ఈ సంస్థ. అంతా సీఎం సూచనల మేరకే... అమరావతి నగర నిర్మాణం కోసం ప్రణాళికలను సిద్ధం చేసేందుకు ఇతరులపై ఆధారపడకుండా, అధునాతన ప్రమాణాలతో కూడిన సొంత ప్రణాళిక రచన సంస్థ ఉంటే బాగుంటుందని, ఆ దిశగా ఆలోచించమని సీఆర్‌డీఏ అధికారులకు సీఎం సూచించారు. ఆ సూచనలకనుగుణంగా సీఆర్‌డీఏ అధికారులు, ఏపీడీఆర్‌ఐని స్థాపించేందుకు బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేశారు. ‘అమరావతిని విశ్వవిఖ్యాత నగరంగా నిర్మించే క్రమంలో ఎన్ని సవాళ్లనయినా ఎదుర్కొంటాం. ఎన్ని ఇక్కట్లనయినా భరిస్తాం. అంతిమంగా అమరావతిని ఐదుకోట్ల తెలుగువారికి అంకితం చేస్తాం. ప్రజారాజధాని నిర్మాణంలో ప్లానింగ్‌ డిజైన్‌ పరిశోధన సంస్థ ప్రధానమైంది.’ అని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రిన్సిపల్‌ సెకట్రరీ అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, అడిసినల్‌ కమిషనర్‌ రామ్మోహనరావు, సింగపూర్‌కు చెందిన ఫ్రాన్సిస్‌ చోంగ్‌తో చర్చల అనంతరం ఏపీడీఆర్‌ఐకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు. త్వరలో వీటి ముసాయిదాను మంత్రి నారాయణకు వివరించి, ఆ తరువాత సీఎం సూచనల మేరకు ముందుకు సాగుతారు. నిర్వర్తించే బాధ్యతలు ఇవే... ఏపీడీఆర్‌ఐ ముందుగా సామాజిక ఆర్థిక సర్వే, ప్రణాళికల ద్వారా సంతోష సూచికను పర్యవేక్షించేందుకు పాదచారుల భద్రత, సైకిల్‌ సర్క్యులేషన్‌, దివ్యాంగుల కోసం నగరీకరణ మార్గదర్శకాలను సూచిస్తుంది. ఎలక్ట్రిక్‌, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాహనాలను ఉపయోగించేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేయనుంది. ప్రజలకు అనువయిన వాతావరణం కల్పించేందుకు అంకుర సంస్థల సహకారాన్ని పొందేందుకు క్లిష్టతరమయిన ఓపెన్‌ డేటా విధానాన్ని లేదా తత్సమానమైన విధానాన్ని రూపొందించనుంది. అత్యుత్తమయిన విధానాలను సరళమయిన రీతిలో ఆచరణలో పెట్టడం, నగరీకరణ ప్రణాళికలను తయారుచేయడం వంటి బాధ్యతలను వహిస్తుంది. అమరావతి నిర్మాణానికి ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అంకితభావంతో పనిచేసే ప్రణాళిక సంస్థ ఏర్పాటైతే, విశ్వవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి అంశాలను అమరావతిలో అమలు చేసేందుకు వీలుంటుందన్నారు. ఏపీడీఆర్‌ఐ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరువాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో సీఆర్‌డీఏ సంప్రదింపులు జరిపింది. ఈ సంస్థ కేవలం అమరావతి నగరాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించడానికి దోహదపడటమే కాకుండా భవిష్యత్‌లో ఏర్పడనున్న నగరాలకు ఒక వెలుగుదివ్వెలా నిలిచి, అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుందని సీఆర్‌డీఏ భావిస్తోంది.
  10. ఏపీడీఆర్‌ఐ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు ఈనాడు, అమరావతి: అమరావతి ప్లానింగ్‌, డిజైన్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏపీడీఆర్‌ఐ)ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసినట్లు సీఆర్‌డీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా ఏపీడీఆర్‌ఐ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. అత్యుత్తమ విధానాలను సరళమైన రీతిలో ఆచరణలోపెట్టడం, నగరీకరణ ప్రణాళికలను తయారుచేయడం తదితర బాధ్యతలను ఏపీడీఆర్‌ఐ చేపట్టనుందని వివరించింది. ‘ఏపీడీఆర్‌ఐను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత..లండన్‌లోని ఫ్యూచర్‌ క్యాటపుల్ట్‌, మలేషియాలోని పెమండు, కజకిస్థాన్‌కు చెందిన ఆస్తాన జెన్‌ప్లాన్‌, సింగపూర్‌కు చెందిన సీఎల్‌సీ తదితర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరిపాం. దీని ఏర్పాటులో సింగపూర్‌ ప్రభుత్వానికి సంబంధించిన సీఎల్‌సీ సేవలనూ వినియోగించుకుంటాం. అమరావతి నగరాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు దోహదపడటంతోపాటు..భవిష్యత్తులో నిర్మించే నగరాలకు దీన్ని వెలుగుదివ్వెలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీడీఆర్‌ఐను నెలకొల్పుతున్నాం.’ అని సీఆర్‌డీఏ ఆ ప్రకటనలో వివరించింది.
×
×
  • Create New...