Jump to content

sonykongara

Members
  • Posts

    66,788
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. చంద్రబాబుతో జపాన్‌ మంత్రి భేటీ, కీలక అంశాలపై చర్చ అమరావతి: సీఎం చంద్రబాబుతో జపాన్‌ ఆర్థిక, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి)ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అమరావతి నిర్మాణానికి సహకారంపై సీఎంతో చర్చించారు. జపాన్ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో చంద్రబాబుతో 70 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరించారు.
  2. లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం 12-07-2017 01:38:23 సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువులను కోల్పోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటన బాధితురాలు లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధికారులను ఆదేశించారు. ఈ నెల 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20 లక్షల ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి... ఆమెకు అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు లక్ష్మీప్రసన్నను మంగళవారం జేసీ సోదరులు సచివాలయానికి తీసుకొచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో సీఎం మాట్లాడి విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదువుకున్నానని ఆమె చెప్పారు. దీంతో అధికారులతో మాట్లాడి గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని లక్ష్మీప్రసన్నకు చెప్పారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చినా ఎంత వరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని, బాగా చదువుకుని ఉన్నత పదవులు సంపాదించాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు. ఆరు నెలలకు ఒకసారి వచ్చి కలవాలని ఆమెకు చెప్పారు. తనకు ఉద్యోగం ఇచ్చి అన్నివిధాలుగా అండగా ఉన్న సీఎం చంద్రబాబుకు లక్ష్మీప్రసన్న పదే పదే కృతజ్ఞతలు తెలిపారు.
  3. అమరావతిలో 7 రోడ్లకు రూ.962 కోట్లు ఈనాడు, దిల్లీ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర పరిధిలో మొత్తం ఏడు రోడ్ల నిర్మాణానికి రూ.962 కోట్లు మంజూరుచేయడానికి ప్రపంచబ్యాంకు ప్రణాళికలు సిద్ధంచేసింది. వీటిని 2018 మార్చి కల్లా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఒక షెడ్యూల్‌ తయారుచేసింది. త్వరలో వీటికి సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం వీటికి రూ.962 కోట్లు ఖర్చవుతుందని అంచనాకు వచ్చింది. భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ ప్యాకేజీల్లో మార్పులుచేర్పులు చేయనుంది. అమరావతి సస్టెయినబుల్‌ కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద ఈ నిధులు మంజూరుచేయడానికి ప్రపంచబ్యాంకు అంగీకరించింది.
  4. అమరావతికి జపాన్‌ సహకారం నేడు సీఎం చంద్రబాబుతో చర్చలు 70 మంది ప్రతినిధుల బృందం రాక ఈనాడు అమరావతి: జపాన్‌ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి) మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో 70 మంది పారిశ్రామిక ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్రానికి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి జపాన్‌ సహకారం వంటి అంశాలపై ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఇరు పక్షాల మధ్య కొన్ని అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. జపాన్‌ నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు, పారిశ్రామిక వేత్తలకు మధ్య చర్చలు జరుగుతాయి. రాజధాని అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ వివరిస్తారు. అమరావతికి జపాన్‌ సహకారంపై ఈ సందర్భంగా ‘మేటి’కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరగనుంది. రాజధాని అమరావతికి ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) మాస్టర్‌ ప్లాన్‌, ఎలక్ట్రానిక్‌, స్పోర్ట్స్‌, సిటీ మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పన, రాజధాని ప్రాంతానికి డేటా సెంటర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాం, రాడార్‌ ద్వారా విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్‌ సహకారం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉంటాయి. సీఆర్‌డీఏ ప్రాంతానికి సమీకృత ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థపై అధ్యయనానికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఇప్పటికే అంగీకరించింది. దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్న అంశాన్నీ ఈ ఒప్పందంలో పొందుపర్చుతారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులకు జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ (జెబిక్‌), ఆంధ్రప్రదేశ్‌ మధ్య సహకారానికి సంబంధించిన అంశాలపైనా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్‌ మొదటి నుంచి సానుకూలంగానే ఉంది. మేటి, జెబిక్‌లతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి శంకుస్థాపన సందర్భంగా (2015 అక్టోబరు 22న) ఎంఓయూలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఆర్‌డీఏ అధికారులు 2016 డిసెంబరులో జపాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మేటి, సీఆర్‌డీఏ అధికారుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.920 కోట్లు ఇవ్వాల్సిందిగా జైకాకి సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. జపాన్‌ 2020లో ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధమవుతోంది. అదే పద్ధతిలో అమరావతిలోను క్రీడా సదుపాయాల కల్పనకు సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని స్మార్ట్‌ సిటీగా రూపొందించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాల కోసం సీఆర్‌డీఏ జపాన్‌ సహకారం కోరుతోంది.
  5. వజ్రం ఆకృతిలో హైకోర్టు భవనం నేడు పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక శాసనసభ భవన తుది ఆకృతి అందజేయనున్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని న్యాయ నగరంలో నిర్మించే హైకోర్టు భవన ఆకృతిని వజ్రంను పోలిన విధంగా లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించింది. అమరావతిలో పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక, శాసనసభ భవన తుది ఆకృతులను ఆ సంస్థ బుధవారం అందజేయనుంది. హైకోర్టు భవనానికి సంబంధించి ఇది వరకు రెండు ప్రాథమిక ఆకృతులు రూపొందించింది. అవి సంతృప్తికరంగా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో... ఇప్పుడు డైమండ్‌(వజ్రం)ను పోలిన విధంగా మరో ఆకృతిని సిద్ధం చేసింది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమవుతారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం, దానికి కొనసాగింపుగా 465 ఎకరాల్లో నిర్మించే న్యాయనగరం కలిపి మొత్తం... 1,365 ఎకరాలకు ఈ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తోంది. ప్రాథమిక ప్రణాళికకు ముఖ్యమంత్రి సూచనల మేరకు మార్పులు, చేర్పులతో తుది ప్రణాళిక సిద్ధం చేసింది. మకుటాయమాన భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్నీ ఈ సంస్థే రూపొందిస్తోంది. బౌద్ధ స్తూపాన్ని స్ఫూర్తిగా తీసుకుని... ఆ సంస్థ రూపొందించిన శాసనసభ భవన ఆకృతికి ఇది వరకే ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. దాని వివరణాత్మక తుది ఆకృతిని ఇప్పుడు అందజేయనుంది. శాసనసభ, శాసన మండలి భవనం లోపల... ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు ఎక్కడుండాలి? పరిపాలనా విభాగం ఎక్కడుండాలి? వంటి సమగ్ర వివరాలను తీసుకువచ్చింది. శాసనసభ భవనానికి ప్రహరీ లేకుండా చుట్టూ జలాశయం ఉండేలా... భవనం ప్రాంగణంలోకి వంతెనల మీదుగా ప్రవేశించేలా ఆ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇప్పుడు తీసుకువచ్చిన హైకోర్టు భవన ఆకృతితో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే... దాని వివరణాత్మక ఆకృతుల్ని రూపొందిస్తుంది. పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతుల రూపకల్పనకు కూడా మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థే ఎంపికైంది. ఆ భవనాలకు సంబంధించిన ప్రాథమిక ఆకృతుల్ని కూడా బుధవారం అందజేసే అవకాశం ఉన్నట్టు సీఆర్‌డీఏ వర్గాల సమాచారం. సంస్థ ప్రతినిధులు మంగళవారమే పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమై చర్చించారు.
  6. భవానీ ద్వీపంలో...ఫ్లాగ్‌ పార్క్‌.. 12-07-2017 09:06:39 150 ఎకరాల్లో డిజైన్లు సిద్ధం చేసిన ఎల్‌అండ్‌టీ భవానీ ఐలాండ్‌లో అద్భుతమైన మెగాపార్కు రూపుదిద్దుకోనుంది. ఫ్లాగ్‌పార్కు పేరుతో 150ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఇది దేశంలోనే ఒక ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిలువనుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించిన ఈ ఫ్లాగ్‌ పార్కు డిజైన్లు కళ్లుమిరుమిట్లుగొలిపేలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌ పార్కు, గడ్డి మైదానాలు, వనాలు, ఫుడ్‌కోర్టులు, వాక్‌వేలు, వీవీఐపీ విశ్రాంతి గదులు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ తదితరాలు ఉంటాయి. మరోవైపు కృష్ణా నదీ తీరాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. నది ఒడ్డునుంచి ఫ్లాగ్‌పార్కు వరకు ఒక సుందరమైన ప్రాంతంగా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే పర్యాటక ప్రాంతంగా ప్రణాళిక సిద్ధమవుతోంది.
  7. అమరావతికి రుణం ఖరారు రాజధాని రోడ్లకు ప్రపంచబ్యాంకు చేయూత రూ.963 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక ఈ నెలలోనే ఒప్పందం ఫలించని అడ్డుపుల్లలు న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని రోడ్లకు మహర్దశ పట్టనుంది. అమరావతి ప్రాంతంలో ఏడు రోడ్లు నిర్మించడానికి ప్రపంచబ్యాంకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ప్రణాళికలు, అంచనా వ్యయాన్ని విడుదల చేసింది. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొందరు లేవనెత్తిన ‘అభ్యంతరాలను’ తీసి పక్కన పెట్టింది. రాజధాని నిర్మాణంపై తమకు అభ్యంతరం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇవ్వకూడదని రైతుల పేరుమీద కొందరు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ‘‘అమరావతికి అడ్డుపుల్ల’’ శీర్షికతో జూన్‌ 27న ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. రైతుల అభ్యంతరాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం చైర్మన్‌.. బ్యాంకు చైర్మన్‌కు లేఖ రాశారు. ఆ లేఖకు చైర్మన్‌ సమాధానం ఇవ్వకముందే ప్రపంచబ్యాంకు తాజాగా అమరావతి రోడ్ల ప్రణాళికను విడుదల చేసింది. ఫలితంగా అభ్యంతరాలను పక్కనబెట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రానికి రుణం ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం తనిఖీలు, కమిటీ ఏర్పాటు చేస్తారని ప్రపంచబ్యాంకువర్గాలు పేర్కొంటున్నాయి. దశల వారీగా రుణం అమరావతి నగరాభివృద్ధి కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంయుక్తంగా రూ.4,606 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రపంచబ్యాంకు వాటా రూ.1,932 కోట్లు. ప్రతిపాదిత 10 రోడ్లలో ఏడు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. పనులు ప్రారంభమయ్యాక ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణాన్ని దశల వారీగా విడుదల చేస్తుంది. ఈ రోడ్ల పనులు జరుగుతున్న క్రమంలో రూ.962 కోట్లను విడుదల చేస్తూ.. మిగిలిన రూ.1000 కోట్లు తర్వాత విడుదల చేస్తుంది.
  8. విశాఖలో డ్రోన్ల తయారీ! రాష్ట్రవ్యాప్తంగా ఐటీ కంపెనీల విస్తరణ గన్నవరంలో 100 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌ ఐటీ శిక్షణ కేంద్రంగా మంగళగిరి 20న ఐటీ శిక్షణ కేంద్రాలకు శ్రీకారం: లోకేశ్‌ విజయవాడలో 7 ఐటీ కంపెనీలు ప్రారంభం అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా డ్రోన్ల తయారీ పరిశ్రమ రానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. విజయవాడలో సోమవారం ఏడు ఐటీ సంస్థలను ఆయన ప్రారంభించారు. ఆటోనగర్‌ కె-బిజినెస్‌ సెంటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ఎలెర్న్‌, సుప్రీం నెట్‌సాఫ్ట్‌, క్రెసోల్‌ ఇన్‌ఫోసెర్వ్‌, డీఆర్‌ కంప్యూటర్‌,్స ఇన్‌స్పైర్‌ల్యాబ్స్‌, ఎన్వీరా, స్టీమ్జ్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలు విజయవాడ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంస్థల్లో ప్రాథమికంగా 300 మందికి, ఆతర్వాత మరింత మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. విశాఖలో డ్రోన్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రఖ్యాత సంస్థ ముందుకు వచ్చిందని ప్రకటించారు. విశాఖలో త్వరలోనే మరిన్ని మేజర్‌ ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని తెలిపారు. దక్షిణాసియాలోనే అత్యంత పెద్దదైన బిగ్‌ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గన్నవరం వద్ద 100 ఎకరాల్లో ఐటీ క్లస్లర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం కాపులుప్పాడ వద్ద రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రాన్ని, ఫిన్‌టెక్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్లాక్‌చైన్‌, పేటియం వంటివి స్థాపించేందుకు ఆ సంస్థలు ముందుకు వస్తున్నాయని లోకేశ్‌ చెప్పారు. భవిష్యత్తులో రైతులు ఎరువులు వేయాలన్నా.. క్రిమి సంహారక మందులు చల్లాలన్నా డ్రోన్‌లను వినియోగించే రోజులు సమీపంలోనే ఉన్నాయని చెప్పారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇంటెలిజెన్స్‌నూ విశాఖలో స్థాపించనున్నామని చెప్పారు. 90 రోజుల్లో రాష్ట్రంలో 36 ఐటీపరిశ్రమలు ప్రారంభమయ్యాయన్నారు. హెచ్‌సీఎల్‌తో భారీ ఉపాధి గన్నవరం సమీపంలో గతంలో 15 ఎకరాల్లో ఐటీ కార్యకలాపాలను చేపట్టి 3000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ముందుకొచ్చిన హెచ్‌సీఎల్‌ సంస్థ ఇప్పుడు 30 ఎకరాలను కోరుతోందని లోకేశ్‌ తెలిపారు. సంప్రదాయ ఐటీ విధానాలను కాకుండా క్లౌడ్‌ ఆధారిత ఐటీ పరిశ్రమలను స్థాపిస్తామని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే .. గ్లోబల్‌ ఇన్‌హౌజ్‌ సెంటర్‌, డీటీపీ పాలసీలను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం .. త్వరలోనే కేబినెట్‌ ముందుకు క్లౌడ్‌ హబ్‌ పాలసీని తీసుకువస్తుందని వివరించారు. 90 రోజుల్లోనే ఏపీఎన్‌ఆర్‌టీ 7 సంస్థలను విజయవాడకు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. అక్టోబర్‌లో డిక్సన్‌ వస్తోందని చెప్పారు. విశాఖలో 7 అసెంబ్లింగ్‌ యూనిట్‌లను స్థాపిస్తామని చెప్పారు. మంగళగిరిలో ఐటీ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల 28న పైడేటా సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. 20న పలు ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రులు దేనినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవి వేమూరు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
×
×
  • Create New...