Jump to content

sonykongara

Members
  • Posts

    75,332
  • Joined

  • Last visited

  • Days Won

    113

Everything posted by sonykongara

  1. నేడు విజయవాడలో క్వాంటమ్‌ వ్యాలీపై వర్క్‌షాప్‌ By Andhra Pradesh News DeskPublished : 30 Jun 2025 05:06 IST Ee Font size 1 min read పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ప్రముఖులకు సీఎం చంద్రబాబు విందు విందు సందర్భంగా దిగ్గజ ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఈనాడు, అమరావతి: అమరావతి క్వాంటమ్‌ వ్యాలీపై సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం రాత్రి వారికి విందు ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటమ్‌ వ్యాలీని అభివృద్ధి చేయడంపై చర్చించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సహకారంతో దేశంలోనే మొదటి పార్కును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. టీసీఎస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ హెడ్‌ (టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌) వి.రాజన్న, మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ రాజీవ్‌కుమార్, ఏటీ అండ్‌ టీ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ సిద్ధు, వార్నర్‌ బ్రదర్స్‌ ఇండియా ఇన్నోవేషన్‌ సెంటర్‌ హెడ్‌ మనీష్‌వర్మ, భారత్‌ బయోటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర కె.ఎల్ల, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్, నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ జె.బి.వి.రెడ్డి, ఆస్ట్రాజెనెకా ఎండీ ప్రవీణ్‌రావు, ఐబీఎం ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ స్కాట్‌ క్రౌడర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అభయ్‌ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్‌కుమార్‌ సూద్‌ తదితర ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. వీరితో పాటు అమెజాన్, హెచ్‌సీఎల్, ఎల్‌అండ్‌టీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  2. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో అద్భుతాలు చేయొచ్చు By Andhra Pradesh News DeskPublished : 30 Jun 2025 05:19 IST Ee Font size 4 min read శిక్షణకు దేశ విదేశీ నిపుణులను ఆహ్వానించాలి కొత్త నగరమైనందున అమరావతికి అనుకూలతలెన్నో ‘ఈనాడు’ ముఖాముఖిలో కంప్యూటింగ్‌ రంగ నిపుణుడు, ఎఫ్ట్రానిక్స్‌ కంపెనీ అధినేత రామకృష్ణ ఈనాడు - అమరావతి హైఎండ్‌ టెక్నాలజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, శిక్షణ ఇస్తే అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా చేయొచ్చు. మన పిల్లల మేధో సంపత్తిని ఇక్కడే వాడుకోవచ్చు. విదేశీసంస్థలు, నిపుణులు వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేసుకొని వెళ్లిపోతే, మనకు దక్కేది తక్కువే. మొత్తం ఎకోసిస్టమ్‌ ఇక్కడే అభివృద్ధి చెందాలంటే ఆల్గరిథమ్స్‌ రాసే నిపుణుల్ని తయారుచేయాలి. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీని తలపించేలా అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఈ నెల 30న జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కార్యశాల నిర్వహించి, ‘క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌’నూ వెల్లడించనున్నారు. ఐబీఎం, టీసీఎస్‌ తదితర ఐటీ దిగ్గజ సంస్థలు ఇందులో భాగస్వాములవుతున్నాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతతో ఉపయోగాలేంటి? రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలేంటి? దీని ఫలితాలను అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి అన్న సందేహాలను కంప్యూటింగ్‌ రంగంలో విశేష అనుభవశాలి, ఎఫ్ట్రానిక్స్‌ కంపెనీ అధినేత, సీఐఐ ఏపీ ఛాప్టర్‌ పూర్వ అధ్యక్షుడు డి.రామకృష్ణ ‘ఈనాడు’ ముఖాముఖిలో నివృత్తి చేశారు. ఆయన 1983లో మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేసి, 1985లో సొంత కంపెనీ ప్రారంభించారు. సంక్లిష్ట లెక్కలు.. క్షణాల్లో! నేడు అందరం యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నాం. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, ఎంత డబ్బు చెల్లించాలో నమోదుచేస్తే, ఆ సమాచారం మీ బ్యాంకు ఖాతాకు వెళ్లి, అక్కడి నుంచి అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతా తెలుసుకుని, మీ బ్యాంకు నుంచి ఆ బ్యాంకు ఖాతాకు సెకన్లలో సొమ్ము జమైపోతుంది. ఇలా సొమ్ము బదిలీ కావడం వెనక సంక్లిష్టమైన కంప్యూటింగ్‌ ప్రక్రియ ఉంటుంది. వేల కంప్యూటర్లు పనిచేస్తాయి. ప్రస్తుతం 2-3 గిగా హెర్ట్జ్‌ స్పీడ్‌తో పనిచేసే కంప్యూటర్లున్నాయి. కాలిక్యులేషన్స్‌లో సంక్లిష్టతలు పెరిగేకొద్దీ, కంప్యూటర్‌ స్పీడ్‌ పెరిగాలి. వీటికి పరిష్కారమే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌. పరమాణువులో కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల ప్రవర్తన ఆధారంగా (క్వాంటమ్‌ మెకానిక్స్‌) క్వాంటమ్‌ కంప్యూటర్లు రూపొందాయి. సంప్రదాయ కంప్యూటర్లలో కొన్నేళ్ల సమయం పట్టే కాలిక్యులేషన్స్‌ను క్వాంటమ్‌ కంప్యూటర్స్‌లో నిమిషాల్లోనే చేయొచ్చు. నైపుణ్యాల పెంపే కీలకం క్వాంటం కంప్యూటర్లను సాధారణ కంప్యూటర్లలా వాడేయలేం. వీటికి మైనస్‌ 273 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కావాలి. బయటి నుంచి ఏ తరంగాలూ రాకూడదు. ఆల్గరిథమ్స్‌ రాసేందుకు ఎంతో నైపుణ్యం కావాలి. గణిత, భౌతికశాస్త్రాలతో పాటు సంబంధిత రంగాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలి. ప్రస్తుతం కొత్త ఔషధాల్ని కనిపెట్టడం, రవాణా, ఏఐ, ఎన్‌క్రిప్షన్‌ వంటి కొన్ని అంశాల ఆల్గరిథమ్స్‌ ఉన్నాయి. క్యాన్సర్‌కు కొత్తమందు కనిపెట్టేందుకు ఎన్ని కాంబినేషన్లకు అవకాశముందో కాలిక్యులేట్‌ చేయడానికి సాధారణ కంప్యూటర్లలో కొన్నేళ్లు పడితే, క్వాంటమ్‌ కంప్యూటర్లలో నిమిషాల్లో పూర్తిచేయొచ్చు. మిగతా రంగాల ఆల్గరిథమ్స్‌ కూడా సిద్ధమైతే అద్భుతాలు చేయొచ్చు. సినిమాల్లో గ్రాఫిక్స్, ఎడిటింగ్‌లకు ఆల్గరిథమ్స్‌ సిద్ధమైతే వేగం పెరిగి, ఖర్చు తగ్గుతుంది. కొత్త ఆల్గరిథమ్స్‌ రాసే స్థాయికి మనం ఎదిగినప్పుడే దాని ప్రయోజనాలు పొందగలం. చంద్రబాబు క్వాంటమ్‌ వ్యాలీ ప్రకటించినందున దాన్ని అందిపుచ్చుకోవాలన్న జిజ్ఞాస యువతలో ఉండాలి. దక్షిణ కొరియా అనుభవపాఠం హైఎండ్‌ టెక్నాలజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, శిక్షణ ఇస్తే అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా చేయొచ్చు. మన పిల్లల మేధోసంపత్తిని ఇక్కడే వాడుకోవచ్చు. ఇంజినీరింగ్, బీఎస్సీ కంప్యూటర్స్‌లో ప్రభుత్వం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను సబ్జెక్ట్‌గా ప్రవేశపెడుతోంది. అప్లికేషన్‌ ఆధారిత’ విద్యావిధానాన్ని ప్రోత్సహించాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సామర్థ్యాలు పెంపొందించాలి. ఈ రంగంలో నిపుణులు ప్రపంచంలో ఎక్కడున్నా రప్పించి, మంచి వేతనాలిచ్చి యువతకు శిక్షణ ఇప్పించాలి. ఒకప్పుడు జపాన్‌ నుంచి దక్షిణ కొరియాకు ప్రతి శుక్రవారం నిపుణులతో నాలుగు విమానాలు వెళ్లేవి. వారు రెండు రోజులపాటు అక్కడ శిక్షణ ఇచ్చి, మళ్లీ ఆదివారం జపాన్‌ చేరుకునేవారు. దక్షిణకొరియా.. నేడు కొన్ని సాంకేతికతల్లో లీడర్‌. మన దగ్గరా అలాంటి ప్రయత్నం జరగాలి. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లుగా.. వర్సిటీలు విదేశీసంస్థలు, నిపుణులు వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేసుకొని వెళ్లిపోతే, మనకు దక్కేది తక్కువే. మొత్తం ఎకోసిస్టమ్‌ ఇక్కడే అభివృద్ధి చెందాలంటే ఆల్గరిథమ్స్‌ రాసే నిపుణుల్ని తయారుచేయాలి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను వినియోగించగల రంగాల కంపెనీలను రప్పించాలి. అమరావతిలో విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృతతో పాటు చుట్టుపక్కల విజ్ఞాన్, కేఎల్, పీబీ సిద్ధార్థ తదితర యూనివర్సిటీలున్నాయి. వీటిని డ్రగ్‌ డిస్కవరీ, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లుగా అభివృద్ధి చేయొచ్చు. అమరావతి కొత్తగా నిర్మిస్తున్న నగరం కాబట్టి, అనుకూలతలు ఎక్కువ. బెంగళూరు, హైదరాబాద్‌లా ట్రాఫిక్‌ సమస్యలు, భూముల కొరత వంటి సవాళ్లు లేవు. యువత ఎక్కువగా ఉన్నందున కొద్ది ప్రయత్నంతో నిపుణులను తయారుచేయొచ్చు.
  3. అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తాం: నారా లోకేశ్‌ By Andhra Pradesh News TeamPublished : 30 Jun 2025 13:29 IST Ee Font size 1 min read విజయవాడ: అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. విజయవాడలో క్వాంటం కంప్యూటింగ్‌ వ్యాలీపై నిర్వహించిన నేషనల్‌ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామని చెప్పారు. అమరావతికి రావాలని స్టార్టప్‌ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌ గురించి అందరికీ తెలుసని.. ఆయన ఎప్పుడూ సాంకేతికతకు పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన ఐటీ, ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులకు లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. (Andhra Pradesh News)
  4. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు By Andhra Pradesh News TeamPublished : 30 Jun 2025 13:08 IST Ee Font size 1 min read విజయవాడ: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ (Quantum computing)ను మనం అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌అండ్‌టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మూడు సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్వాంటమ్‌ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిసి ఐటీ విస్తరణపై చర్చించా. పీపీపీ మోడల్‌లో హైటెక్‌సిటీ కట్టాలని ఎల్‌అండ్‌టీని కోరా. తర్వాత ఆ సంస్థ బెంగళూరు, గురుగ్రామ్‌లోనూ ఐటీ భవనాలు కట్టింది. భవిష్యత్తులో భారత్‌ అతిపెద్ద ఐటీ హబ్‌గా మారుతుందని ఆనాడే చెప్పా. ఉమ్మడి ఏపీలో ఇంజినీరింగ్‌ కళాశాలలు అనేకం వచ్చేలా చూశా. రాజధాని ప్రాంతానికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నాం. అమరావతికి రావాలని స్టార్టప్‌ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.
  5. మూలపేటలో అమెరికా కంపెనీ ABN , Publish Date - Jun 28 , 2025 | 04:07 AM అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్‌ కంపెనీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు కాబోతోంది. 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ పాలీఇథలీన్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 83 వేల కోట్ల పెట్టుబడితో పాలిఇథలీన్‌ పరిశ్రమకు ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన సంస్థ ప్రతినిధులు, అధికారులు టెక్కలి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్‌ కంపెనీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు కాబోతోంది. 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ పాలీఇథలీన్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం ఆ సంస్థ ప్రతినిధులు జెవె్‌స్టకాట్‌, సేలింలో, డీపీ ప్రసన్న, శ్రీసీజ్‌ రామచంద్రన్‌, రంజిత్‌ కుమార్‌ ఈ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఆర్డీవో కృష్ణమూర్తి వారికి వివరించారు. రైల్‌, రోడ్డు రవాణా అనుసంధానం, అవసరమైన విద్యుత్‌, గొట్టాబ్యారేజ్‌ నుంచి నీరు సమకూరుస్తామని తెలిపారు. ఇక్కడ పోర్టు నిర్మాణంతో వచ్చే సౌకర్యాల గురించి నిర్మాణ సంస్థ విశ్వసముద్ర జీఎం శంకరరావు అమెరికా బృందానికి అవగాహన కల్పించారు. మొగ్గుచూపిన ప్రతినిధి బృందం ఎగ్జాంబిల్‌ కంపెనీ ప్రతినిధులు జేవె్‌స్టకాట్‌, సేలింలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు రామాయపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులు పరిశీలించాం. ఇప్పుడు మూలపేట పోర్టు ప్రాంతాన్ని కూడా చూశాం. ఇక్కడి తీరంలో కార్గోషిప్పింగ్ రాకపోకలకు అనుకూల వాతావరణం ఉంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏడాదికి రెండు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ తయారీ చేయొచ్చు. మా సంస్థకు రోజుకి వంద మిలియన్‌ లీటర్ల నీరు కావాలి. పర్యావరణ ఇబ్బందులు లేని వేస్ట్‌వాటర్‌ ట్రీట్మెంట్‌ చేస్తాం. ఫస్ట్‌ఫేజ్‌లో పాలీఇథలీన్‌, రెండో ఫేజ్‌లో పాలీప్రోపలిన్‌ తయారు చేస్తాం. 70 దేశాల్లో మా పరిశ్రమలు ఉన్నాయి. 62వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు’ అని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హేమసుందర్‌, ఏపీఐఐసీ జెడ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
×
×
  • Create New...