Jump to content

sonykongara

Members
 • Posts

  67,071
 • Joined

 • Last visited

 • Days Won

  90

Everything posted by sonykongara

 1. Nara Lokesh: ప్రకాశం జిల్లాను ఫార్మాహబ్‌గా చేస్తాం: నారా లోకేశ్‌ ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. Published : 30 Apr 2024 19:25 IST ఒంగోలు: ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతాం. నాడు ఒక్క అవకాశం అని చెబితే మాయలో పడ్డారు.. నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. తెదేపా తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయి. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచాం. తెదేపా హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించాం. నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి. నాపై 23 కేసులు పెట్టారు.. ప్రజల కోసం పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు. మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం. సమర్థ నాయకత్వం అందించే అభ్యర్థులను గెలిపించాలి. తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదు. చట్టాలను కొంత మంది చుట్టాలుగా మార్చారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. వారి పేర్లు రెడ్‌ బుక్‌లో ఉన్నాయి. అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరులను పేదలకు ఖర్చు పెడతాం. తెదేపా హయాం నాటి పథకాలను వైకాపా రద్దు చేసింది. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం’’ అని లోకేశ్ భరోసా కల్పించారు.
 2. ఒంగోలులో నారా లోకేశ్‌ యువగళం సభ ఒంగోలులో లోకేశ్‌ యువగళం సభ తెదేపా హయాంలో జిల్లాలవారీగా ప్రాధాన్యం కల్పించాం: లోకేశ్‌ నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి ప్రజల తరఫున పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు ప్రజల తరఫున పోరాడితే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం ప్రకాశం జిల్లా అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం
 3. అమరావతి: ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు.‘‘ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ తెలిపారు. ఎన్డీయే హామీల్లో ముఖ్యాంశాలివే..
 4. కార్యకర్తల విన్నపం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నామినేషన్ ని విత్ డ్రా చేసుకున్న నూజివీడు టీడీపీ రెబల్ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరావు గారు నేడు కర్నూలు జిల్లా నందికొట్కూరు లో చంద్రబాబు సమక్షంలో తిరిగి సొంత గూటికి రానున్న ముద్దరబోయిన
 5. నూజివీడులో నామినేషన్ ఉపసంహరించుకున్న టీడీపీ రెబల్ అభ్యర్థి ముద్దరబోయిన - వెంకటేశ్వరరావుతో పాటు నామినేషన్ ఉపసంహరించుకున్న ఆయన భార్య
×
×
 • Create New...