Jump to content

rk09

Members
  • Posts

    1,461
  • Joined

Everything posted by rk09

  1. I mean - srisailam lo water above 845 ft vunnappudu and Sunkesula full ayinappudu Then no use with Mutchumarri Currently it discharges into Kc canal and hnss feeder canal. Once hnss expansion ayinataruvatha - it's very useful Yes Mutchumarri can draw water at 790ft too
  2. ee situation (above 845 ft) lo Mutchumarri no use Sunkesula full - so No issue for KC canal HNSS - Malyala pumps can start above 835 ft Pothireddypadu - 40k above 854 ft HNSS expansion works jaruguthunnayi -and also 8 stages lo vunna lifts lo motors kuda add cheyyali - may be in a year or two it will be a reality
  3. Pothyreddipadu minimum draw level 854 ft, capacity 40k Hnss 1k at 835 + Mutchumarri 4K once completed(16 pumps) at 790 level
  4. From Eenadu నచ్చలేదు.. రాజమౌళి సలహా తీసుకోండి అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ ముఖ్య ఆకృతుల నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునఃపరిశీలించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన కొన్ని ఆకృతులు బాగున్నప్పటికీ.. ఇంకొన్ని తనకు నచ్చలేదన్నారు. ఇంకా కాస్త సమయం తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. దీనికోసం సీఆర్డీఏ సంస్థలోని ఆర్కిటెక్ట్‌లు, రాష్ట్రంలోని పేరొందిన ఆర్కిటెక్టులతో బృందం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నిర్మాణాల ఆకృతుల రూపకల్పనలో ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సంప్రదింపులు జరపాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైతే బృందంతో సహా రాజమౌళిని లండన్‌ పంపించాలని సూచించారు. ఆకృతుల తయారీలో ఫోస్టర్‌ సంస్థకు సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ఈరోజు మరోసారి సమావేశమయ్యారు. రాజధానిలో పరిపాలన నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై వారు సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణతో కలిసి ఈ ఆకృతులను పునఃపరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రధాన భవంతుల తుది ఆకృతులకు కొంత సమయం తీసుకోవాలని ఫోస్టర్‌ బృందం ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే రూపొందించిన ఆకృతుల్లో కొన్ని బాగున్నాయని, ఇంకొన్ని ఆకృతుల బాహ్యరూపం అంతగొప్పగా లేదని చెప్పారు. ఈ ఆకృతులపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని వారికి తెలిపారు. కొంత సమయం తీసుకొని ఉత్తమమైన ఆకృతులను రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ప్రపంచంలోని తొలి 10 అత్యుత్తమ నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సీఆర్డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌లు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్ట్‌లతో బృందం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ బృందం ఆకృతుల రూపకల్పనలో ఫోస్టర్‌ బృందానికి సహకరించేలా ఉండాలన్నారు. అక్టోబర్‌ 25న తాను స్వయంగా లండన్‌కు వెళ్లనున్నట్టు సీఎం వెల్లడించారు. ఫోస్టర్‌ కార్యాలయాన్ని సందర్శించి ఆకృతులను పరిశీలిస్తానన్నారు. వచ్చే నెలలో యూఎస్‌, యూఏఈ పర్యటనతో పాటు యూకేకు వెళ్లాలని నిర్ణయించారు. ఆకృతులను అక్టోబర్‌ నెలాఖరు లోగా ఖరారు చేయవచ్చన్నారు. ఆకృతుల తయారీలో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించి అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించాలని కోరారు.
  5. 08 Sep 2017: Eenadu dt. edition గోదావరి జలాలు.. కృష్ణా డెల్టాకు వరాలు డెల్టాలో అధిక దిగుబడులు పట్టిసీమ ఎత్తిపోతలతో పైరుకు వూపిరి 11 లక్షల ఎకరాలకు సకాలంలో సాగునీరు 2 లక్షల ఎకరాల ఆక్వా సాగుకు నీటిసరఫరా నదుల అనుసంధానంతో అన్నదాతలకు ఫలాలు కృష్ణా డెల్టాలో గత ఖరీఫ్‌ సీజన్‌లో గోదావరి జలాల ద్వారా వరి పంట పండించారు. నీటిలభ్యత తక్కువగా ఉండటంతో వెదపద్ధతి, ఆరుతడి విధానంలో సాగునీరు అందించారు. ఈక్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం దిగుబడులు పెరిగాయి. రాష్ట్రంలోనే ఇక్కడ అధిక దిగుబడులు నమోదయ్యాయి. గోదావరి జలాల వాడకంతో పాటు తక్కువనీటి వినియోగం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల అధిక దిగుబడులు వచ్చాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే గోదావరి జలాల వినియోగంతోనే దిగుబడులు పెరిగాయనే అంశంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్‌ నుంచి గతేడాది తక్కువ నీరు తీసుకుని గోదావరి జలాలు, స్థానిక వాగుల ద్వారా వచ్చిన నీటితోనే 11 లక్షల ఎకరాల్లో పంటకు సాగునీరు అందించి రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు స్థానిక వాగులు, పట్టిసీమ ద్వారా వస్తున్న జలాలతోనే నాట్లు పూర్తిచేస్తున్నారు. ఈనాడు-అమరావతిసర్వప్రాణకోటి మనుగడకు, సామాజిక, ఆర్థిక ప్రగతికి మూలం జలం. జలంతోనే జనం ప్రగతి సాధ్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం జీవ నదులను అనుసంధానిద్దాం.. భావితరాల భవితకు బాటలు వేద్దాం అంటూ గోదావరి, కృష్ణానదుల సంగమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి గోదావరి నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసి గోదావరి, కృష్ణానదుల అనుసంధానం చేసింది. గోదావరి నీటిని కృష్ణా డెల్టా ఆయకట్టుకు అందించి అన్నదాతలకు సాగునీటి భరోసా కల్పించింది. దీంతో కృష్ణా డెల్టాలో రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు నమోదయ్యాయి. ఈసారి జులైలోనే నీరు అందించడంతో తుపానుల ముప్పు నుంచి గండం తప్పింది. మరోవైపు సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుకు నీరు అందించి విదేశీ మారక ద్రవ్యం ఆర్జనకు గోదావరి జలాలు మార్గం సుగమం చేశాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలకు వరదనీరు రాకపోయినా గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తోడి కృష్ణా డెల్టాకు ప్రాణం పోశారు. కృష్ణా డెల్టాకు జులైలోనే సాగునీరు అందించి పంట చివరి దశలో తుపానుల ముప్పు నుంచి తప్పించారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో కృష్ణాడెల్టాలో ధాన్యపు సిరులు పండిస్తున్నారు. వరితో పాటు ఆక్వా సాగుకు నీరు వదిలి వూపిరిలూదారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న రాష్ట్రాలు వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసిపట్టి దిగువకు వదలకపోయినా గోదావరి నీటిని తరలించి కృష్ణా డెల్టా ఆయకట్టు అన్నదాతలకు సాగు, తాగునీరు అందించి సకాలంలో నాట్లు వేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. గత ఖరీఫ్‌ సీజన్‌లో పట్టిసీమ నుంచి తెచ్చిన నీటితో పంటను కాపాడిన ప్రభుత్వం జులైలో నీటిని కాలువలకు విడుదల చేయడంతో రైతులు సాగునీటిపై భరోసాతో నాట్లు వేసుకున్నారు. కృష్ణా డెల్టాలో ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా మరో లక్ష ఎకరాల్లో వారం రోజుల్లో పడనున్నాయి. పట్టిసీమతో పంటకు భరోసా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీటి ఆధారంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో 13 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేవి. కాలక్రమంలో కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో నూతన ప్రాజెక్టులు రావడం, రాష్ట్ర విభజనతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాల్సి రావడంతో ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు తగ్గింది. మూడేళ్లుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులతో నాగార్జునసాగర్‌కే ఆగస్టు వచ్చిన వరదనీరు చేరని పరిస్థితి. ఈ ఏడాదైతే శ్రీశైలానికి మూడురోజుల కిందట కొంత వరదనీరు వచ్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఎన్నడూలేని విధంగా సెప్టెంబరులో కూడా అట్టడుగు నీటిమట్టాలతో ఉన్నాయి. అయినా గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి సాగునీరు అందించారు. దీనికితోడు నాగార్జునసాగర్‌ దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకుని డెల్టాలో రైతులకు ఇబ్బందులు లేకుండా జలవనరుల శాఖ నీటి సరఫరా చేసింది. 57.96 టీఎంసీల వినియోగం కృష్ణాడెల్టాలో ఇప్పటివరకు 57.96 టీఎంసీలు నీటిని వినియోగించారు. ఇందులో సింహభాగం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి తరలించిన జలాలే. స్థానికంగా ఉన్న పాలేరు, మునేరు, బుడమేరు, ఎద్దులవాగు, కొండవీటివాగు నుంచి కొంతనీరు బ్యారేజీకి వర్షాలు పడినప్పుడు వస్తోంది. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా సగటున నిత్యం 7700 క్యూసెక్కులు బ్యారేజీకి చేరుతోంది. కృష్ణా డెల్టా అవసరాలు, స్థానిక వాగుల నుంచి వచ్చే నీటిని సమన్వయం చేసుకుంటూ పట్టిసీమ పంపులను నిర్వహిస్తున్నారు. పులిచింతలకు వచ్చిన వరద నీటిని అక్కడే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 6.37 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 3460 క్యూసెక్కులు సగటున ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఉంది. వరికి చిరుపొట్ట, గింజ పాలుపోసుకునే దశల్లో నీటి అవసరం ఎక్కువ. ఆసమయంలో అవసరమైతే పులిచింతల నుంచి నీటిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. అందుకే వీలైనంత వరకు పులిచింతల నీటిని దిగువకు వదలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజువారీగా పట్టిసీమ నుంచి వచ్చే నీరు, స్థానిక వాగుల ద్వారా వచ్చేనీరు, డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని సమీక్షిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి చుక్క నీరు విలువైనదిగా గుర్తించి ముందస్తుగానే వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
  6. Currently bucking ham canal ends near Pedaganjam in Ongole district. And capacity is less than 1/4 th of starting point.
  7. నేరుగా మళ్లింపు! జలాశయం లేకుండా సోమశిలకు నీటి తరలింపు యోచన గోదావరి-పెన్నా అనుసంధానానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఈ నెలలోనే లైడార్‌ సర్వే ఈనాడు - అమరావతి గోదావరి, పెన్నా అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలకు ఎక్కించాలని ఆయన భావిస్తున్నారు. ఇంతకుముందు సిద్ధం చేసిన ప్రతిపాదన నేపథ్యంలోనే... ఖర్చు తగ్గించి నీళ్లు మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై మరింత అధ్యయనం చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే తొలిదశలో జలాశయం నిర్మాణాన్ని మినహాయించి నేరుగా ఎత్తిపోతల ద్వారా సోమశిలకు నీరు మళ్లించేలా పథకానికి తిరిగి రూపకల్పన చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటికీ కటకటలాడే పరిస్థితి. ఇంతవరకు శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి చుక్క నీరు వచ్చింది లేదు. ఆలమట్టి జలాశయం నిండినా అక్కడి నీరు అక్కడే వాడేస్తున్నారు. రోజుకు 1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీల వరకు కర్ణాటకలోనే వినియోగించుకుంటున్నారని అధికారులు లెక్కలు తేల్చారు. ఎగువ రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టుల వల్ల దిగువకు కృష్ణా నీరే రావడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలు వెలవెలలాడుతున్నాయి. తుంగభద్రలోకి వస్తున్న ప్రవాహమూ అంతంతమాత్రమే. సెప్టెంబర్‌ వచ్చినా కృష్ణా నీళ్లు రాని పరిస్థితి. ఈ నెల కూడా ఇలాగే ఉంటే తాగునీటి అవసరాలు తీర్చడమూ గగనమవుతుంది. మరోవైపు గోదావరిలో బుధవారం వరకు 600 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. తాజా పరిస్థితులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక గోదావరి, పెన్నా అనుసంధానాన్ని ఆలస్యం చేయడం సరికాదనే అభిప్రాయంలో ముఖ్యమంత్రి ఉన్నారు. దశలవారీగా దీన్ని పట్టాలకు ఎక్కించడమే రాష్ట్రానికి శ్రేయస్కరంగా భావించి కసరత్తును వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుపై రాబోయే 10 రోజుల్లో సీఎం వద్ద ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. పాత ప్రణాళికలో మార్పులపై కసరత్తు * పాత ప్రణాళిక ప్రకారం గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించి గోదావరి నుంచి పెన్నా మళ్లింపు ద్వారా 320 టీఎంసీలు వినియోగించుకోవాలనేది యోచన. కొత్త ప్రణాళికలో బొల్లాపల్లి జలాశయం నిర్మాణాన్ని వాయిదా వేయనున్నారు. జలాశయం నిర్మాణం తాత్కాలికంగా పక్కన పెడితే ప్రాజెక్టు వ్యయం బాగా తగ్గించవచ్చనేది అంచనా. ఒక్క బొల్లాపల్లి జలాశయానికే 22 వేల ఎకరాల పట్టాభూమి, 17 వేల ఎకరాల అటవీభూమి అవసరం అవుతుంది. తొలిదశలో దీన్ని మినహాయించడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. * జలాశయం లేకపోవడం వల్ల ఎన్ని టీఎంసీల వినియోగానికి ఆస్కారం ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. దాదాపు కాలువ ఎలైన్‌మెంట్‌లో పెద్ద మార్పు ఉండదు. బొల్లాపల్లి జలాశయానికి తీసుకువెళ్లకుండా... అక్కడ మరో ఎత్తిపోతలను ఏర్పాటు చేసి నేరుగా సోమశిలకు మళ్లించనున్నారు. గోదావరి నుంచి బొల్లాపల్లి వరకు 317 కిలోమీటర్ల మేర కాలువ ద్వారా నీరు మళ్లించాలి. అక్కడి నుంచి సోమశిలకు 375 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీరు చేర్చే అవకాశం ఉంది. జలాశయంలో నిల్వ లేకుండా ఇంతదూరం నీటిని తీసుకువెళ్లడం వల్ల వచ్చే ఇబ్బందులను అధికారులు పరిశీలిస్తున్నారు. లైడార్‌ సర్వే... ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఈ నెలలోనే వ్యాప్కోస్‌ ద్వారా లైడార్‌ సర్వే చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లైడార్‌ సర్వే ఆపమని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ సూచించింది. తిరిగి అనుమతుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నెలలోనే లైడార్‌ సర్వే పూర్తి చేయనున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో ఈ సర్వే చేపడతారు. మూడు రోజుల వ్యవధిలోనే సర్వే మొత్తం పూర్తవుతుంది. ఆ సర్వే ద్వారా వాస్తవ ఎలైన్‌మెంట్‌తో ప్రాజెక్టు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయవచ్చని చెబుతున్నారు.
  8. @KaNTRhi, Bhavani Ghat/Berm park
  9. Yes, konchem asa - ala fast ga oka 100 tmc within a week ravalani
  10. 2009 Sep season lo oka 1/4 vatchina sagar right canal safe.
  11. At matchumarri last year 2 motors pettaru- to pump into KC canal. Ee new 16 pumps, 12 hnss annaru - but matchumarri nunchi hnss ki new kalva tavvara? Because hnss intake is at malyala. Ikkada echo miss ayya nenu And also from hnss - some motors shifted to purshottapatnam Next 10 days lo nellu vaste - evaru opika batti vallu todukotame. Here AP has edge.
  12. ee season in next one month lo 100 tmc kavali - both seema and Sagar right canal krishna delta is safe with pattiseema and pulichintala for this season Mutchmarri project entha varaku vatchindi?
  13. Ujani Dam taruvata next Jurala ne ee Bhima river ani peruke kani - adi pedda panta kaluva - with so many dristubutaries - I mean ee Bhima parivahaka prantam antha full farming lands on top of it both MH and KA built several drops/shutters to feed the dristubutaries (source : KCR presentation in assembly) but good, it will enters Srisailam soon
  14. super!... next season ki ready ayithe bagundu.. elagu one year antunnaru..... bhu sekarana ayipothe , works laginchestharu asalu polavaram meeda chala depend ayyi vunnayi
  15. TG doesn't care for water to lift on krishna. They use it for power generation. Water Oka level (approx 6 tmc) reach Ayina tarivatha power start chesukovatchu ani vundi. It's cheap power (around 2rs) compared to thermal (around 5 rs) Oka sari power start chesthe within 15 days kali. Dammugudem- tailpond is the best solution for both TG and AP. May be CBN will try with center once polavaram is in a good shape. (Annagaru ee subject mida clear ga rasaru ee related threads lo)
  16. Next 10-20 years varaku 100 tmc ante chala kastam. - nov to Jan rendo panta ki nellu kavali. Appatiki varshalu agi potayi. If it's dalva then you need more water. Oka sari polavaram lo neellu vunnayi ani Alavatu chesthe most of krishna delta rendo panta ki kuda vari vestharu. On top of it existing Godavari delta. Right now we are getting water from sileru whenever it's needed. And now there is left canal too. On top of it you need to save some more water until next season (June) - especially for Godavari delta. I'm not expecting any thing from krishna. Even if it's there it will be directed to seema and sagar right canal. Only varadalu vasthe tappa no water to sagar down stream. Ippude vunna paristhithullo krishna Water ekkada store chesukolem. Water vunte TG power generation ki vadesthundi.
  17. Feb to May konchem kastam anukunta - unless you release from Sileru
  18. aa water konchem anna Owk reserviour loki velthe baguntundhi. this one under SRBC -
  19. very good. details please and also total project cost yentha ayyindi?
  20. fully agree on longer the route...... naa view based on current water availability and more over -- from barrage canals, water always flows from july - oct/dec in full extent and after drinking purposes.. so its difficult to maintain that level at upstream especially at muktyala as long as there is some flow -- no issues
  21. varshalu padali ippudu lekapothe neetini todatanike saripothundi. asala delta lo ekkada choosina motors (oil + solor) ye anta
  22. బ్యారేజీకి సాగర్‌ జలాలు నీటి మట్టాన్ని కొనసాగించేందుకు నిర్ణయం రెండు జిల్లాల్లో పెరుగుతున్న సాగు విస్తీర్ణం అరకొర వానలతో పెరిగిన డిమాండ్‌ భారీ వర్షాలపైనే డెల్టా రైతుల ఆశలు ఈనాడు - అమరావతి ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు ఆశించిన మేరకు కురుస్తాయన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. దీంతో ప్రభుత్వం కృష్ణా డెల్టాకు గతంలో ఎన్నడూ లేనంతగా చాలా ముందుగానే సాగు నీటిని విడుదల చేసింది. కృష్ణాలో నీరు లేకపోయినా పట్టిసీమ జలాలకు తోడు వరుణుడు కరుణిస్తాడన్న ఆశతో ప్రభుత్వం ధైర్యం చేసింది. దీనికి తగ్గట్లుగానే రైతులు కూడా తుపాన్ల లోగానే దిగుబడిని తెచ్చుకునేందుకు ముందస్తుగా వరి నాట్లు వేశారు. అరకొర వర్షాలు తప్పితే పదునైన వాన పడలేదు. ఎగువ నుంచి నీటి జాడ లేకపోవడంతో కేవలం పట్టిసీమ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. సీజన్‌ వూపందుకునే కొద్దీ సాగు శాతం పెరుగుతోంది. నీటి అవసరాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు ఇబ్బందిగా లేకుండా నిర్విరామంగా నీటిని అందించేందుకు జలవనరుల శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల నుంచి కొంత నీటిని బ్యారేజికి తరలించారు. పడిపోతున్న నీటి మట్టాన్ని నిలబెట్టేందుకు మలి ప్రయత్నంగా నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకొస్తున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అధికారులను ఆదేశించారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు సాగు నీటికి ఢోకా లేనట్లే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో సాగు అవసరాలు తీరాలంటే ప్రస్తుతం వరుణుడిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అరకొర వర్షాలే.. ఈ వ్యవసాయ సీజన్‌లో సాధారణ వర్షాలే నమోదవుతున్నాయి. జులైలో రికార్డు స్థాయిలో వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనాలు నిజం కాలేదు. అల్పపీడనాలు ఏర్పడుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడట్లేదు. రాజధానిలోని గుంటూరు జిల్లాలో జూన్‌లో సాధారణం 86.3 సెం.మీ కాగా 148.1 సెం.మీ కురిసింది. జులైలో 142.1 సె.మీ గాను కేవలం 126.6 సె.మీ మాత్రమే పడింది. ఆగస్టులో ఇప్పటి వరకు 68.3 సె.మీ గాను 70 సె.మీ కురిసింది. కృష్ణాలో పరిశీలిస్తే.. జూన్‌లో 97.8 సె.మీ సాధారణం కాగా 167.7 సె.మీ కురిసింది. జులైలో 210.6 సె.మీ గాను 206.2 మాత్రమే పడింది. ఆగస్టులో ఇప్పటివరకు 95.4 సె.మీ కురవాల్సింది.. 52.3 సె.మీ మాత్రమే నమోదైంది. డెల్టాలో ఎక్కువగా వేసేది వరి పంట. దీనికి నాట్లు మొదలు అధికంగా నీరు అవసరం. పట్టిసీమ నీరు వస్తుండటంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. దీంతో క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగు నీటికి డిమాండ్‌ ఎక్కువైంది. గోదావరి జలాలతో పాటు వర్షాలు సమృద్ధిగా పడితేనే కొంత ఒత్తిడి తగ్గుతుంది. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల్లో ఆనందాన్ని నింపాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. కృష్ణాలో చిరుజల్లులు తప్ప ఇంకా ఆశించిన విధంగా లేవు. నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ కృష్ణా డెల్టాలోని తూర్పు ప్రధాన కాలువకు జూన్‌ 26న సాగునీటిని విడుదల చేశారు. దీని పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు ఉంది. అనంతరం రెండు రోజులకే పశ్చిమ కాలువకు కూడా నీటిని వదిలారు. దీని కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టు ఉంది. ఇప్పటికే దాదాపు 50 రోజులుగా పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి బ్యారేజికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 29.11 టీఎంసీల మేర గోదావరి జలాలను బ్యారేజికి పంపించారు. ఇక్కడి నుంచి డెల్టాకు మొత్తం 35.46 టీఎంసీల వరకు సాగునీటి అవసరాలకు వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి రాక లేదు. దీంతో కేవలం పట్టిసీమపైనే ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక వాగుల నుంచి ఇప్పటి వరకు 5.58 టీఎంసీలు మాత్రమే వచ్చింది. బ్యారేజి నుంచి అవుట్‌ఫ్లో 8200 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు కాలువకు 4,400 క్యూ., పశ్చిమ కాలువకు 3,800 క్యూ. వరకు ఉంటోంది. డెల్టాలోని కృష్ణా జిల్లా పరిధిలో 5.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు 3.73 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయడం పూర్తయ్యింది. గుంటూరు జిల్లాలో 4.9లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు లక్ష ఎకరాలకు పైగా సాగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే గుంటూరు జిల్లాలో వరినాట్లు ముమ్మరం అవుతున్నాయి. దీంతో సాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. చివరి ఆయకట్టుకు కూడా అందాలంటే భారీగా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. టెయిల్‌పాండ్‌ నుంచి 1 టీఎంసీ ఇప్పటివరకు కేఈ కాలువకు 24.39 టీఎంసీలు, కేడబ్ల్యూ కాలువకు 10.75 టీఎంసీలు, గుంటూరు ఛానల్‌కు 0.33 టీఎంసీల మేర నీటిని వదిలారు. బ్యారేజి పూర్తి స్థాయి నీటిమట్టం 12 అడుగులు. ప్రస్తుతం ఇది 9.9 అడుగులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కనీస నీటిమట్టం ఉండేలా చూసేందుకు అదనపు నీటిని తరలించాల్సిన పరిస్థితి. పది రోజుల క్రితం ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు పులిచింతల నుంచి ఒక టీఎంసీ నీటిని బ్యారేజీకి తరలించారు. ఇంకా ఈ ప్రాజెక్టులో 2టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. దీన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌లో ఉన్న నీటిని బ్యారేజికి తీసుకురానున్నారు. అక్కడి నుంచి ఒక టీఎంసీ నీరు బ్యారేజికి రావడం వల్ల ఇందులో నీటి మట్టం పెరగనుంది. దీనివల్ల అదనంగా కొంత నీరు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. వరినాట్లు ముమ్మరం కావడంతో సాగునీటి అవసరాలకు ఇది అక్కరకు రానుంది.
  23. asalu Muktuala - chamarru madyalo year long neellu vuntaya - that too 2.5 meter deep and 45 meters wide pulichintala lo 45 tmc store chesina doubte makes sense between amaravati and vijayawada
  24. ippudu vadla basta enta vundi - last couple of years nunchi follow avvatla
  25. around 20K - paid full in advance, in movva mandalam
×
×
  • Create New...