Jump to content

కోట్ల మందికి కోట్ల రకాలుగా అనుకొంటారు


Cyclist

Recommended Posts

ఓ మనిషి గురించి కోట్ల మందికి తెలిస్తే, కోట్ల రకాలుగా అనుకొంటారు. 

కానీ..

ఓ పల్లె
ఓ పట్టణం
ఓ మహా నగరం
ఓ ఎడారి నేల

నదులు
పొలాలు
ఓ తుఫాను
ఓ వరద
ప్రకృతి

వీటికి ఆలోచన వస్తే..

తమకు తెలిసిన నాయుడు గురించి ఏమని ఆలోచిస్తాయి?

కోట్లాది మంది తమ ఆలోచనల బదులు వాటిలా నాయుడి గురించి ఆలోచిస్తే..

ఆయన కారణ జన్ముడు అని కాకున్నా.. కనీసం తనకు తాను నాయకుడిగా మలచుకొని, ఎలా పనిచేస్తారో అర్థం అవుతుంది. మనిషిగా కృతజ్ఞతా గర్వంతో.. మనస్ఫూర్తిగా మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తారు.

వలసలు వచ్చి సౌకర్యంగా వుందని పుట్టిన ఊరి వారితో బడాయిపోతూ.. కోట్లల్లో రియల్ ఎస్టేట్ లు చేసే వారి నుండి పూటగడవడానికి పనిచేసుకొనే వారి వరకు దాని వెనుక అక్కడే రాయి, రప్ప, తుప్పల నేలకు విలువకట్టలేని ఆలోచన శ్రమ జోడించిన నాయుడు కష్టం అర్థం అవుతుంది. 

అక్కడి వాడు కాదని కాకులు అన్నా... దానికి రాకపోకలు చేసే సమయంలో ఆకాశం నుండి ఆయన తొంగి చూసినప్పుడు నేల, నగరం, నది, ప్రకృతి ఆయన్ను గర్వపడేలా చేస్తుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...