Jump to content

AP welfare schemes


Yaswanth526

Recommended Posts

  • Replies 332
  • Created
  • Last Reply
ఎకరాకు 2,500

 

‘అన్నదాతా సుఖీభవ’ కింద రైతుకి తక్షణ సాయం
  కౌలు రైతులకు వాటా
  వచ్చే ఏడాది నుంచి 10 వేలు
  2 కోట్ల ఎకరాలకు 5,000 కోట్లు
  నిరుద్యోగ భృతి 2 వేలు చేసే యోచన

ap-main1a_4.jpg

పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. ఫిబ్రవరి 1న అక్కడ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అది మనకు చీకటి రోజు. అయిదు బడ్జెట్లు పెట్టి మోసం చేసిన రోజు. బందుకు మనం సుముఖంగా లేం. అయినా తెదేపా కార్యకర్తలంతా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని పెద్దఎత్తున పాల్గొనాలి.

- చంద్రబాబు

ఈనాడు, అమరావతి: సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడం, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేల చొప్పున ఆర్థికసాయం.. ఇలా వివిధ వర్గాలపై ఇటీవల వరాలజల్లు కురిపించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే బాటలో రైతాంగాన్ని ఆదుకునేందుకు భారీ పథకాన్ని ప్రకటించనుంది. రైతులకు తక్షణ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.2,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రకటనకు ముందే ఈ మొత్తాన్ని అందజేయనుంది. అలాగే నిరుద్యోగులకు భృతి పెంచే విషయాన్నీ యోచిస్తోంది. ‘నిరుద్యోగ భృతి కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 ఇస్తున్నాం. దీన్ని రూ.2,000 చేయాలని ఆలోచిస్తున్నా’ అని బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

‘అన్నదాతా సుఖీభవ’లో భాగంగా
రైతుల ఆర్థిక వెసులుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో భారీ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తక్షణ సాయంగా రాష్ట్ర్రంలో సాగులో ఉన్న 2 కోట్లకుపైగా ఎకరాలకు, రూ.2,500 చొప్పున సుమారు రూ.5వేల కోట్లు అందజేయనుంది. ఈ మొత్తాన్ని అసలు రైతులు(భూయజమానులు), కౌలు రైతులకు ఎలా పంచాలన్న అంశంపై సర్కారు తుది కసరత్తు చేస్తోంది. అసలు రైతులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అసలు రైతులే సాగుచేస్తున్న చోట ఎకరానికి రూ.2,500 చొప్పున వారికే చెల్లిస్తారు. కౌలు రైతులున్న చోట.. 50:50 లేదా 60:40 నిష్పత్తిలో ఇద్దరికీ పంచాలని భావిస్తోంది. ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలుచేయాలని మొదట భావించినా.. కష్టాల్లో ఉన్న రైతుల్ని వెంటనే ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరానికి రూ.2,500 చొప్పున ఇప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అప్పుడు ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.5,000 చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేయాలన్నది ప్రతిపాదన. ఆ లెక్కన 2కోట్ల ఎకరాలకు ఏటా రూ.20వేల కోట్లు అందజేయాల్సి ఉంటుంది. పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...