Jump to content

RMP Dr ni kottina Ongole BJP cadre


vinayak

Recommended Posts

ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత…డాక్టర్ ని చితకబాదిన బిజెపి కార్యకర్తలు

By
 TrendingTelugu
 -
July 9, 2018
208
aa.jpg
 

ఒంగోలు పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి …కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలిలో కేంద్రంలో ఉన్న బిజెపి విధానాలతో విసుగెత్తి బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పై చెప్పు విసిరేసిన ఒక సామ్యుడు అయిన లారీ డ్రైవర్ పై అమానుషంగా దాడి చేసిన బిజెపి కార్యకర్తలు మరో సారి ప్రత్యేకహోదా కావాలి అని అడిగినందుకు ఒంగోలులో ఒక డాక్టర్ పై దాడి చేసారు

 

వివరాల్లోకి వెళితే మేము ఏమయినా చేస్తాం , ఎలా అయినా ఉంటాము కానీ మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ఎవరి మీద అయినా దాడి చేస్తాం అన్నట్లు ఉంది బిజెపి వారి నైజం …కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం పై సామాన్యులు ఒక్కొక్కరిగా గళం విప్పుతున్నారు …వారు మోసం చేసిన విషయం పక్కన పెడితే కనీసం రాష్ట్రానికి జరిగిన మోసం పై రాజ్యాంగబద్ధంగా నిరసన ప్రకటించిన వారి పై దాదాగిరి చెలాయిస్తూ ప్రత్యక్ష దాడులకి దిగుతున్నారు …

ఒంగోలులో బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా పర్యటన సందర్భంగా స్థానిక ఆర్ ఎం పి డాక్టర్ అయిన శ్రీనివాస్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా కావాలి అని ప్లకార్డు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన ప్రకటించగా …అది చూసిన కన్నా వెంట ఉన్న బిజెపి కార్యకర్తలు నడి రోడ్డు పై సదరు డాక్టర్ ని
విచక్షణారహితంగా చావా బాదారు …వెంటనే అప్రమత్తమయిన పోలీసులు బిజెపి కార్యకర్తలను అదుపులోకి తీసుకోవటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది …ఈ దాడిని స్వయంగా వీక్షించిన స్థానిక ప్రజలు బిజెపి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...