Jump to content

partnership summit భాగస్వామ్యం' ఫలిస్తోంది!


Recommended Posts

భాగస్వామ్యం' ఫలిస్తోంది!
మొదటి విడతలో రూ.2,955.52 కోట్ల పెట్టుబడులు
పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన 18 సంస్థలు

ఈనాడు, అమరావతి: విశాఖ భాగస్వామ్య సదస్సు ఫలాలు త్వరలో అందబోతున్నాయి. నాడు వివిధ సంస్థలు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు సాకారమయ్యేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. మొదటిదశలో 18 సంస్థలతో రూ.2955.52 కోట్ల పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) అందించిన వీరందరికీ ఏకగవాక్ష విధాన పోర్టల్‌లో తదుపరి అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునేలా పరిశ్రమలశాఖ సూచనలు చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వివిధ పారిశ్రామిక సంస్థలు పలు రంగాల్లో రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో పరిశ్రామిక రంగంలో చేసిన ఒప్పందాలు సాకారమయ్యేలా గత రెండు నెలలుగా అధికారులు యత్నిస్తున్నారు. 60 పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి మూడు విడతలుగా నిర్వహించిన సమావేశాలకు 40 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి విడతగా 18 సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), కర్మాగారాల, పరిశ్రమలశాఖల నుంచి తదుపరి అనుమతులిచ్చేలా ఉన్నత స్థాయి సమావేశం ఆదేశాలిచ్చింది. మొదటి విడతలో ముందుకొచ్చిన సంస్థల్లో అత్యధికం విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఏపీఐఐసీ తరఫున వీరందరికీ స్థలాల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పెట్టుబడుదారుల్లో కొందరు పారిశ్రామికవాడల్లో భూములు, స్థలాలను పరిశీలించాయి.

24ap-story5b.jpg
 
 
 

కథనాలు

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...