Jump to content

కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మమతా


Sravanlokesh

Recommended Posts

తానేమీ బంగారు పరుపు పైనుంచి రాజకీయాలు చేయట్లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో రెండు సార్లు పర్యటించడంపై మమతా వ్యంగ్యాస్త్రం సంధించారు. అలాగే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ రాక కోసం ఎదురుచూస్తూ ఎప్పుడో వికసించే పువ్వు కాదని మమతా బెనర్జీ తెలిపారు.

 

పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటన చేపట్టారని తృణమూల్ పార్టీ ధ్వజమెత్తింది. దీన్ని ధ్రువీకరించే రీతిలో కొల్‌కతాలో గతంలో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీపై మమత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని వలసపక్షిగా వ్యాఖ్యానించారు.

 

దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా మమతా బెనర్జీ బంగారు పరుపు పైనుంచి రాజకీయాలు చేస్తున్న విషయాన్ని మరిచిపోకూడదంచూ కాంగ్రెస్ నేతలు చురకలంటించారు. కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ.. తాను బంగారు పరుపుపై రాజకీయాలు చేయట్లేదన్నారు.

 

తాము ఎప్పుడో వికసించే సీజనల్ ఫ్లవర్ కాదన్నారు. ఎన్నికల ముందు ప్రజలను పలకరించి, ఆపై కనిపించకపోయే వ్యక్తులు నాయకులు కారని మమతా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాభివృద్ధికి తాను చేసిన సంక్షేమ పనులను ఫింగర్ టిప్స్‌లో పెట్టుకుని ఉన్నానని మమతా అన్నారు.

 

ఎండనక వాననక సంవత్సరమంతా ప్రజల కష్టాలను అడిగితెలుసుకునేందుకు తాను పర్యటన చేపడుతానని, ప్రజల కష్టనష్టాల గురించి తనకు బాగా తెలుసునని మమత వెల్లడించారు. ఇతరుల్లా (రాహుల్ గాంధీని ఉద్ధేశించి)కాకుండా సాధారణమైన హవాయ్ చెప్పులతోనే పర్యటన చేపడుతానని మమతా తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...