Jump to content

అవినీతితో ప్రజల సొమ్ము మింగుతున్న కాంగ్రెస్‌ : దేవినేని


Sravanlokesh

Recommended Posts

విజయవాడ: ప్రభుత్వ వైఫల్యం� స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా ప్రజల్లోకి వెళదామని కృష్ణాజిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ గాలి కొదిలేసిందని, అంతులేని అవినీతితో ప్రజల సొమ్ము ఆబగా మింగుతున్న కాంగ్రెస్‌ ను భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి దోహదపడేందుకు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుందంటే అది పార్టీ ఉద్యమాలు, ఆందోళనల ఫలితమేననీ నగరంలో కూడా ఆ దిశగా పురోగమించేందుకు సంసిద్ధం కావాలని అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జిల్లాలో నియోజకవర్గ సమీక్షా సమావేశాలు ప్రారంభించారు. మొట్ట మొదటిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమావేశాన్ని విద్యాధరపురం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఉద్యమాల ఫలితమే జిల్లాలో ఆదరణ అని, ఒకపక్క రైతులు ఎరువులు అందక ఆందోళన చెందుతుంటే మంత్రి రఘువీరా అండమాన్ వెళ్ళా రని, దుర్గగుడి పనుల్లో జరుగుతున్న అవినీతి మంత్రికి పట్టడం లేదని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉందని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలో పార్టీ మరింత బలపడాలని వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. అక్టోబరు 2న మద్యపాన నియంత్రణ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనాలన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రోజులో 18 గంటలపాటు పార్టీ కోసం కృషి చేస్తున్నారని, పార్టీ పునర్వైభవానికి ఆయన చేస్తున్న కృషిలో భాగంగా ప్రతి కార్యకర్తా సంసిద్ధమైతే తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని వారు తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...