Jump to content

'బృందావనం' ఆడియో విడుదల...విశేషాలు


Jag@NTR

Recommended Posts

అందరం అనుకున్నట్టుగానే ఆదివారం సాయంత్రం శిల్పకళావేదిక లో అట్టహాసంగా జూ ఎన్టీఆర్ బృందావనం ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి అతిరధ మహారధులు హాజరవ్వడం జరిగినది. ఈ సినిమా ఆడియోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సిద్దార్ద్ హాజరయ్యారు. అంతేకాకుండా హీరోయిన్లు సమంతా, కాజల్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. బృందావనం అందరిది అలాగే గోవిందుడు కూడా అందరివాడేలే అంటూ అలనాటి ఆపాటని తెలుగు శ్రోతలెవరూ మరచిపోలేరు. ఆ పాట పదాలతోనే ఈ సినిమానితెరకెక్కించామని అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి బృందావనం అందరిదీ ఎన్టీఆర్ అందరివాడేలే అంటూ ఎన్టీఆర్ అభిమానులను ఉత్సాహపరిచాడు. రాజమౌళి మాట్లాడుతూ "తారక్ ను శ్రీకృష్ణుడుగా చూపించాలనే కోరిక నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ అవకాశం వంశీకి దక్కింది. ఎన్టీఆర్ ను కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరకి చేసే చిత్రమిది. తనతో చేయబోయే చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తా" అన్న్రారు. దిల్ రాజు మాట్లాడుతూ మా డ్రీమ్ హీరో ఎన్టీఆర్. ఆయనతో సినిమా చెయ్యాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా. అది ఈ నాటికి నెరవేరింది. మమ్మల్ని నిర్మాతలుగా, పంపిణిదారులుగా నిలబెట్టింది ఎన్టీఆర్ ఆది సినిమా. ఎన్టీఆర్ వైవిధ్యంగా చూపెట్టే ప్రయత్నం చేశాం. అందరిఅంచనాలను మించిపోయేలా ఉంటుందీ చిత్రం. పెద్ద ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు గుర్తుకోచ్చేలా ఉంటుందీ బృందావనం అన్నారు. ఎన్టీఆర్ తో సినిమా చేయడం మరచిపోలేనని బృందావనం దర్శకుడు వంశీ అన్నారు.

 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ దర్సకులంటే నాకు గుర్తుకోచ్చేది రాజమౌళి, వివి వినాయక్ . మా ముగ్గురి జీవితాలు ఒకే తరహాలో మొదలయ్యాయి. ఏదైనా కొత్తగా చెయ్యాలని ఎప్పుడూ చెబుతుంటాడు రాజమౌళి. మొదటినుంచీ నాకు స్పూర్తి ఆయనే. నా జీవితంలో బృందావనం ఒక గోప్ప చిత్రంగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ కొత్తగా కనిపించాలనే అభిమానుల ఆశలను ఈ సినిమాతో నెరవేర్చపోతున్నా. నేను చేసిన ఈ ప్రయాత్నాని ఆదరించి నా కలలను కూడా నిజం చేయాలని అభిమానులు. సినిమా అంటే విపరీతమైన ప్రేమ కలిగిన వ్యక్తి వంశీ. ఇక ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ నాకు ముందునుంచి తెలుసు. ఈ సినిమా కోసం తమన్ అందించిన బాణీలు చాలా బాగున్నాయన్నారు. ఈ సినిమా మొట్టమొదటి ఆడియో సీడీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి అందజేశారు. అలాగే ఆడియో క్యాసెట్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతులు మీదగా సిద్ధార్ధ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అశ్వనిదత్, మెహర్ రమేష్, శ్రీహరి, బోయపాటి శ్రీను, చోటా కె నాయుడు, కొడాలి నాని, బ్రహ్మనందం తదితరులు పాల్గోన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...