Jump to content

నేల విడిచి సాము చేయను , నా పరిమితులలోనే ఉంటా


Jag@NTR

Recommended Posts

నేల విడిచి సాము చేయను

నా పరిమితులలోనే ఉంటా

పేరుకే ఐదు, పదికోట్ల డైరెక్టర్.. అంత ఎవరూ ఇవ్వలేదు

స్టోరీలైన్‌ను యథాతథంగా తెరకెక్కించడం వల్లే హిట్లు

పెద్ద సినిమా అందరికీ గుదిబండే

'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో దర్శకుడు రాజమౌళి

 

ఇంటర్ ఇన్‌స్టాల్‌మెంట్లలో పూర్తిచేసి, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకునిగా ఎలా ఎదిగారు?

చదువుకు, సినిమాకు సంబంధం లేదు. మా కుటుంబంలో చాలామంది ఈ రంగంలో ఉండటంతో అన్ని రంగాల్లోనూ అసిస్టెంట్‌గా పనిచేయడం నాకు కలిసొచ్చింది.

 

మీరు చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఏమనిపించింది?

ప్రతి సినిమాకీ టెన్షన్ పడతాను. హిట్ అవుతుందని ఎవరికీ తెలీదు. ముందనుకున్న స్టోరీలైన్‌ను యథాతథంగా పట్టుపట్టి తెరకెక్కించడంతో విజయవంతం అవుతుందని అనుకుంటా.

 

మీ సినిమాల్లో ఇంగ్లీషు వాటి ప్రభావం ఉంటుంది. బాగా చూస్తారా?

చిన్నప్పటి నుంచి బాగా చూసేవాడిని. అలా మనవి ఎందుకు ఉండట్లేదు అనుకుంటాను. నేరుగా కొన్ని షాట్లే కాపీ కొడతాను. హాలీవుడ్ నుంచి ఎంత కాపీచేసినా వారిపై ప్రభావం ఉండదు. మనవి అలా కావు.

 

మీ సినిమాలో చేసిన హీరోకు ఆ తర్వాత హిట్లు రావన్న పేరుంది..

పెద్ద సినిమా అనేది అందరికీ గుదిబండే. అందుకే సింహాద్రి తర్వాత సై తీశాను. మగధీర తర్వాత మర్యాదరామన్న.

 

స్టూడెంట్‌నెం.1 అవకాశం మీకెలా వచ్చింది?

శాంతినివాసం సీరియల్ చేస్తుండగా రాఘవేంద్రరావుగారికి ఈ ప్రాజెక్టు వచ్చింది. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ముందు తారక్‌ని చూడగానే ఓరి దేవుడా.. నా మొదటి సినిమాకి ఈడు దొరికాడేంటి అనుకున్నాను. కానీ, పదిరోజులకి అతడిలో నటుడేంటో నాకు తెలిసింది.

 

సినిమా పిచ్చి ఎలా పట్టుకుంది?

చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం అలవాటు. సీనియర్ ఇంటర్ అయ్యిందనిపించాను. ఆ తరువాత ఏం చేస్తావని నాన్నగారు అడిగేవారు. ఆయన్ను తప్పించుకోడానికి ఎడిటింగ్‌లో చేరాను. దర్శకులకు ఫైట్‌సీన్లు చెప్పేవాడిని. రషెస్ చూస్తే అలా ఉండేది కాదు. దాంతో నేనే తియ్యాలనుకున్నాను.

 

మగధీర హిట్‌కు రాజమౌళి, శ్రీహరే కారణమని దాసరి అన్నారు. అంగీకరిస్తారా?

కాదు. ఆ సినిమాకు ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అయినా దర్శకుడి పాత్ర సినిమా బాగా తియ్యడం వరకే. అది బాగా ఆడటం నటుల్లోను, రాబట్టుకునే శక్తి నిర్మాతలోను ఉండాలి.

 

మల్టీస్టారర్‌కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?

అభిమానులతో సమస్య వస్తుంది. హీరోలు సిద్ధంగానే ఉంటారు.

 

ఈగ అనేపేరుతో ఏమైనా తీస్తున్నారా?

అనుకున్నాను. చిన్న సినిమా ప్రయోగాత్మకంగా తీసి, తక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నా. కానీ దానికి అలా కుదరదు అనిపిస్తోంది. ఆ సినిమాలో ఈగే హీరో. తర్వాత ప్రభాస్‌తో చేయాలి.

 

మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఎవరు?

హీరోయిన్లలో అనుష్క చాలా ఇష్టం. అభిమాన హీరో ఎవరో పబ్లిగ్గా చెప్పేటంత మూర్ఖుడిని కాను. పాతవాళ్లలో రామారావుగారిని, తర్వాత చిరంజీవి గారిని ఆరాధించేవాళ్లం.

 

మీకు పారితోషికం ఎక్కువ అనుకుంటా?

అది సరికాదు. నేను ఎక్కువ తీసుకోవాలనే అనుకుంటాను. కానీ, నేల విడిచి సాము చేయకపోవడం వల్ల నా పరిమితి నేను విధించుకుంటాను. నాకున్న స్థాయి కంటే కోటి, కోటిన్నర తక్కువే తీసుకుంటా. మా కుటుంబం అంతా పనిచేస్తుంది గానీ, ఎవరి పారితోషికం వారిదే. నాకొచ్చిన అత్యధిక ఆఫర్ పదికోట్లు. అది ఒప్పుకోలేదు. పేరుకే ఐదు, పదికోట్ల డైరెక్టర్‌ని గానీ, ఇంతవరకు అంత ఇచ్చిన నిర్మాత ఎవరూ లేరు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...