Jump to content

puppy aakhariki thivaaree ni enkeysukosthunnaavaa?


Cyclist

Recommended Posts

చిరంజీవి అంటే పడి చచ్చే ఫాన్స్ లక్షల్లో ఉంటారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఈ ఫాన్ ఫాలోయింగ్ రాశిలోనూ, వాసిలోనూ మరింత బలపడింది. అందుకే ఆ పార్టీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 18 సీట్లు కైవసం చేసుకుంది. ఇంత మంది అభిమానులను మూటగట్టుకున్న పీఆర్పీ కూడా మరో గొప్ప నాయకుడికి అభిమానిగా మారిపోయింది. ఆ గొప్ప నాయకుడు మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ! రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజ్‌భవన్‌లోనే రాసలీలలకు పాల్పడి, కేంద్రం ఉద్వాసన చెబితే కిమ్మనకుండా తిరుగుటపా కట్టిన తివారీ! రెండో భార్య కేసులో ఇప్పటికీ కోర్టులో కేసు ఎదుర్కొంటున్న తివారీ ఇంత హఠాత్తుగా పీఆర్పీకి ఎందుకు ముద్దొచ్చారంటే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌పై అక్కసుతోనే! అంతటితో ఆగలేదు! ఆంధ్రజ్యోతి పత్రికపై గతంలో ఎమ్మార్పీఎస్ చేసిన దాడిని దేశమంతా ఖండించింది.

 

ఆ దాడి ఘటన, ఆ సందర్భంగా ఆంధ్రజ్యోతి సంపాదకుడి అరెస్ట్.. పీఆర్పీ దృష్టిలో నేర చరిత్రగా కనిపిస్తోంది. వీటన్నింటినీ వెనకేసుకురావడం వెనుక కారణం ఏబీఎన్‌పై ఉక్రోషమే! ఆ కడుపు మంటతోనే.. తన ప్రతిష్ట నాశనమైపోవడానికి ఏబీఎన్ కారణమంటూ ప్రజారాజ్యం ఉడికిపోతోంది. తమ పార్టీ ఆర్థిక పరిస్థితిపై ఏబీఎన్ చానల్ ప్రసారం చేసిన కథనంపై లేటుగానైనా.. నాటుగా స్పందించిన పీఆర్పీ శ్రేణులు ఏబీఎన్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి.. సిబ్బందిపై దాడికి దిగారు. పైగా తాము గాంధేయ మార్గంలో ఆందోళన చేయడానికి వెళితే తమను ఏబీఎన్ సిబ్బంది చితకబాదారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్లు కట్టుకుని.. కట్టు కథనాలు వినిపించారు.

 

ఏబీఎన్ సిబ్బందే వారి కార్యాలయంపై రాళ్లు రువ్వుకుని, తమపై తాము దాడి చేసుకున్నారంటూ పీఆర్పీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఏబీఎన్‌పై జరిగిన దాడికి పాత్రికేయ ప్రపంచం ఏకకంఠంగా నిరసన తెలిపింది. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే పెను సవాలని సాక్షాత్తూ ఎడిటర్స్ గిల్డ్ వ్యాఖ్యానించింది. వివిధ రాజకీయ పార్టీలు దాడి సబబు కాదన్నాయి. అయినా... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు... అంటూ వ్యవహరించింది ప్రజారాజ్యం పార్టీ. మొగసాలకెక్కిన చందంగా.. ముఖ్యమంత్రి దగ్గరకు ఓ వినతి పత్రం పట్టుకెళ్లి.. తమ కడుపుమంటను వెళ్లగక్కింది. ఏబీఎన్, దాని సిబ్బంది నుంచి తమ ఎమ్మెల్యేలకు ముప్పు పొంచి ఉందంటూ.. తమ వారిని కాపాడాలని మొర పెట్టుకుంది.

 

పత్రికాస్వేచ్ఛను ఈ చానల్ పూర్తిగా దుర్వినియోగం చేసిందని, మరో రాజకీయ పార్టీకి మేలుచేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి... ఒక వార్తా చానల్ ముసుగులో ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందని పీఆర్పీ ఎమ్మెల్యేలు తేల్చారు. పాత్రికేయ విలువలను, ప్రజల అభిరుచులను ఈ చానల్ మంటగలిపిందని, అందువల్ల చానల్‌ను శిక్షించాల్సిందేనని అన్నారు. లేనిపక్షంలో జర్నలిజానికే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ రేటింగ్ పెంచుకునే ప్రయత్నాలేనంటూ నిస్సిగ్గుగా ఫిర్యాదు చేయడమే కాక... మరో ప్రాంతీయ పార్టీ కోసమే తమను టార్గెట్ చేస్తున్నారంటూ వాపోయింది.

 

ప్రజలకు సేవ చేయాలనే పవిత్ర లక్ష్యంతో తమ అధినేత చిరంజీవి పార్టీని ప్రారంభించారని మొదలు పెట్టిన వినతి పత్రంలో.. పార్టీ పెట్టి ప్రజా సేవకోసం తనకు ప్రీతి పాత్రమైన సినీ రంగాన్ని చిరంజీవి త్యాగం చేశారని పేర్కొన్నారు. తమకు 17% ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలు వచ్చాయని తెలిపారు. అక్కడి నుంచి ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి దిన పత్రికపై అక్కసుగక్కేశారు. తమ పార్టీ దివాలా తీస్తోందంటూ ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' పూర్తి అసత్య కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించారు. పార్టీ అధినేత సోదరులైన పవన్‌కళ్యాణ్, నాగేంద్రబాబులను సైడ్ యాక్టర్లుగాను, ఆయన బావమరిది అల్లు అరవింద్‌ను విలన్‌గాను కూడా చిత్రీకరించారని వాపోయారు.

 

పార్టీ పరువు ప్రతిష్ఠలను మంటగలపాలనే ఉద్దేశంతోనే ఈ కథనాన్ని అంతర్జాతీయంగా ప్రసారం చేశారని ఆరోపించారు. కొన్ని స్వార్థ ప్రయోజనాలతోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేసిందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితేనే ఇదంతా వెలుగులోకి వస్తుందన్నారు. పైగా టీఆర్పీ రేటింగులు పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఆరోపించారు. పేదలకు సేవ చేయడంతో తమ అధినేత చిరంజీవికి దేశంలోనే ఉన్నత స్థాయి పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ వచ్చిందని ఘనంగా చెప్పుకొన్నారు.

 

ఇప్పటివరకు ఆంధ్రజ్యోతి పత్రికలోను, ఏబీఎన్ చానల్‌లోను తమ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కథనాలొచ్చినా.. తాము పత్రికా స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకుని అపారమైన సహనాన్ని ప్రదర్శించామన్నారు. కానీ, వారు మాత్రం అన్ని హద్దులూ దాటేశారని చెప్పారు. ఇక ఈ నెల 22వ తేదీన జరిగిన ఘటనలపై పరిధిలు దాటి మరీ అసత్యాలు గుప్పించారు పీఆర్పీ ఎమ్మెల్యేలు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కొందరు 'గాంధేయ మార్గం'లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఏబీఎన్ చానల్ కార్యాలయానికి వెళితే.. చానల్ ఎండీ వి.రాధాకృష్ణ తన సిబ్బంది సాయంతో మొరటుగా ప్రవర్తించి, తమ పార్టీ కార్యకర్తలను తిట్టి, కొట్టేలా సిబ్బందిని రెచ్చగొట్టారని ఆరోపించారు.

 

కాకలుతీరిన పాత్రికేయుడైన రాధాకృష్ణ.. వాస్తవాలను వక్రీకరించి తమపార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారని, పార్టీ అధినేతకు పరువునష్టం కలిగేలా వారి రిపోర్టర్లతో అనేక విషయాలు చెప్పించారని వాపోయారు. వారి చేతుల్లో దారుణంగా దెబ్బలు తిన్న కొంతమంది పార్టీ కార్యకర్తలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా.. పోలీసులు బెయిలబుల్ సెక్షన్ల కిందే కేసులు నమోదు చేశారని.. చానల్ ఎండీపై గానీ, సిబ్బందిపై గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, 'కనీసం అరెస్టు కూడా చేయలేద'ని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.

 

ఇక ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికల ప్రసారాలు, వార్తలపైనా బురదజల్లేందుకు పీఆర్మీ ఎమ్మెల్యేలు వెనుకాడలేదు. ఏబీఎన్ చానల్ రాకముందు ఆంధ్రజ్యోతి పత్రిక కొందరు వ్యక్తుల గురించి అవాస్తవ, పరువు నష్టం కలిగించే వార్తా కథనం ఇచ్చిందని, ఫలితంగా ఆ కార్యాలయం ఎదుట గతంలో కొన్ని నిరసనలు కూడా జరిగాయని పరోక్షంగా ఎమ్మార్పీఎస్ దాడి ఉదంతాన్ని పీఆర్పీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కలానికి సంకెళ్లు వేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఓ సందర్భంలో పత్రిక సంపాదకుడు, కొందరు సీనియర్ జర్నలిస్టులు కూడా అరెస్టయ్యారంటూ ఆ ఘటనపై నేర చరిత్ర మసి అద్దే పన్నాగం పన్నారు.

 

అర్ధరాత్రి.. అక్షరానికి బేడీలు వేసి పట్టుకెళ్లినా.. వెరవని ఘన చరిత్ర... పీఆర్పీ దృష్టిలో నేర చరిత్రగా కనిపించింది! ఇన్ని సంఘటనలు జరిగినా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాత్రం విలువలకు కట్టుబడి ఉండకుండా, తన సొంత ఎజెండాతోనే ముందుకెళ్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో మాజీ గవర్నర్ రాసలీలల తివారీని పీఆర్పీ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా తలకెత్తుకున్నారు. రాజ్యాంగాధినేతలకు వ్యతిరేకంగా ఏమాత్రం ఆధారాల్లేకుండా కథనాలు చేసే స్థాయికి ఆ చానల్ వెళ్లిందని, దాన్ని హైకోర్టు అడ్డుకుందని చెప్పారు.

 

ఏబీఎన్ ఆ కథనం ప్రసారం చేసే సమయానికే ఆయన ఇద్దరు భార్యల వివాదంలో తలమునకలై ఉన్న సంగతి బహుశా పీఆర్పీ ఎమ్మెల్యేలు మర్చిపోయారేమో! తివారీ సరస సల్లాపాలపై ఢిల్లీలో బహిరంగ ముచ్చట్లు బహుశా వారికి తెలిసి ఉండకపోవచ్చు! కత్తి మొన మీద నిలబడి చేపట్టిన ఈ సంచలన ఆపరేషన్.. పీఆర్పీ దృష్టిలో టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నంగానే కనిపించింది.

 

ఇదే కథనానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పరిశోధనాత్మక అవార్డు ఏబీఎన్ చానల్‌కు దక్కిన విషయం పాపం పీఆర్పీ నేతలకు తెలియదు! ఇలాంటి వాస్తవాలను వదిలేసిన పీఆర్పీ నేతలు.. కొందరు వ్యక్తులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలపై బురదచల్లడం ఆ చానల్‌కు అలవాటుగా మారిపోయిందంటూ కడుపు చించుకున్నారు. ఇదంతా కేవలం వ్యక్తిగత స్వార్థంతోనే చేస్తున్నారని ఆరోపించారు. మరోప్రాంతీయపార్టీకి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు, అభ్యంతరకరమైన వార్తలను పీఆర్పీకి వ్యతిరేకంగా ఇస్తున్నారన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు సాధారణ పాత్రికేయునిగా ఉన్న చానల్ ఎండీ స్వల్ప వ్యవధిలోనే కోటీశ్వరునిగా ఎదిగారని.. అసలు విషయాన్ని చెబుతుందని ఎద్దేవా చేశారు. పత్రికాస్వేచ్ఛపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్వచనాలూ ఇచ్చారు.

 

మీడియా ఎలా ప్రవర్తించాలో పాఠాలూ చెప్పారు. పత్రికా స్వేచ్ఛ అపరిమితం కాదని, దానికీ రాజ్యాంగబద్ధమైన కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని మలిచేలా మీడియా ప్రవర్తించకూడదని, తప్పుడు ప్రచారం ద్వారా ప్రజల మెదళ్లను కలుషితం చేసేలా ఉండకూడదని హితోక్తులు పలికారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలు, చిరంజీవి అభిమానులను రెచ్చగొట్టేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఓ ప్రయత్నం చేసిందని, అందులో విజయం సాధించిందని అన్నారు. తమ పార్టీ కార్యాకర్తలను గాయపరిచి, ప్రజలకు ఇబ్బంది కలిగించి తమరేటింగులను పెంచుకుందని చెప్పారు. తమ వినతి పత్రంలో కొన్ని డిమాండ్లనూ పీఆర్పీ ఎమ్మెల్యేలు ఉంచారు.

 

1) 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగిన సంఘటనలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి.

2) 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ పైనా, ఆయన ఉద్యోగులపైనా కేసులు నమోదు చేయాల్సిందిగా దర్యాప్తు సంస్థను ఆదేశించాలి.

3) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, వారి సిబ్బంది బారి నుంచి పీఆర్పీ శాసనసభ్యులకు రక్షణ కల్పించాలి.

4) ఎల్లో జర్నలిజాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

5) న్యాయాన్ని కాపాడేందుకు అవసరమైన అన్నిరకాల ఇతర చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలి.

 

ఒక రాజకీయ పార్టీ మీడియా మీద దాడి చేసి.. అంతటితో ఆగకుండా తగుదునమ్మా అంటూ.. మళ్లీ తానే ప్రభుత్వం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు! సినీ నటుడిగా అనేక రికార్డులు నెలకొల్పిన చిరంజీవి.. రాజకీయ నేత అవతారంలో ఇలా కొత్త రికార్డు సృష్టించారనుకోవచ్చునేమో!

Link to comment
Share on other sites

సినీ నటుడిగా అనేక రికార్డులు నెలకొల్పిన చిరంజీవి.. రాజకీయ నేత అవతారంలో ఇలా కొత్త రికార్డు సృష్టించారనుకోవచ్చునేమో!

 

:roflmao: :roflmao: :roflmao: :roflmao: :roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...