Jump to content

ప్రాంతానికి వంచన వ్యక్తిగతంగా కామధేనువు


Cyclist

Recommended Posts

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి విరుగుడుగా

కేంద్ర వంచనతో కమిటీ వేసిందని బాధ పడుతున్నాడు

పాలక పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వుంటూ

కాకా గా పిలిపించుకొనే నేత.

 

తన విషయానికి వస్తే

తనయుల్లో ఒకరిని ఎంపీ గా

మరొకరిని మంత్రిగా చూసి మురుసిపోయి

ముచ్చటగా మూడో కోరికగా

రాష్ట్రపతిని చేయమని తన కోరికను వెల్లడించాడు.

50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ ప్రాజెక్ట్ ను తెప్పించానంటూ

దానికి తన పేరును పెట్టనందుకు బాధపడుతున్నాడు.

గత ముఖ్యమంత్రి మరణిస్తూనే కుమారులతో కలసి అధినేత్రి ని కలిసాడు

విశేషం ఏమన్న మీడియాతో

అమేధీ లో పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నామని

అందుకు అధినేత్రి సహకారం కావాలని

కోరడానికి వచ్చామని సెలవిచ్చాడు.

తన ప్రాంతం లో పెట్టి పదిమంది ఉపాధికి ఇష్టపడని ఈయన

మేడం మెప్పుకోసం మేడం వాళ్ళ జాగీర్లో పరిశ్రమలను పెట్టాలని తహ తహలాడాడు.

తనకోసం కుటుంబం కోసం అధిష్టానాన్ని కామధేనువుగా

వాడుకొనే ఇలాంటి వంచన కారులకు ప్రత్యేక వాదం దగ్గరికి వచ్చేసరికి

కామధేనువే కాస్తా వంచన చేసేదిగా కనిపిస్తోంది.

అప్పుడప్పుడూ ఇలాంటి వారిని అతిధుల్లా పిలిచి

ఉద్రేకపరుచుకొనే విద్యార్ధులు వివేకంతో ఆలోచించాలి

కే సి ఆర్ కు తన పిల్లల పైన మేనల్లుళ్ళ పైన

కాకా కు కుమారుల మీద ఎంత ప్రేమో

తమ కుటుంబంలో తమను అంతే ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారని.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...