Jump to content

Anna malli banam vadiladu


krish2015

Recommended Posts

 

జగనన్న వదిలిన బాణమేనా?

  • నిర్మలా సీతారామన్‌పై గార్గ్‌ ఆరోపణలు
  • ఈయన గతంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శి
  • ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక సలహాదారు
  • విద్యుత్‌ శాఖకు బదిలీచేశారని అలిగి
  • నాడు స్వచ్ఛంద పదవీవిరమణ
  • ఏడాదిగా సైలెంట్‌.. ఇప్పుడిలా టార్గెట్‌?
  • అప్పులు, నిధులను నిరాకరిస్తున్నందుకే
  • గార్గ్‌ను బరిలో దించిన ప్రభుత్వ పెద్దలు?
  • అధికార, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ
  •  

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ ఆర్థిక సలహాదారు సుభాష్‌ చంద్ర గార్గ్‌ తీరుపై రాజకీయ, అధికార వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నట్లుండి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆరోపణలు గుప్పించడం వెనుక జగన్‌ సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. పోలవరం, ఇతర నిధులు రాకుండా అడ్డుపడుతున్నందునే ఆమెను టార్గెట్‌ చేసినట్లు సమాచారం. ఎవరైనా తమకు నచ్చిన విధంగా నడుచుకోకపోతే.. వారిపై ఎవరో ఒకరిని ఉసిగొల్పడం ఈ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహమని అంటున్నారు. నిధుల మంజూరులో గత ఏడాది ఉదారంగా వ్యవహరించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడడం లేదు. నిరుడు జనవరిలో ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి దాటి దాదాపు రూ.13,000 కోట్ల వరకు అదనపు రుణ సదుపాయం కల్పించింది. ఈ ఏడాది కొత్త అప్పుల కోసం రాష్ట్రం పంపిన కొన్ని ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ బ్రేకులు వేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినా ఉపయోగం లేకపోయింది. దీంతో గార్గ్‌ను తెరపైకి తెచ్చి వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నాలకు జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి కేంద్ర మంత్రి ఈ ఏడాది కూడా రాష్ట్రం ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి ఉదారంగా అనుమతులిచ్చారు. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సకి సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేసి.. రూ.5,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునేందుకు అంగీకరించింది. నిబంధనలకు లోబడే కాకుండా చట్ట వ్యతిరేకంగా కూడా రాష్ట్రం నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు పలు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవేవీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనల దశలోనే వాటిని తుంచేసింది.

 

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. అంచనా వ్యయాన్ని రూ.20,398 కోట్లకే పరిమితం చేయాలనుకుంటోంది. ఇది జగన్‌ సర్కారుకు మింగుడుపడడం లేదు. ఇదే జరిగితే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతోంది. కేంద్రాన్ని, మంత్రులను బతిమాలుకోవడం మాని.. టార్గెట్‌ చేయడం మొదలుపెట్టింది. అయితే ప్రభుత్వ పెద్దలు తాము నేరుగా ఏమీ అనకుండా.. గార్గ్‌ వంటి రిటైర్డ్‌ అధికారులతో ఆరోపణలు చేయించి నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నట్లు అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి తనను ఆకస్మికంగా విద్యుత్‌ శాఖకు బదిలీ చేయడంతో గార్గ్‌ నిరుడు జూలైలో స్వచ్ఛందంగా పదవీవిరమణకు దరఖాస్తు చేశారు. గతఏడాది అక్టోబరు 31వ తేదీన ఆయన్ను రిలీవ్‌ చేశారు. తర్వాత జగన్‌ ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది. మరి అప్పుడు ఆరోపణలు చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు? వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని గమనిస్తే.. ఏ వ్యవస్థనైనా టార్గెట్‌ చేయాలనుకుంటే ప్రభుత్వ పెద్దలు ఆ వ్యవస్థకు చెందిన వ్యక్తులతోనే ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారు. అప్పుల ప్రతిపాదనలను అంగీకరించడం లేదని ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిని టార్గెట్‌ చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...