Jump to content

Virata parvam


ramntr

Recommended Posts

‘విరాటపర్వం’లో రానా ఫస్ట్‌లుక్‌

‘విరాటపర్వం’లో రానా ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్‌: ‘లీడర్‌’ చిత్రంతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమై.. ఎన్నో విభిన్న పాత్రాల్లో నటించి, టాలీవుడ్‌ భల్లాలదేవుడిగా పేరు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. శనివారం రానా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం రానా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘రెవల్యూషన్‌ ఈజ్‌ యాన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌’ అని పోస్టర్‌పై రాసి ఉంది. ఇందులో రానా ముఖానికి ఓ ఎర్రటి క్లాత్‌ కట్టుకుని కనిపించారు. ఆయన లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘విరాటపర్వం’ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్లపై సురేశ్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రానాకు జంటగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్‌గా కనిపించనున్నారని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో టబు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో నందితా దాస్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Producer name ఎవరో db relatives annattu గుర్తు who wanted to make movie in koratala n Jr combo.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...