Jump to content

చివరి క్షణం వరకు వేచి ఉండకుండా.. చంద్రబాబు అనుమతితో ఇప్పటినుంచే..


Recommended Posts

  • - లోకల్‌ ఫైట్‌కు సిద్ధమేనా ?
  • - కేడర్‌ నిలుస్తుందా.. ఖర్చులెలా భరించాలి ?
  • - పంచాయతీ ఎన్నికలపై టీడీపీ తర్జన భర్జన
  • - నైరాశ్యం నుంచి తేరుకుంటున్న శ్రేణులు
  • - నిలబడి.. కలబడదాం అంటూ తాజా మాజీల దిశా నిర్దేశం
  • - అధినేత అనుమతితో ముందుకు సాగుదాం
  • - గ్రామాల్లో మొదలైన పంచాయితీలు
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఎవరూ ఊహించని రీతిలో భంగపడ్డాం. ఓటమి చవిచూశాం. అంతమాత్రాన మనమేమీ చేతులు ముడుచుకుని కూర్చోం. లోకల్‌గా మన సత్తా ఏమిటో చూపెడదాం. ఏం పర్వాలేదు. ధైర్యంగా ముందుకెళ్దాం. పోటీ చేసే వారెవరో ముందుగానే చెప్పండి. రిజర్వేషన్లను బట్టి అప్పటికప్పుడు తేల్చలేం. ముందు మీరంతా సిద్ధంకండి’ అంటూ టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యేలు కేడర్‌లో
స్ఫూర్తి నింపుతున్నారు.
 
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తరువాత కొద్ది రోజులపాటు నైరాశ్యంలో మునిగిన టీడీపీ వర్గాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో తమ బలాబలాలను అంచనా వేస్తున్నాయి. అన్ని సామాజిక వర్గాల్లోనూ తమ కార్యకర్తలకు కొదువలేదని, తగ్గట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి కలబడాలనే లక్ష్యానికి వచ్చారు. ఐదేళ్ల క్రితం సీనే మళ్లీ వచ్చి పడింది. అప్పట్లో వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. తగ్గట్టుగానే తెలుగుదేశంకు తిరుగులేని ఆధిక్యత లభించింది. మిగతా పార్టీలు సోదిలో కనిపించలేదు. ఇప్పటికీ అప్పటి విజయాలను పదే పదే టీడీపీ నెమరేసుకుంటూ వచ్చింది. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక పోరు అనుకున్నంత సులభంగా గట్టెక్కలేమని, ఇదే తరుణంలో పోరుకు సిద్ధపడితే ప్రజలే నిర్ణయిస్తారని టీడీపీ నేతలు ఇప్పటికే ధీమాకు వచ్చారు.
 
టీడీపీలో జరుగుతుంది ఏమిటి ?
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. కోలుకోలేని దెబ్బ తీశాయి. కొందరు మొహం చాటేశారు.. మరికొందరు గెలుపోటములు సహజమేనంటూ ప్రతిపక్ష పాత్రల్లో ఇమిడిపోయేందుకు సిద్ధమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు కావాల్సిన సమాచారం, కుల గణనను పూర్తి చేశారు. ప్రభుత్వం ఓకే అంటే ఎన్నికలు జరిగేందుకు సిద్ధం. అందుకనే తెలుగుదేశం కాస్తంత తేరుకుని ఆ వైపు దృష్టి పెట్టింది. కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగతాచోట్ల వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే తగిన అభ్యర్థుల కోసం అంతర్గత కసరత్తు ఆరంభించారు. గ్రామాల వారీగా కుల గణన పూర్తయ్యింది.
 
బీసీలదే పైచేయిగా మారింది. దీనికి అనుగుణంగానే స్థానిక రిజర్వేషన్‌లో మార్పులు, చేర్పులు. వీటికి తగ్గట్టుగానే ప్రతి స్థానం నుంచి ముగ్గురుకు తగ్గకుండా అభ్యర్థుల కోసం అన్వేషణ సాగుతోంది. తాజాగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారితోపాటు కొత్త ముఖాలను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇది ప్రజల నుంచి వచ్చిన పూర్తి వ్యతిరేకత కాదు. వైసీపీ పాలన చూద్దామని కొందరిలో ఆసక్తి ఈ రకంగా టీడీపీని దెబ్బ తీసింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్‌ల గడువు పూర్తయింది. వచ్చే నెలలో మునిసిపల్‌, కార్పొరేషన్‌ ప్రతినిధుల పదవీ కాలం ముగుస్తుంది. ఆ తదుపరి నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీల వంతు. ఇలా వరుసగా అందరూ స్థానిక ప్రతినిధుల పదవీ కాలం పూర్తయిన తరువాతే ఏకంగా వరుసగా ఎన్నికలు నిర్వహించే వీలుందని టీడీపీ భావిస్తోంది.
 
ఖర్చెలా భరించాలి ?
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల వ్యయం తడిసి మోపెడైంది. మళ్లీ రెండు, మూడు నెలలు గడవక మునుపే స్థానిక ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. ఇంత ఖర్చు మోయడం సాధ్యమేనా ? పోని కిందిస్థాయి నేతలైనా పెట్టుబడి పెడతారా ? అంటే ఇప్పటి వరకు అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఆర్థిక పుష్టి కలిగిన అభ్యర్థులనే రంగంలోకి దింపాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటి నుంచే కసరత్తు చేయని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దెబ్బ తిన్నట్టుగానే నష్టపోతామని, కానీ అధికార పార్టీని ఢీకొనేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేయడం ఉత్తమమని పార్టీ నేతలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత మెజార్టీ నేతలు ‘టూర్‌’లు చేశారు. వెనుతిరిగి వచ్చిన తరువాత ఇప్పుడు స్థానిక పోరుపై దృష్టి పెట్టారు. జనాలకు చేయాల్సిదంతా చేశాం. కాని ఏం చేస్తాం.. ఓడిపోయాం. అంతమాత్రం చేత ఇంట్లో కూర్చోలేం కదా.. జాగ్రత్తగా అడుగులేద్దాం. ఆలస్యం చేస్తే మనకే నష్టం.. తమను కలిసేందుకు వస్తున్న కేడర్‌తో తాజా మాజీలు అనే మాట ఇది. 
 
అధినేత అనుమతి అడుగుదాం: అధినేత చంద్రబాబు అనుమతితో ఇప్పటి నుంచే కార్యరంగంలోకి వెళ్దాం. చివరి క్షణం వరకు వేచి ఉండనక్కర్లేదు. పార్టీ వ్యవహారాలను గుట్టుగా ఉంచుదాం.. అంటూ ఈ మధ్యనే కొన్ని నియోజకవర్గాల సీనియర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు.
Link to comment
Share on other sites

అధినేత అనుమతి అడుగుదాం: అధినేత చంద్రబాబు అనుమతితో ఇప్పటి నుంచే కార్యరంగంలోకి వెళ్దాం. చివరి క్షణం వరకు వేచి ఉండనక్కర్లేదు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...