Jump to content

వదలకపోతే వేటే!


Recommended Posts

  • ఆలయ కమిటీలు, ఇతర పోస్టులు రద్దు?
  • ప్రత్యేక జీవో జారీకి ప్రభుత్వం సిద్ధం.. 
  • జాబితాలో టీటీడీ, ఆర్టీసీ చైర్మన్లు
అమరావతి/తిరుమల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్‌ పోస్టులు, ఆలయ పాలకమండళ్లలో నియమితులై.. ఆయా పదవులకు ఇంకా రాజీనామా చేయని వారిపై వైసీపీ సర్కారు దృష్టి పెట్టింది. సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ఇలాంటి పోస్టుల్లో నియమితులైన వారు స్వచ్ఛందంగా తప్పుకొని రాజీనామా లేఖలు పంపుతుంటారు. కానీ, కొన్ని నామినేటెడ్‌ పోస్టుల నుంచి తప్పుకోవడానికి ఇష్టపడని వారూ ఉన్నారు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఉన్నాయి. పదవికి రాజీనామా చేసే విషయంలో ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య నుంచి ఇప్పటి వరకూ స్పందన లేదు. కీలకమైన టీటీడీ బోర్డుకు కొందరు సభ్యులు రాజీనామాలు సమర్పించినా చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పదవి వీడేందుకు ససేమిరా అంటున్నారు. సెంటిమెంట్‌ రీత్యా రాజీనామా చేయబోనని, కావలిస్తే ప్రభుత్వం తప్పించుకోవచ్చునని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో కనుమూరి బాపిరాజు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. దాంతో టీటీడీయే కాకుండా రాష్ట్రంలో ఇతర ఆలయ పాలకమండళ్ల గురించి ఆరా తీస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వాటిని రద్దు చేస్తూ ప్రత్యేక జీవో జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
 
కాగా, ప్రభుత్వం మారినా టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగడం ఎంతవరకూ సమంజసమో పుట్టా విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ నాపై పోటీచేసి ఓడిపోయారు. 2014లో కూడా నాపై పోటీకి దిగిన ఆయనకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తుంటే పుట్టా సుధాకర్‌యాదవ్‌ మాత్రం రాజీనామా చేయనంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?’ అని రఘురాంరెడ్డి ప్రశ్నించారు.
 
 
Link to comment
Share on other sites

2 minutes ago, sreentr said:

What is the tradition normally

Usual ga aithe resign chesestharu max govt maragane.  Kondaru thesese daka wait chestharu.. Vallani govt GO icchi pekesthundi. 

Ikkada anni vidaluga labha padindi putta uncle yanamala kota lo. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...