Jump to content

ఓ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న దాడి ఇదని - CBN.


Kiriti

Recommended Posts

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎంవోలో ఉన్నప్పుడు ఫోటోలు తీస్తే.. మీడియా ప్రతినిధులపై పీఎంవో సిబ్బంది అరిచారని తెలిసిందని, దీనిబట్టి చూస్తే దొంగలకు వాళ్లే రక్షణగా ఉన్నారని తెలుస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి బ్యాచ్ నిత్యం లాబీయింగ్ చేస్తోందని విమర్శించారు.
 
న్యాయం కోసం పోరాడుతున్నామని, ఏ ఆపరేషన్ మనల్ని ఏం చేయలేవని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేసులున్నాయి కాబట్టి వైసీపీ వాళ్లు భయపడతారని, తమిళనాడులో జయలలిత ఉన్నంత కాలం ఆ ప్రాంతం వైపు బీజేపీ కన్నెత్తిచూడలేదని, ఆమె చనిపోగానే అన్ని ఆపరేషన్‌లు ప్రారంభించారని బీజేపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకొని సభను జరగకుండా డ్రామాలు చేస్తోందన్నారు. కేంద్రం ఏం చేసినా వైసీపీకి బాగానే కన్పిస్తుందన్నారు. బీజేపీతో తమకు వ్యక్తిగత విభేదాలు లేవని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతంగా పోరాడకపోతే అసత్యాలే నిజాలు అనుకుంటారని, ఓ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న దాడి ఇదని, ఎన్టీఆర్ సమయంలో కూడా కేంద్రం ఇలానే ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

ఒక్కరోజులోనే పవన్‌ మాట ఎందుకు మార్చారు?
చంద్రబాబు పాలనకు మార్కులు వేయడానికి ఆయనెవరు‌?

 

అమరాతి: నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి హైదరాబాద్‌లో కూర్చున్న వారికి ఏం తెలుస్తుందని మంత్రి నారా లోకే్శ్‌ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై సీబీఐ విచారణ జరగనుందని ఎవరో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను తాత ఎన్టీఆర్‌, నాన్న చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురానని స్పష్టం చేశారు. శేఖర్‌రెడ్డికి తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన పవన్‌.. ఒక్కరోజులోనే ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.

8 ఏళ్లుగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని..  అంతకు మించి ఎక్కువ ఆస్తులుంటే వారే తీసుకోవచ్చని లోకేశ్‌ సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా అమరావతిలో ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతుంటే విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబుకు రెండున్నర మార్కులు వేయడానికి పవన్‌కల్యాణ్‌ ఎవరని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉండేవారికి ఆయన పడుతున్న కష్టం ఎలా తెలుస్తుందని నిలదీశారు. రాజధాని లేని రాష్ట్రానికి ఒక రూపు తీసుకొస్తోంది ఎవరు? 8 శాతం ఉన్న వృద్ధిరేటును 12శాతానికి తీసుకొచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 16వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం వారికి కనబడటం లేదా? పోలవరం టెండర్లలో అవినీతి ఉంటే నిరూపించాలని సవాల్‌ చేశారు. చంద్రబాబు పడే కష్టాన్ని విమర్శిస్తుంటే తెదేపా కార్యకర్తగా ఎంతో బాధపడ్డానని లోకే్శ్‌ తెలిపారు. బహిరంగ సభలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటికి విలువేం ఉంటుందన్నారు. పవన్‌ ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆది పార్టీ నిర్ణయమని లోకేశ్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...