Jump to content

🧡🔶SRH Fans Thread | Orange Army | IPL17 | 2024🔶🧡


Husker

Recommended Posts

ముంబయి: క్రికెట్‌ ఆస్ట్రేలియా నిషేధం నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అంతకుముందే వార్నర్‌ తాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు వార్నర్‌ స్థానంలో హైదరాబాద్‌ యాజమాన్యం ఎవరిని తన ఆర్మీలో చేర్చుకుంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దీనిపై తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది. వార్నర్‌ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్‌ పెరీరాను జట్టులోకి తీసుకోవాలని సన్‌రైజర్స్‌ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కుశాల్‌ను కలిసిన యాజమాన్యం అతనితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా, దీనిపై ఐపీఎల్‌ నిర్వాహకులు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గతంలో కుశాల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

స్మిత్‌, వార్నర్‌ స్థానాన్ని ఇతరులతో భర్తీ చేసుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే స్మిత్‌ స్థానంలో రహానెకు జట్టు పగ్గాలు అప్పగించినట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రకటించింది. ఇక సన్‌రైజర్స్‌ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుందో వేచి చూడాలి. శిఖర్‌ ధావన్‌, కేన్‌ విలియమ్సన్‌ పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. ఒకవేళ ధావన్‌కు కెప్టెన్సీ దక్కితే ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనే 8 జట్ల కెప్టెన్లు మనవాళ్లే కానుండటం విశేషం.

Link to comment
Share on other sites

  • Husker changed the title to 🧡🔶SRH Fans Thread | Orange Army | IPL17 | 2024🔶🧡

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...