Jump to content

జగన్ పాదయాత్రలో కార్మికులుగా ఇంటర్ స్టూడెంట్స్....


koushik_k

Recommended Posts

 

జగన్ పాదయాత్రలో కార్మికులుగా ఇంటర్ స్టూడెంట్స్....
కర్నూలు: 14ఏళ్లలోపు పిల్లలను పనిచేయించడం నేరం. అందుకేనేమో ఆ వయసు దాటిన ఇంటర్ పిల్లలపై కన్ను పడింది. అంతే డబ్బు ఆశచూపి ఏకంగా 25మంది విద్యార్థులను పనిమనుషులుగా మార్చేశారు. కాలేజీకి వెళ్లాల్సిన సమయంలో వాళ్లతో పనులు చేయిస్తే చదువు కుంటుపడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. ఇదంతా ఏ మారుమూలనో జరగడం లేదు. సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో జరుగుతోంది.
 
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ జోరుగా పాదయాత్ర చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుంటున్న జనంపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పిల్లలను బడికి పంపే ప్రతీకుటుంబానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే పిల్లల ఫీజులను పూర్తిగా తన ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చదువు ద్వారా ప్రతీ పేద కుటుంబంలోనూ వెలుగులు నింపుతానంటూ జనంలో ముందుకు సాగుతున్నారు. కానీ ఆయన వెనక జరుగుతున్నది మాత్రం వేరు.
 
ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలులో జరుగుతోంది. జగన్ వెంట వచ్చే నేతలు, కార్యకర్తల కోసం రోజూ పార్టీ తరపున భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భోజనాల పనులను చేయించడానికి ఎమ్మిగనూరులోని ఎస్‌డబ్ల్యూఆర్ హాస్టల్ విద్యార్థులను తీసుకువచ్చారు నేతలు. మూడు రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పాత్రలు కడగడం, కూరగాయలు తరగడం, తినేవారికి వడ్డించడం, నీరు పోయడం, శామియానాలు, టెంట్లు వేయడం...ఇలా ఒక్కటేమిటి వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ 25మంది విద్యార్థులే చేస్తున్నారు. వాళ్ల వాలకం గమనించిన మీడియా ప్రతినిధులు విషయం ఏంటని ఆరా తీస్తే భయపడుతూ భయపడుతూ ముక్తసరిగా సమాధానం చెబుతున్నారు.
 
విద్యార్థులను పనిలోకి తీసుకువచ్చిన వ్యక్తి మాత్రం వాళ్లను ఉద్దరించినట్లే మాట్లాడుతున్నాడు. ఒక్కో పనివాడికి పార్టీ నుంచి రూ.200 వస్తాయని తాను విద్యార్థులకు రూ.180 చెల్లిస్తానని చెప్పుకొచ్చాడు. పది శాతం కమిషన్ నొక్కేశాడు. చదువుకునే పిల్లలతో పనిచేస్తే తప్పుకదా అని ప్రశ్నిస్తే వాళ్లకు ఫీజులకో, ఖర్చులకో కూలి డబ్బులు పనికొస్తాయి కదా అని గొప్పగా చెబుతున్నాడు. 25మంది విద్యార్థులు మూడు రోజులు పనికి వెళ్లారని వాళ్లు ఉంటున్న హాస్టల్ వార్డెన్‌కు తెలియదు. అతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కూలీలుగా పనిచేసుకుంటున్నారు.
 
డబ్బులు వస్తాయి కదా అని తాత్కాలిక అవసరాల కోసం కాలేజీ ఎగ్గొట్టి పనులకు వెళ్లడాన్ని ఈ విద్యార్థులు అలవాటు చేసుకుంటే వాళ్ల భవిష్యత్తు ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. దీనికి ఎవరు బాధ్యులు అంటే సమాధానం చెప్పేది ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...