Jump to content

అచ్చొచ్చిన ‘అనుసంధానం’!.


Kiriti

Recommended Posts

  • ఉపాధి హామీతో 22శాఖల కన్వర్జెన్స్‌.
  • గ్రామాలకు భారీగా ఒనగూరిన వసతులు.
  • అంగన్‌వాడీ భవనాలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణం.
  • నిర్లక్ష్యానికి గురైన శ్మశానాల అభివృద్ధి
 
 
అచ్చొచ్చిన ‘అనుసంధానం’! .
 
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కన్వర్జెన్స్‌ విధానం కలిసొచ్చింది. కేంద్ర, రాష్ట్ర పథకాలతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా ప్రతి గ్రామానికీ భారీగా మౌలిక వసతులు సమకూరాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధితో పాటు ఐసీడీఎస్‌, గృహనిర్మాణం, సెర్ప్‌, పశుసంవర్థక, మత్స్య, నీటిపారుదల, అటవీ, స్వచ్ఛభారత్‌ మిషన్‌, పాఠశాల విద్య, వ్యవసాయం, ఉద్యానవనం తదితర 22శాఖలతో ఉపాధి నిధులను జోడించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించారు. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లకు ఉపాధి కల్పతరువుగా మారింది. అంగన్‌వాడీ, మండల స్త్రీశక్తి, గ్రామ పంచాయతీల భవనాలు, శ్మశానాల అభివృద్ధి, అప్రోచ్‌ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ తదిత కార్యక్రమాలు పంచాయతీ రాజ్‌ శాఖద్వారా చేపడుతున్నారు. గ్రామ పంచాయతీల నుంచి 50శాతం నిధులు సమకూరిస్తే మిగిలిన 50శాతం ఉపాధి పథకం ద్వారా లభిస్తోంది. కొన్ని పంచాయతీల్లో 10శాతం నిధులు వాటాగా ఇస్తే 90శాతం ఉపాధి ద్వారా కల్పించారు. ప్రవాసాంధ్రుల భాగస్వామ్యంతో వారి సొంత గ్రామాల అభివృద్ధికి కూడా కన్వర్జెన్స్‌ విధానం బాగా ఉపయోగపడింది.
 
రోడ్ల నిర్మాణం
2014 వరకు రాష్ట్రంలో 1,111కి.మీ. మేర మాత్రమే సిమెంట్‌ రోడ్లు నిర్మించగా, 2014-15 నుంచి ఇప్పటివరకు రూ.3149 కోట్లతో 13,192కి.మీ. రోడ్లు పూర్తిచేశారు. మరో 8,799 కి.మీ. నిర్మాణంలో ఉన్నాయి. ఆలాగే ఒక్కో గ్రామంలో రూ.25లక్షల వంతున రాష్ట్రంలో 2,376 కి.మీ. మేర 157 గుర్తించిన మేజర్‌ పంచాయతీల్లో మట్టిరోడ్లు నిర్మిస్తున్నారు. దీనికోసం ఉపాధి నిధులు రూ.17.50లక్షలు కేటాయించనున్నారు.
 
అంగన్‌వాడీ భవనాలు
రాష్ట్రంలో అంగన్‌వాడీలకు భవనాలు లేక కేంద్ర ప్రభుత్వమిచ్చే అరకొర నిధులతో అద్దె గుడిసెల్లో నెట్టుకొస్తుండగా, ఉపాధి పథకం ఆసరాగా నిలిచింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి భవనం నిర్మించాలని సీఎం ప్రణాళికలు రచించారు. రూ.7.50లక్షలతో నిర్మించే ఈ భవనానికి ఉపాధి నిధులు రూ.5లక్షలు, మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా రూ.2లక్షలు, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.50 వేలు ఖర్చు చేస్తారు. ఈ విధంగా మూడేళ్లలో 3,655 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు. మరో 3,559 నిర్మాణంలో ఉన్నాయి. మండల పరిషత్‌ భవనాల నిర్మాణాలు కూడా ఉపాధి నిధులతో చేపట్టారు.
 
ఒక్కోదాన్ని రూ.32లక్షలతో రాష్ట్రంలో 346 భవనాలను పూర్తి చేయగా, మరో 29 నిర్మాణంలో ఉన్నాయి. రూ.15లక్షలతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యాలయం నిర్మించాలని తలపెట్టారు. గత ప్రభుత్వం 472 భవనాలు పూర్తిచేస్తే ఈ మూడేళ్లలో 1,628 గ్రామ పంచాయతీ భవనాలు పూర్తవగా, 871 నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
 
బలహీన వర్గాలకు ఇళ్లు
గతంలో ఎప్పుడూ లేనివిధంగా బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణానికీ ఉపాధి నిధులు అందిస్తున్నారు. ఒక్కో ఇంటికి 90రోజుల పనిదినాలను కల్పించి ఇటుక తయారీకి, మరుగుదొడ్డి నిర్మాణానికి మరో రూ.55వేలు అందిస్తున్నారు. ఈ మూడేళ్లలో 90వేలకుపైగా ఇళ్లకు ఈ నిధులు అందజేశారు.
 
మొక్కల పెంపకం
గత ప్రభుత్వం రూ.4231కి.మీ. మేర రోడ్డుకిరువైపులా మొక్కలు నాటితే ఈ మూడేళ్లలో 19,525కి.మీ. మేర మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. 5 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగుచేసి రూ.375కోట్లు ఖర్చుచేశారు. పశుసంవర్థక శాఖ ద్వారా పశుగ్రాసం భద్రతకు గడ్డి రకాలను పెంచడాన్ని ఉపాధి పథకంతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల్లో ఇప్పటివరకు 40వేల ఎకరాల్లో గడ్డిని పెంచారు. పశువుల తొట్టెలు 7,650 వరకు నిర్మించారు.
 
2009లో ప్రారంభించిన 423 వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులను ఉపాధి నిధుల అనుసంధానంతో విడతల వారీగా ఇప్పటివరకు 62ప్రాజెక్టులను పూర్తిచేశారు. సుమారు లక్ష చెరువులను రూ.1,962కోట్లతో అభివృద్ధి చేశారు. 50ఎకరాల లోపు మైనర్‌ చెరువులను ఉపాధి ద్వారా, అంతకంటే పెద్ద చెరువులను నీటి పారుదల శాఖ ద్వారా చేపట్టారు.
 
ఇంకా ఎన్నెన్నో
  • నీటి సంరక్షణ పనుల్లో భాగంగా అటవీశాఖ ద్వారా నర్సరీలు, చెక్‌డ్యాంలు, కాంటూర్‌ కందకాలు, చిన్న ఊటకుంటలు, రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మిస్తున్నారు.
  • చెత్త నుంచి సంపద సృష్టించేందుకు, 9,558 ఎకరాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌కు ఉపాధి నిధులు ఇస్తున్నారు.
  • సీఎం ఆదేశాల మేరకు పంచాయతీలకు రేటింగ్‌ ఇస్తున్నారు. ఇందులో 7స్టార్‌ రేటింగ్‌లో కీలకమైన ప్రతి ఇంటికీ రూ.10వేల ఆదాయం సమకూర్చే ప్రక్రియలో సెర్ప్‌ విభాగం ద్వారా చర్యలు తీసుకున్నారు.
  • గిరిజన ప్రాంతాల్లో సైతం 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎ్‌ఫసీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల అనుసంధానంతో సిమెంట్‌ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చేపట్టారు.
  • 775 చేపల చెరువులను నిర్మించారు.
  • క్రీడా మైదానాల ఏర్పాటుకు 3,027 గ్రామాల్లో ఒక్కో స్కూల్‌కు రూ.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 70 ఇండోర్‌ స్టేడియాలకు రూ.కోటి ఖర్చు చేస్తున్నారు.
  • 30శాతం విరాళాలతో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన శ్మశానాలను అభివృద్ధి పరిచి స్వర్గపురిగా మారుస్తున్నారు. ఇలా 5,081 శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నారు.
  • కాఫీ బోర్డు అనుసంధానంతో అరకు, పాడేరుల్లో గిరిజనుల 65వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...