Jump to content

నా జీవితానికి సార్థకత తెచ్చింది కార్యకర్తలే


JVC

Recommended Posts

నా జీవితానికి సార్థకత తెచ్చింది కార్యకర్తలే 
ఉగాది, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కలిసి రావడం పూర్వజన్మ సుకృతం 
కార్యకర్తల సన్మాన సభలో చంద్రబాబునాయుడు 
 

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: నా జీవితానికి సార్థకత తెచ్చింది కార్యకర్తలేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గుంటూరులోని రాష్ట్ర తెదేపా కార్యాలయంలో బుధవారం రాత్రి పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సీనియర్‌ కార్యకర్తలు, నాయకులను ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్యాగాలకు మారుపేరుగా పార్టీ కార్యకర్తలు నిలిచారని, కష్టాల్లో కూడా నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు. ఇటువంటి కార్యకర్తలు పార్టీకి ఉండటం నా పూర్వజన్మ సుకృతమని, ఉత్తమ సేవలు అందించిన కార్యకర్తలు, నాయకులను ఉగాది రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవ కలిసి వచ్చిన పర్వదినాన సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ సంక్షేమ పథకాలకు జీవం పోశారని, ఆ రోజుల్లోనే పేదలకు పింఛన్లు అందజేశారని తెలిపారు.

చివరి రక్తపు బొట్టు వరకూ పార్టీ సేవలోనే... చివరి రక్తపు బొట్టు వరకూ పార్టీ సేవలోనే తరిస్తామని, పార్టీ జెండా కప్పుకొనే తుదిశ్వాస విడుస్తామని చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం అందుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కామినేని రామకృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అన్న ఎన్టీఆర్‌ అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తున్నారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.50 వేలు ఆయన విరాళంగా అందిస్తున్నానని ప్రకటించి చెక్కును చంద్రబాబుకు అందజేశారు. గుంటూరుకు చెందిన నవులూరి రాంబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అభిమానినైనా తాను ఆయన సినిమాలు చూసేందుకు పల్నాడు నుంచి రైలులో గుంటూరుకు వచ్చి సినిమా చూసి వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. చివరి రక్తపు బొట్టు వరకూ తెదేపాకు సేవలందిస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన పచ్చ వరప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా పార్టీ గెలవాలన్నారు. తాను సింగిల్‌ విండో అధ్యక్షునిగా పోటీచేస్తే రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి ఏజెంట్లుగా కూర్చున్నారన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ, శాప్‌ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌, దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్‌ బోనుగుంట్ల కోటేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకుడు సాయిబాబులను చంద్రబాబు సన్మానించారు. ఏవీ రమణ మాట్లాడుతూ తనకు తెలిసిందల్లా పార్టీకి అంకితభావంతో పనిచేయడమేనన్నారు. పీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ నుంచి ఆవేశాన్ని, దూకుడును తాను అలవరచుకున్నానని ఆయన వీపు మీదున్న పుట్టుమచ్చను తాకిన అదృష్టం తనకు కలిగిందని గుర్తు చేసుకున్నారు. పూజామందిరంలో దేవునితోపాటు ఎన్టీఆర్‌ చిత్రపటానికి తాను పూజలు చేస్తానన్నారు. తన ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. సాయిబాబా మాట్లాడుతూ తెలుగు మాట్లాడేవారంటే ఎన్టీఆర్‌కు ఎంతో అభిమానమని ఆ విధంగానే ఆయనకు తాను దగ్గరయ్యానని తెలిపారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ తనకు రెండేళ్లప్పుడు పోలియో వచ్చిందంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకానితనమేనని తెలిపారు. దివ్యాంగుడినైనప్పటికీ స్కూటర్‌పై లక్షా నలభై ఏడువేల కిలోమీటర్లు తిరిగి పార్టీకి సేవలు అందించానని గుర్తు చేసుకున్నారు. అనంతరం తెలుగు మహిళలు పోతురాజు ఉమాదేవి, మల్లె విజయ, తిరువళ్లూరి పద్మావతిని చంద్రబాబు సన్మానించారు. బాపట్ల ఎంపీపీ మానం విజేత వరి కంకులను చంద్రబాబుకు అందజేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, కేంద్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్థన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, నారాయణ, జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, శనక్కాయల అరుణ, చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌నాయుడు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జిలు, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

isumanti saathvika maina news ini ini  bore aiyyipoyindhi....emanna baaga thrill feel aiyye news vadhalochchuga Rao garu....

Roja Aunty can only give you that kick and satisfaction Datar oru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...