Jump to content

'Hindu Terrorist' invented by Sambar Chiddu


Cyclist

Recommended Posts

‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఎవరు సృష్టించారు? సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌పై ఉగ్రవాద దాడి జరుగుతుందని ముందే తెలుసా? ఆ దాడిలో భారతీయులు పాల్గొనలేదా? ఈ కేసుతో పాటు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు ఎందుకు, ఎలా మలుపులు తిరిగింది? ఈ ప్రశ్నలకు జవాబులు కాంగ్రెస్‌కు కంటకంగా మారే అవకాశం ఉంది. అలాంటి అంశాలను జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ డాక్టర్ ఎస్‌‌డీ ప్రధాన్ ‘ఐబీఎన్ ఖబర్’కు వివరించారు. డాక్టర్ ప్రధాన్ తెలిపిన వివరాలు ఏమిటంటే...

 

 

హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం రూపొందించారు. 2007నాటి సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ళకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి ముందే తెలుసు. దీనిపై అమెరికా కూడా హెచ్చరించింది. రైలుపై ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంగల పత్రాలు ఇప్పటికీ అధికారికంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీల వద్ద ఉన్నాయి. ఈ దాడిలో పాకిస్థాన్ ప్రమేయం నూటికి నూరు శాతం ఉంది. భారతీయుడు కనీసం ఒక్కడైనా దీనిలో పాల్గొనలేదు. కేవలం రాజకీయ కారణాలతోనే దర్యాప్తును పక్కదోవ పట్టించారు.

 

 

లష్కరే తొయిబా ఫైనాన్షియర్ అరిఫ్ కస్మానీ పేరు అధికారులకు లభించింది. ఇతని గురించి భద్రతాధికారులకు ముందుగానే సమాచారం ఉంది. సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడుకు నిధులు సమకూర్చినవాడు కస్మానీయేనని విశ్వసిస్తున్నారు.

 

 

అయితే సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళు, ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులను రాజకీయ కారణాలతోనే తప్పుదోవపట్టించారు. 2009 ఆగస్టులో స్వీకరించిన ఫైళ్ళను సెప్టెంబరు-అక్టోబరుల్లో పూర్తిగా మార్చేశారు. నిర్దిష్ట లక్ష్యంతోనే తారుమారు చేశారు. 2009లో లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో యూపీఏ గెలిచింది. కానీ 2014 ఎన్నికల నాటికి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ బలం పుంజుకుంటాయని కాంగ్రెస్ నేతలు ముందుగానే గ్రహించారు. ఇదే కారణంతో అప్పటి కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం రాజ్యసభలో మాట్లాడుతూ ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించారు. సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళు, ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుల్లో దర్యాప్తు తీరు మారడానికి అప్పుడే బీజం పడింది.

 

 

చిదంబరం చాలా షార్ప్. సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళ కేసుకు కాషాయ రంగును చిదంబరమే పులిమారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను కూడా నిర్దిష్ట లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని ఏర్పాటు చేశారు. బాస్ మనసు తెలుసుకొని పనిచేసే అధికారులను ఎన్ఐఏలో నియమించారు - అని డాక్టర్ ప్రధాన్ ‘ఐబీఎన్ ఖబర్‌’కు తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...