Jump to content

శాతకర్ణి సాహసం...


NBKsFan

Recommended Posts

సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా నందమూరి బాలక్రిష్ణ అలరించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్రిష్ సహా చిత్ర యూనిట్ జార్జియాలో ఉంది. ఈ నెల 4 నుండి జార్జియాలోని రష్యాకు దగ్గరగా ఉండే ‘‘మౌంట్ కజ్ బెగ్’’ వద్ద యుద్ధ నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెలాఖరు వరకు జరుగనున్న ఈ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలను షూట్ చేయనున్నారు. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలలో డూప్‌ల సాయం తీసుకుంటారు. అయితే బాలయ్య తానే స్వయంగా ఈ సన్నివేశాలలో నటిస్తున్నారట. యువ హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా బాలయ్య లాంటి సీనియర్ హీరో తన వయసుని, రిస్క్‌ని అని భావించక ఈ ఫీట్ చేస్తుండటం విశేషం. ఈ విషయంలో దర్శకుడు క్రిష్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. గతంలో ‘లయన్’ సినిమాకి ఈ సాహసాన్నే చేసిన బసవ తారకపుత్ర ఓసారి గాయాలపాలయ్యారు. హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రేయ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరకర్త.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...