Jump to content

solar power for govt hospitals


Vamsik_hyd

Recommended Posts

ఫీవరాస్పత్రిలో సౌర విద్యుత్
Updated : 2/20/2015 11:49:51 AM
Views : 76
fever-hospital.jpgహైదరాబాద్ : భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యుత్తు కోతల నుంచి ఉపశమనం పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ముందుగా ఉస్మానియా, గాంధీతో పాటు నల్లకుంట ఫీవరాస్పత్రిలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేశారు. విద్యత్ సరఫరాలో అంతరాయం కల్గకుండా, రోగులు ఇబ్బందులు ఎదుర్కోకుండా కోతల నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడి ఆస్పత్రిలో సౌర విద్యుత్‌ను వ్యవస్ధ ఏర్పాటు చేశారు. ఫీవరాస్పత్రిలో సమారు రూ. 70 లక్షలతో 100 కేవీ సామర్థ్యం గల సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ఆవరణలో వైరాలజీ లాబ్, వార్డు 3, 4 భవనాలపై నాలుగు నెలల క్రితం సోలార్ పలకల నిర్మాణపు పనులను ప్రాంరభించి, జనవరిలో పనులను పూర్తి చేశారు. ఆస్పత్రి అన్ని వార్డులు, గదులకు అనుసంధానం చేశారు. సదరు సౌర విద్యుత్ కంపెనీతో 25 ఏళ్ల పాటు ఉచిత సర్వీసు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...