Jump to content

నయవంచన


NTRISMYGOD

Recommended Posts

చేగువేరా పేరు చెప్పి నువ్వు
వేగుచుక్కవైపోలేవురా.
భగత్ సింగ్ పేరు చెప్పి మా
బతుకుల బొంద పెట్టొద్దురా..
సుభాష్ బోస్ పేరు చెప్తే నిన్ను
శభాష్ బాస్ అనలేమురా...

కులం అనే కలం తో
కుట్రలెన్నో రాశేసారు.
అభిమానుల హృదయాలను
అమ్మేసారు హస్తినలో..
తెలుగువారి గౌరవాన్ని
తాకట్టులో పెట్టేసారు...

నిజాయతీ నటిస్తూ
నాటకాలు వేస్తున్నారు.
కాలం పైన చిమ్మేసారు
కాలకూట విషం మీరు..
ఏరు దాటి వెళ్ళేసాక
తెప్ప తగలబెట్టేసారు...

జనపాలన పేరుతోన ధనపాలన చెయ్యొద్దు
పరిపాలన పేరుతోన నయవంచన చెయ్యొద్దు
ప్రశ్నిస్తామంటూ మీరు జవాబులివ్వకుండా పారిపోవద్దు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...