Jump to content

`జగనంత’ జైలు


Recommended Posts

ఖైదీ నెంబర్ : 6093 (లక్షలకోట్లలో నొక్కేసిన వాడికి వేలల్లో నెంబరా…హీహ్హీహ్హీ…)

వీఐపీ ఖైదీ నెంబర్ : 10 (ఖైదీల్లో వీఐపీ ఖైదీలు వేరయా)

సుప్రభాతసేవ : ఉదయం 6-00 గంటలకే నిద్రలేవడం (ఏం చేస్తాం, ఓదార్పు యాత్రతో ఇలాఅలవాటైపోయింది)

అల్పాహారం : జైలుకదా…ఓ చపాతీ, పాలు, కోడిగుడ్డు (నిజానికి నా అల్పాహారం మీకు తెలుసుకదా… పొద్దున్నే ఓ నలుగురి చంపలునిమురుతూ ఓదార్చడమే)

పత్రికాపఠనం : ఆంగ్లపత్రికలు (ఛత్… తెలుగు పత్రికల్లో ఒక్క ఎల్లో పత్రిక తప్ప, మిగతా వన్నీ శుద్ధ వేస్టు…ఎల్లో పత్రిక అంటే నాదే…హీఁ..హీఁహీఁ)

మాటామంతి : జైల్లో ఉన్నా కదా… తోటి ఖైదీలను ఓదారుస్తూ, వాళ్ల కన్నీళ్లు తుడుస్తూ మాట్లాడటమే నా పని (నిజం చెప్పనా, అలా ఓదారుస్తుంటే నా కళ్లలో కూడా నీళ్లు సుడులు తిరిగాయి)

ములాఖత్ : జైల్లో కాబట్టి ములాఖత్ అంటున్నారు. కానీ నిజానికి రోజూ నా పని అదే…వచ్చేవాళ్లూ, పోయే వాళ్లు…ఓదార్పులు…వేడుకోళ్లు…

లంచ్ : పెరుగున్నంలోఅరటి పండు భలే రుచిగా ఉంది సుమీ… నూజివీడు మామిడి రసం కావాలని అడిగా…

జైలుఆశయం : జైలంత జగన్ …ఇదే నాఆశయం… అందుకే ఖైదీల ఓదార్పు మొదలెట్టా

పగటి కల : లంచ్ అయ్యాక కాసేపు కునుకు…కలలో సీఎం కుర్చీ ఏక్కేశా…

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...