Jump to content

ఫ్యాక్షన్‌ రాముడు


kk9999

Recommended Posts

ఫ్యాక్షన్‌ రాముడు

 

 

ntr.jpgగతంలో జూ.ఎన్టీఆర్‌ వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంలో ఫ్యాక్షన్‌ తరహా పాత్రను అవలీలగా పోషించి అందరిమెప్పూ పొందాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్‌ తరహా హీరోగా కనిపించనున్నట్లు తాజా సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దమ్ము’ సినిమాలో జూనియర్‌ ఫ్యాక్షన్‌ హీరోగానేగాక మరో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా దమ్ము చూపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో డైలాగులు కడప బాంబుల్లా పేలతాయంటున్నారు అభిమానులు. ‘ఆది’ చిత్రంలో అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్‌ ఎంతగా ఫేమస్‌ అయిందో విదితమే. బోయపాటి శ్రీను చిత్రాలలో డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ‘సింహా’, ‘తులసి’, ‘భద్ర’ చిత్రాలే నిదర్శనం. దీనికి తోడు ఓ పవర్‌ఫుల్‌ హీరోతో అంతకన్నా పవర్‌ డైలాగులు చెప్పిస్తే ఇక థియేటర్లో విజిల్స్‌...చప్పట్లే అంటున్నారు అభిమానులు. తప్పకుండా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం ఖాయం అని ఇప్పటినుండే అభిమానులు పందాలు కాస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...