Jump to content

"Mitchel Janson Out" of Series


kethineni

Recommended Posts

ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. జాన్సన్‌ ఎడమ కాలి బొటన వేలికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. మిచెల్‌ ఆస్ట్రేలియా తరుపున 47 టెస్టుల్లో 190 వికెట్లు తీశాడు. జాన్సన్‌ వచ్చే 24 గంటల్లో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని బుధవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా మీడియాకు తెలిపింది. 'డాక్టర్లు సర్జరీ తప్పనిసరని చెప్పారు. ఎడమ కాలి బొటని వేలి మృదువైన కండ రూపు దెబ్బతింది' అని సిఎ తెలిపింది. బుధవారం జాన్సన్‌ చికిత్స కోసం మెల్‌బోర్న్‌ బయలు దేరి వెళతాడని సిఎ పేర్కొంది. జాన్సన్‌కు శస్త్రచికిత్స అవసరమని ఐదు నెలల క్రితమే తెలుసని ఆసీస్‌ జట్టు ఫిజియో అలెక్స్‌ కౌంట్రీస్‌ తెలి పాడు. న్యూజి లాండ్‌, భారత్‌తో సిరీస్‌లకు మిచెల్‌ జాన్సన్‌ అందు బాటులో ఉండకపోవడం నిరాశకలిగిస్తోందని కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ తెలిపాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జాన్సన్‌తో పాటులో జట్టులో 'గాయ'కులు ఉన్నారు. ర్యాన్‌ హ్యారిస్‌, ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ గాయాల కారణంగా కివిస్‌తో తొలి టెస్టు నుంచి వైదొలిగారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...